For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సాయి పల్లవి అందగత్తెనా? అయితే దూకి చచ్చిపోతా.. వరుణ్ కంటే ఎక్కువనా? నాగశౌర్య ఫైర్

  By Rajababu
  |
  సాయి పల్లవి అందగత్తెనా ? అయితే దూకి చచ్చిపోతా..!

  ఫిదా చిత్రంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నది సాయి పల్లవి. దిల్ రాజు రూపొందించిన ఎంసీఏ చిత్రంలో నటించి ఆమె మెప్పించింది కూడా. అయితే ఆ చిత్రంలో హీరో నానితో గొడవ పడినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎంసీఏ ప్రమోషన్ సందర్భంగా తనకు సాయి పల్లవితో ఎలాంటి గొడవలు జరుగలేదు అని నాని వివరణ ఇచ్చారు. అయితే తాజాగా హీరో నాగశౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సాయి పల్లవి తీరు చర్చనీయాంశమైంది. ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో సాయి పల్లవి గురించి నాగశౌర్య ఏమన్నారంటే..

  ఎంసీఏ వివాదంలో సాయిపల్లవి

  ఎంసీఏ వివాదంలో సాయిపల్లవి

  సాయి పల్లవి గత చిత్రంలో హీరోతో గొడవ పడింది. ఆ తర్వాత వారిద్దరూ కాంప్రమైజ్ అయ్యారు అనే వార్తలను నేను విన్నాను. సాయి పల్లవి ఏ సినిమా చేసిన గొడవలు అవుతున్నాయని విన్నాను. అవి రూమర్లో కావో నాకు తెలియదు. అయితే నా సినిమా షూటింగ్ సమయంలో కూడా నాకు ఆమెకు విభేదాలు చోటుచేసుకొన్నాయి.

  సాయి పల్లవితో గొడవలు లేవు

  సాయి పల్లవితో గొడవలు లేవు

  సాయి పల్లవితో గొడవలు అంటే లేటుగా రావడం, కొంత పొగరుగా వ్యవహరించడం జరిగాయి. సాయి పల్లవికి వచ్చిన క్రేజ్ చూసి, జెలసీగా నేను ఫీలై చెప్పడం లేదు అని నాగశౌర్య అన్నారు.

  ఈర్ష్యగా ఫీలవ్వడం లేదు

  ఈర్ష్యగా ఫీలవ్వడం లేదు

  నా కెరీర్‌లో ఎంతోమంది అందగత్తెలను చూశాను. టాలెంటెడ్ యాక్టర్లను చూశాను. వారిని చూసి నేనెప్పుడూ ఈర్ష్య పడలేదు. సాయి పల్లవిని చూసి ఈర్ష్యగా ఫీలవ్వడం కంటే దూకి చచ్చిపోతాను అని నాగశౌర్య అన్నారు.

  సాయి పల్లవిని చూసి కుళ్లు..

  సాయి పల్లవిని చూసి కుళ్లు..

  సాయి పల్లవిని చూసి కుళ్లు పడాల్సిన నాకు అవసరం లేదు. నా సినిమా మరో హీరో చేశాడనో, లేదా నాకు రావాల్సిన ఛాన్స్ మరో హీరో కొట్టేశాడు అంటే ఈర్ష్యగా ఫీలొవచ్చు. అలా కాకుండా సాయి పల్లవి చూసి కుళ్లు పడాల్సిన అవసరం నాకు లేదు అని నాగశౌర్య తెలిపారు.

  క్రెడిట్ కొట్టేస్తుందని ఫీల్..

  క్రెడిట్ కొట్టేస్తుందని ఫీల్..

  సినిమా క్రెడిట్ అంతా సాయి పల్లవి కొట్టేస్తుందనే ఫీలింగ్ మాత్రం నాకు లేదు. ఫిదా సినిమా తీసుకొంటే తెలంగాణ యాసలో ఆమెను మాట్లాడించకుంటే అంత ఫేమ్ ఆమెకు వచ్చేదా అని నాగశౌర్య ప్రశ్నించాడు.

  తెలంగాణ యాసతోనే గుర్తింపు

  తెలంగాణ యాసతోనే గుర్తింపు

  దర్శకుడు శేఖర్ కమ్ముల టాలీవుడ్‌కు పరిచయం కాకపోతే సాయిపల్లవికి ఆ సక్సెస్ వచ్చేదా? శేఖర్ కమ్ముల ఆ స్క్రిప్టు రాయకపోతే పాపులర్ అయ్యేదా? తెలంగాణ యాస ఆమె మాట్లాడకపోతే ఆమెకు అంత పేరు వచ్చేదా? వరుణ్ తేజ్ అంత గొప్పగా భావొద్వేగాన్ని పండించకపోతే ఫిదా హిట్టయ్యేదా? అని నాగశౌర్య అన్నారు.

  వరుణ్ తేజ్ కూడా

  వరుణ్ తేజ్ కూడా

  వరుణ్ తేజ్ ఎంత నటించాడో సాయి పల్లవి కూడా అదే చేసింది. సాయి పల్లవికి ఎంత పేరొచ్చిందో వరుణ్ తేజ్‌కు అంతే పేరు రావాల్సిందే. కేవలం తెలంగాణ యాస వల్లే సాయి పల్లవికి ఎక్కువ పేరు వచ్చింది.

  తెలంగాణ యాస అంటే

  తెలంగాణ యాస అంటే

  తెలంగాణ యాస అంటే చాలా మందికి ఇష్టం. తెలంగాణ యాస అంటే నాకు కూడా నచ్చుతుంది. చాలా మందికి నచ్చింది. ఓ అమ్మాయి మాట్లాడితే ఇంకా నచ్చుతుంది. ఎట్రాక్టివ్‌గా ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకొని శేఖర్ కమ్ముల ఆ పాత్రను చాలా చక్కగా తీర్చిదిద్దాడు. అందుకే సాయి పల్లవికి పేరు వచ్చింది.

  సాయి పల్లవి అందంగా ఉండదని

  సాయి పల్లవి అందంగా ఉండదని

  సాయి పల్లవి అందంగా ఉండదనే నేను అనను. తెలంగాణ యాస మాట్లాడటం.. దాని ప్రభావంతో ఆమె మరింత అందంగా కనిపించింది అని నాగశౌర్య తెలిపారు.

  కణం చిత్రంలో సాయి పల్లవితో

  కణం చిత్రంలో సాయి పల్లవితో

  సాయి పల్లవి, నాగశౌర్య కలిసి కణం అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో రూపొందింది. ఈ చిత్రంలోని సాయి పల్లవి నటనకు మంచి పేరు వచ్చింది. త్వరలోనే తెలుగులో ఈ చిత్రం విడుదల కానున్నది.

  సాయి పల్లవినే చిత్ర నిర్మాతలు

  సాయి పల్లవినే చిత్ర నిర్మాతలు

  కణం చిత్ర నిర్మాతలు కేవలం సాయి పల్లవినే ప్రమోట్ చేయడం వల్ల నాగశౌర్య ఈ విధంగా స్పందించి ఉంటాడా అనే వాదన వినిపిస్తున్నది. ఏది ఏమైనా సాయి పల్లవిపై ఇలాంటి వార్తలు రావడం ఆలోచించాల్సిన విషయమే.

  English summary
  Hero Naga Shourya made serious allegations on ‘Fidaa’ actress Sai Pallavi shows off too much attitude. He said she believes she is bigger star than some of the bigger male stars. She puts the producers on tenterhooks as she’d fret for small things too, Naga Shourya blasted. Naga Shourya and Sai Pallavi have acted together in a forthcoming movie called “Kanam” that is scheduled for February 2018 release.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more