Just In
- 24 min ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 45 min ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
- 57 min ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 1 hr ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
Don't Miss!
- Sports
మహ్మద్ సిరాజ్‌కు నాతో చీవాట్లు తినడం ఇష్టం: టీమిండియా బౌలింగ్ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- News
జగ్గంపేటలో ఘోర ప్రమాదం .. మంటల్లో ఇద్దరు సజీవ దహనం , ముగ్గురికి గాయాలు
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరో వివాదంలో నాగశౌర్య ఫ్యామిలీ.. నిన్న డైరెక్టర్.. ఇప్పుడు హీరోయిన్‌తో..
ఇండస్ట్రీలో మరో మెట్టు ఎక్కాలని ప్రతీ సినిమాకు ప్రయత్నించే హీరోలలో నాగశౌర్య ఒకరు. సొంత బ్యానర్‌లోనే తమ అభిరుచికి తగిన సినిమాలను తెరకెక్కిస్తూ విజయాలను సొంతం చేసుకొంటూ ముందుకెళ్తున్నాడు. అయితే అశ్వత్థామ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల తర్వాత నాగశౌర్యతోపాటు ఆయన కుటుంబం వివాదాల్లో కూరుకుపోతున్నది. డైరెక్టర్ వెంకీ కుడుముల వివాదం ఓ వైపు కొనసాగుతూనే.. తాజాగా మెహ్రీన్‌తో ఓ అంశం మీడియాలో కాంట్రవర్సీగా మారింది. ఇంతకు ఈ వివాదాలకు కారణమేమిటంటే..

ఛలో సినిమాతో దోస్తి
ఛలో సినిమాతో వెంకీ కుడుములను నాగశౌర్య తన సొంత బ్యానర్‌లో సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ సినిమాతో ఇద్దరు కలిసి మంచి హిట్‌ను సొంతం చేసుకొన్నారు. దర్శకుడిగా మంచి సినిమాను అందించినందుకు వెంకీ కుడుములకు నాగశౌర్య ఫ్యామిలీ ఓ కారును బహుమతి కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఏదో విషయంలో వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి.

కారు బహుమతి ఇస్తే..
అశ్వత్థామ ప్రమోషన్ కార్యక్రమాల సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ.. వెంకీ కుడుములతో ఉన్న వివాదాన్ని లేవనెత్తారు. తనకు మాకు కొంత గ్యాప్ ఉన్న మాట నిజమే. మా అమ్మ గిప్టుగా ఇచ్చిన కారును అమ్మేసుకొని బైక్‌పై తిరుగుతున్నారు అంటూ కామెంట్ చేశారు. దాంతో ఈ అంశం మీడియాలో వివాదంగా మారింది.

కారును అమ్ముకోలేదు
ఇదే విషయంపై వెంకీ కుడుముల స్పందిస్తూ.. నాగశౌర్య చెప్పినట్టు కారును అమ్మలేదు. ఆయన చెప్పిందంతా అబద్ధం. ఏదో విషయంలో అందరికీ ఎవరో ఒక్కరితో విభేదాలు ఉంటాయి. నాగశౌర్యతో కొంత విభేదాలు ఉన్న విషయం నిజమే. కానీ ఆ విషయాలు బయటకు మాట్లాడుకోవడం అప్రస్తుతం అని అన్నారు.

కొత్తగా మెహ్రీన్‌తో విభేదాలు
వెంకీ కుడుములతో వివాదం కొనసాగుతుండగానే.. మెహ్రీన్‌తో నాగశౌర్య తండ్రి గొడవ విషయం వెలుగులోకి వచ్చింది. అశ్వత్థామ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా మెహ్రీన్ ఆహ్వానిస్తే.. తనకు అనారోగ్యంగా ఉందని రావడానికి నిరాకరించారట. అయితే ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు.. తప్పనిసరిగా రావాల్సిందేనని లేకపోతే హోటల్ బిల్లు చెల్లించేది లేదని అన్నారట.


ఝలక్ ఇచ్చిన మెహ్రీన్
ఇలా నాగశౌర్య తండ్రి తప్పనిసరిగా రావాల్సిందేనని పట్టుబడితే.. చెప్పకుండా మెహ్రీన్ హోటల్ గది ఖాళీ చేసి వెళ్లిపోయిందనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. మీడియాలో మంచి పేరు ఉన్న నాగశౌర్య కుటుంబం ఇలా వివాదాల్లో కూరుకుపోవడం చర్చనీయాంశమవుతున్నది. ఇప్పటికే మెహ్రీన్‌పై పలువురు నిర్మాతలు కూడా ఫిర్యాదులు చేయడంతో ఆ విషయం మరింత ఆసక్తిని రేపుతున్నది. అయితే ఈ వివాదంలో అసలు విషయం ఏమిటనేది ఇరు పార్టీలు స్పందిస్తే గానీ ఈ అంశానికి ఎండ్ కార్డు పడదేమో.