twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదిరింది: నాగశౌర్య ‘కళ్యాణ వైభోగమే’ ట్రైలర్ (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్: 'అలా మొదలైంది' తో హిట్ ను అందుకొన్న దర్శకురాలు నందినిరెడ్డి తాజా చిత్రం ‘కళ్యాణ వైభోగమే'. నాగశౌర్య, మాళవిక నాయర్ లు జంటగా నటించిన ఈ చిత్ర ఆడియో ఈ రోజున జనవరి 2 న విడుదల చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ..బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడండి.

    క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పలు పాటలను ఇప్పటికే ఎఫ్ఎం ద్వారా విడుదల చేయగా, మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కళ్యాణ్ కోడూరి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, శ్రీ రంజిత్ మూవీ బ్యానర్స్ పై కేఎల్ దామోదర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జనవరి నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

    ఇందులో ఒకప్పటి అందాల భామ రాశి మాళవికకు తల్లి పాత్రలో కనిపించనుండగా , ఈ ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కె.ఎల్ దామోదర్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనుండగా, త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.

    English summary
    Here is the first trailer of ‪ ‎KalyanaVaibhogame‬, coming from the team of 'Ala Modalaindhi'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X