నాగ శౌర్య న్యూమూవీ: దర్శకుడిగా మారుతున్న కెమెరామెన్
నాగ శౌర్య హీరోగా కొత్త సినిమా బుధవారం ఉదయం 10 గంటల 34 నిమిషాలకు సంస్థ కార్యాలయం లో ప్రారంభ మయింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్ నిచ్చారు. కెమెరా స్విచ్ ఆన్ ప్రముఖ దర్శకుడు మారుతి చేశారు.

నూతన సంస్థ మన్యం ప్రొడక్షన్స్
నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ మన్యం ప్రొడక్షన్స్ తమ తొలి ప్రయత్నం గా నాగ శౌర్య కథానాయకుడు గా, ఛాయాగ్రాహకుడు సాయి శ్రీరామ్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రం ను నిర్మిస్తోంది.

కెమెరామెన్ నుండి దర్శకుడిగా
'మేం వయసుకు వచ్చాం, ఆలా ఎలా, సుప్రీం, పిల్ల జమిందార్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రస్తుతం నాగ శౌర్య 'ఛలో ' చిత్రాలకు శ్రీరామ్ ఛాయాగ్రాహకునిగా పనిచేశారు. దర్శకుడు సాయి శ్రీరామ్ చెప్పిన కధలోని నవ్యత, చిత్ర కధనం ఎంతగానో నచ్చి ఈ చిత్రం ను నిర్మిస్తున్నట్లు నిర్మాత యం.విజయకుమార్ తెలిపారు.

హీరోయిన్ ఖరారు కాలేదు
చిత్ర నాయిక ఎవరన్నదానితోపాటు ఇతర తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత యం.విజయకుమార్ తెలిపారు. 2018, జనవరి నెల ప్రథమార్ధం లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని తెలిపారు.

తారాగణం, టెక్నీషియన్స్
ఈ చిత్రానికి సంగీతం: రధన్, కధ : విద్యాసాగర్ రాజు మాటలు: విశ్వ నేత్ర, డి.ఓ.పి: హరిప్రసాద్ జాస్తి, ఆర్ట్: రామాంజనేయులు, ఎడిటర్: ప్రవీణ్ పూడి.
నిర్మాత: యం.విజయకుమార్
దర్శకత్వం: సాయి శ్రీరామ్


Click it and Unblock the Notifications











