'అశ్వద్ధామ' సెన్సార్ పూర్తి.. రెడీగా ఉన్న నాగశౌర్య

విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. జయాపజయాల సంగతి అటుంచితే నాగశౌర్య నటనకు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో డిఫరెంట్ మూవీ 'అశ్వద్ధామ'తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యాడు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో.

గత సినిమా 'నర్తనశాల'తో ఎదుర్కొన్న పరాజయాన్ని 'అశ్వద్ధామ' సినిమాతో మరిపించాలని నాగశౌర్య ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు 'అశ్వద్ధామ' సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనూ ప్రత్యేక శ్రద్ద పెట్టారు. యాక్షన్, ఎమోషన్ సీన్స్ కలగలుపుతూ నాగశౌర్యనే ఈ కథను తయారు చేయడం విశేషం. అంతేకాదు సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌పై రూపొందిస్తూ ఆయనే నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఈ సినిమా ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

 Naga Shauryas Aswathama Censor report

ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమా చూసిన బోర్డు సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. 2 గంటల 13 నిమిషాల రన్ టైమ్‌తో ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ అంటోంది.

అన్యాయం జరుగుతుంటే తప్పని ప్రతిఘటించిన ప్రతి ఒక్కరూ అశ్వద్దాములే అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచానాలు పెంచేశాయి. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అవుతుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X