‘ఛలో’ ట్రైలర్ అదుర్స్: తెలుగోళ్లు మంచోళ్లు వాళ్లేగా ‘బాహుబలి’ తీసింది..
Recommended Video

"ఊహలు గుసగుసలాడే", "దిక్కులు చూడకు రామయ్య", "లక్ష్మిరావే మా ఇంటికి", "కళ్యాణ వైభోగం"," జ్యో అచ్యుతానంద" లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగ శౌర్య
హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఛలో'. వెంకీ కుడుముల దర్శకుడు. శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో నిర్మాత ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది.

తెలుగు వర్సెస్ తమిళం
తిరుప్పురం అనే గ్రామం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఈ ఊర్లో ఉండే తెలుగు, తమిళ ప్రజల మధ్య జరిగే గొడవలను ఫన్నీగా చూపించారు. ముఖ్యంగా డైలాగులు నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి.

రజనీ మీద డైలాగ్
ఓ సీన్లో వైవా హర్ష....‘నిన్న రాత్రి రజనీకాంత్ నటించిన ‘బాషా' సినిమా టీవీలో చూశాను. ఎంత చేసినా ఆయన తెలుగులో చేసినంత ఈజ్‌తో తమిళంలో చేయలేకపోయారు' అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది.

తెలుగోళ్లు మంచోళ్లు వాళ్లేగా ‘బాహుబలి’ తీసింది..
మరో సీన్లో కమెడియన్ సత్య..... తెలుగోళ్ల మీద నీ ఒపీనియన్ ఏంట్రా అన్న ప్రశ్నకు ‘పాపం మంచోళ్లేరా. వాళ్లేకదా ‘బాహుబలి' తీసింది' అనే డైలాగ్ చెప్పడం గమనించవచ్చు. దీన్ని బట్టి ఈ సినిమా తెలుగు, తమిళ ప్రజల మధ్య జరిగే గొడవ నేపథ్యంలో సాగుతుందని స్పష్టమవుతోంది.

చిరంజీవి చీఫ్ గెస్ట్
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... ఈనెల 25న ఛలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఇప్పటివరకు ఎవ్వరూ చేయని విధంగా వినూత్నంగా ప్లాన్ చేశాం. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా రానున్నారు. ఎంతో బిజీగా ఉండి కూడా ఛోలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నామని తెలిపారు.

పిబ్రవరి 2న సినిమా విడుదల
ఫిబ్రవరి 2న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. మహతి స్వర సాగర్ అందించిన పాటలు అద్భుతంగా వచ్చాయి. సాయి శ్రీ రామ్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్రధాన బలం. అద్భుతమైన విజువల్స్ అందించారు. నాగశౌర్య పెర్ ఫార్మెన్స్ చాలా కొత్తగా ఎనర్జిటిక్ గా ఉంటుంది. తన కెరీర్లో పర్ ఫెక్ట్ కమర్షియల్ మూవీగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాను. హీరోయిన్ రష్మిక మండన్న, నాగశౌర్య మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది... అని నిర్మాత తెలిపారు.

నటీనటులు
నాగశౌర్య, రష్మిక మండన్న, నరేష్, పోసాని, రఘు బాబు, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, ప్రవీణ్, సత్య, వైవా హర్ష, వేణు గోపాల రావు, మెట్ట రాజేంద్రన్, ప్రగతి, స్వప్ని, సుదర్శన్, జీవా తదితరులు
టెక్నీషియన్స్
సాంకేతిక నిపుణులు
పాటలు - భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్
డ్యాన్స్ - రఘు, విజయ్
పి.ఆర్.ఓ - ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైన్స్ - అనిల్ భాను
ఫైట్స్ - వెంకట్
ఆర్ట్ - రామ్ అరసవిల్లి
లైన్ ప్రొడ్యూసర్ - బుజ్జి
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), తమ్మిరాజు
సంగీతం- మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫి- సాయి శ్రీరామ్,
నిర్మాత- ఉషా ముల్పూరి,
సమర్పణ - శంకర ప్రసాద్ ముల్పూరి,
దర్శకత్వం- వెంకి కుడుముల


Click it and Unblock the Notifications











