హీరో నాగశౌర్య వేరు కాపురం: మమ్మల్ని అలానే చూసేది.. కోడలిపై ఉష ముల్పూరి షాకింగ్ కామెంట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు హ్యాండ్సమ్ గాయ్ నాగశౌర్య. రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న అతడు.. కెరీర్‌ను బ్యాలెన్స్‌గా నడుపుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే గత ఏడాదిలో తన గర్ల్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, పెళ్లై ఏడాది తిరగకముందే నాగశౌర్య వేరు కాపురం పెట్టారని అతడి తల్లి, ప్రముఖ నిర్మాత ఉష ముల్పూరి ధృవీకరించారు. అందుకు ఆమె చెప్పిన కారణం ఏంటో మీరే చూడండి!

Naga Shaurya separated from family Says Mother Usha Mulpuri

లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరో: టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య.. బెంగళూరుకు చెందిన అనూష శెట్టితో చాలా రోజుల క్రితమే ప్రేమలో పడ్డాడు. దీంతో వీళ్లిద్దరూ తమ పెద్దలను ఒప్పించి గత ఏడాది నవంబర్ 20వ తేదీన వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ వేడుకలో ఆమె మెడలో మూడుముళ్లు వేసేశాడు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Naga Shaurya separated from family Says Mother Usha Mulpuri

ప్రొఫెషన్‌ను కంటిన్యూ చేస్తూ: అనూష శెట్టి న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసుకుంది. అంతేకాదు, ప్రస్తుతం సొంత కంపెనీ పెట్టుకుని ఇంటీరియర్ డిజైనర్ వ్యవహరిస్తోంది. వివాహం తర్వాత హైదరాబాద్‌లోనూ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని తన ప్రొఫెషన్‌ను కంటిన్యూ చేస్తోంది. అలాగే, నాగశౌర్య కూడా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తున్నాడు.

Naga Shaurya separated from family Says Mother Usha Mulpuri

నాగశౌర్య వేరు కాపురం కూడా: వివాహం చేసుకున్న తర్వాత హీరో నాగశౌర్య సినిమా కెరీర్‌ ఆశించిన రీతిలో సాగడం లేదు. ఈ ఏడాది అతడు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ మూవీలు బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. ఈ నిరాశలో ఉన్న అతడు.. భార్య అనూష శెట్టితో కలిసి వేరు కాపురం పెట్టాడని ఆ మధ్య ఓ న్యూస్ వైరల్ అయింది. దీంతో ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Naga Shaurya separated from family Says Mother Usha Mulpuri

కన్ఫార్మ్ చేసేసిన హీరో తల్లి: హీరో నాగశౌర్య వేరు కాపురం పెట్టాడని కొద్ది రోజులుగా వస్తున్న వార్తలపై అతడి తల్లి, ప్రముఖ నిర్మాత ఉష ముల్పూరి స్పందించారు. ఈ మేరకు తాజాగా ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగశౌర్య తన భార్య అనూషతో కలిసి వేరు కాపురం పెట్టాడని ఆమె స్పష్టం చేశారు. అయితే, దీనికి తామందరం అంగీకారం తెలియజేశామని కూడా ఉష ముల్పూరి వివరించారు.

మమ్మల్ని అలా చూసేదని: తాజా ఇంటర్వ్యూలో ఉష ముల్పూరి మాట్లాడుతూ.. 'అనూష ఎంతో మంచి పిల్ల. ఆమె మాకు మూడేళ్ల నుంచే బాగా పరిచయం. నాగశౌర్యకు సరైన జోడీ అని మాకు అనిపించింది. అందుకే వీళ్లిద్దరి పెళ్లి జరిపించాం. అనూషను మేము కూతురిలా చూశాం. తను కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటుంది. అంతెందుకు మమ్మల్ని తను మమ్మా, డాడీ అని పిలుస్తుంది' అని చెప్పారు.

అనుకునే వేరేగా వెళ్లారని: ఆ తర్వాత ఉష ముల్పూరి 'మా పెద్ద కోడలు యూఎస్‌లోని యాపిల్ కంపెనీలో జాబ్ చేస్తుంది. అనూష ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకొని ఆఫీస్‌కు వెళ్తుంది. ఎంతో బాగా ఆలోచించే అమ్మాయి. అయితే, పెళ్ళైన కొన్నిరోజులకే వాళ్లు వేరు కాపురం పెట్టారు. ఇలా ఉండాలని పెళ్లికి ముందే చెప్పుకున్నాం. దూరంగా ఉండి అప్పుడప్పుడు కలిస్తే బాగుంటుంది' అని అన్నారు.

Naga Shaurya separated from family Says Mother Usha Mulpuri

ఇందులో వేరే ఏమీ లేదు: అనంతరం ఉష ముల్పూరి కంటిన్యూ చేస్తూ.. 'శౌర్య, అనూష వేరేగా ఉండాలని ఇప్పుడు అనుకున్నది కాదు. పిల్లలు పుట్టినప్పుడు, పెరిగినప్పుడే అలా దూరం ఉండాలని అనుకున్నాం. ఈ తరంలో పిల్లలకు స్వేచ్చ కావాలి. మా పిల్లలకు అలాగే ఇచ్చాం. ఇందులో వేరేగా ఆలోచించడానికి, అనుకోడానికి ఏమి లేదు' అని చెప్పారు. ఫలితంగా అందరికీ క్లారిటీ ఇచ్చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X