Rangabali Twitter Review: రంగబలికి ఈ టాక్ ఊహించలేదు.. అసలు హీరో నాగశౌర్య కాదా? ఇంతకీ చూడొచ్చా అంటే!
బ్యాగ్రౌండ్ లేకుండానే టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. హ్యాండ్సమ్ లుక్స్, అదిరిపోయే యాక్టింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు నాగశౌర్య. ఫస్ట్ సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, లవర్ బాయ్ ఇమేజ్‌ను సైతం అందుకున్నాడతను. అలా అతడు చేసిన చాలా సినిమాలు నిరాశనే మిగిల్చాయి. దీంతో పంథాను మార్చుకున్న ఈ యంగ్ హీరో.. విలక్షణమైన కథలతో విభిన్నమైన చిత్రాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు నాగశౌర్య 'రంగబలి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ట్విట్టర్ రివ్యూ మీకోసం!
రంగబలి అంటూ కామెడీగా: నాగశౌర్య నటించిన తాజా చిత్రమే 'రంగబలి'. పవన్ బాసంశెట్టి అనే నూతన దర్శకుడు తీసిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. దీనికి పవన్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించగా.. షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరిలు కీలక పాత్రలు చేశారు.

అలాంటి కథ.. ఎంతో ఫన్‌తో:ఊరిలో అల్లరి చిల్లరిగా తిరిగే హీరో.. ప్రేమలో పడడం.. అలాగే, తన ఊరిలోని ఓ సెంటర్ కోసం విలన్ గ్యాంగ్‌తో పోరాటానికి దిగడం అనే అంశాలతో తెరకెక్కిన సినిమానే 'రంగబలి'. కమర్షియల్ హంగులతో పాటు పూర్తి స్థాయి కామెడీ ఉండేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీంతో ఆరంభంలోనే ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే రిలీజ్ అయింది.

ఫస్టాఫ్ అలా సెకెండాఫ్ ఇలా: నాగశౌర్య హీరోగా నటించిన 'రంగబలి' సినిమాను వీక్షించిన ఒక వ్యక్తి ట్విట్టర్ ఖాతాలో సింగిల్ లైన్‌లోనే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇంతకీ అందులో ఏం రాశాడంటే 'రంగబలి.. ఫస్టాఫ్ రంగ.. సెకెండాఫ్ బలి' అని పేర్కొన్నాడు. అంటే మొదటి సగం కాస్త బాగానే ఉన్నా.. రెండో సగం మాత్రం దారుణంగా ఉందని పరోక్షంగా వెల్లడించాడు.
దాని మీద శ్రద్ద పెట్టాల్సింది: నాగశౌర్య - పవన్ బాసంశెట్టి కాంబినేషన్‌లో వచ్చి 'రంగబలి' సినిమాను చూసిన మరో నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో 'రంగబలి సినిమా ప్రమోషన్స్ మీద పెట్టిన ధ్యాస.. కాస్త సినిమా మీద పెట్టి ఉంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేది. కమెడియన్ సత్యనే వన్ మ్యాన్ షో చేశాడు' అంటూ చెప్పుకొచ్చాడు. తద్వారా ఇందులో హీరో కంటే సత్య ఎలివేట్ అయ్యాడని అభిప్రాయపడ్డాడు.
ఈ ఏడాదిలో చెత్త సినిమా: హ్యాండ్సమ్ గాయ్ నాగశౌర్య హీరోగా.. పవన్ బాసంశెట్టి తెరకెక్కించిన సినిమానే 'రంగబలి'. ఈ మూవీని చూసిన ఇంకొక నెటిజన్ దారుణమైన రివ్యూ ఇచ్చాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'రంగబలి ఈ ఏడాదిలో వచ్చిన అత్యంత చెత్త సినిమా. ఇది చూడడం టైం వేస్ట్' అని రాసుకొచ్చాడు.
ఇదేం రొట్ట సినిమారా?: నాగశౌర్య - యుక్తి తరేజా జంటగా నటించిన 'రంగబలి' సినిమాను చూసిన మరొక నెటిజన్ ఇలా స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'ఇదేం రొట్ట సినిమారా నాయనా? రంగబలి కాదు జనం బలి. సత్య చేసిన కామెడీ మాత్రమే సినిమాను కాపాడుతుంది' అంటూ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
ఔట్‌డేటెట్ మూవీ అని:'రంగబలి' మూవీని చూసిన మరో నెటిజన్ ఇలా చెప్పాడు. 'రంగబలి మూవీ ఔట్‌డేటెడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఇది పెద్దగా ఎంగేజ్ చేయకపోగా.. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఇవ్వదు. సత్య వల్ల వచ్చే కామెడీ సీన్స్ తప్ప ఈ మూవీలో ఏమీ లేదు. రచన కొన్ని సంవత్సరాలుగా వస్తున్న సినిమాలను పోలి ఉంది. ఈ చిత్రాన్ని స్కిప్ చేయొచ్చు' అంటూ రాసుకొచ్చాడు.
మొత్తంగా అలాంటి టాక్:
నాగశౌర్య నటించిన 'రంగబలి' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ అంతా నెగెటివ్‌గానే టాక్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో సత్య చేసిన కామెడీ మినహా మొత్తం గతంలో చూసిన సినిమాల విధంగానే ఉందని చెబుతున్నారు. కానీ, నాగశౌర్య అభిమానులు, కామెడీని ఇష్టపడేవారు మాత్రం ఈ చిత్రాన్ని చూడొచ్చని చెప్తున్నారు. మరి తర్వాత టాక్ మారుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











