Varudu Kaavalenu Twitter Review: మూవీకి ఊహించని టాక్.. ఫస్టాఫ్ సెకెండాఫ్ అలా.. ఓవరాల్ రిపోర్ట్ ఇదే

బ్యాగ్రౌండ్ లేకపోయినా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య. కెరీర్ ఆరంభంలో పలు చిత్రాల్లో నటించిన అతడు.. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఈ సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు, లవర్ బాయ్ ఇమేజ్‌ను సైతం దక్కించుకున్నాడు. దీంతో ఆ తర్వాత అదే తరహా సినిమాల్లో నటించాడు. అయితే, ఇవి అతడికి వర్కౌట్ కాలేదు. దీంతో పంథాను మార్చుకున్న ఈ యంగ్ హీరో.. విలక్షణమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల 'అశ్వద్ధామ'తో హిట్ కొట్టాడు. ఇక, ఇప్పుడు 'వరుడు కావలెను' అంటూ వస్తున్నాడు. మరి ఈ సినిమా ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

‘వరుడు కావలెను' అంటూ వచ్చారు

‘వరుడు కావలెను' అంటూ వచ్చారు

నాగశౌర్య - రితూ వర్మ జంటగా నటించిన చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. ఇందులో మురళి శర్మ, నదియా, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష వర్థన్ తదితరులు నటించారు. ఎస్ థమన్ దీనికి సంగీతం అందించాడు.

అంచనాలు భారీగా.. మరింత పెంచేస్తూ

అంచనాలు భారీగా.. మరింత పెంచేస్తూ

ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'వరుడు కావలెను' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులోని 'దిగు దిగు దిగు నాగ' సాంగ్‌కు రికార్డు వ్యూస్ వచ్చాయి. అలాగే, టీజర్, ట్రైలర్‌ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

బిజినెస్ కూడా భారీగా.. మొత్తం ఎంత?

బిజినెస్ కూడా భారీగా.. మొత్తం ఎంత?

నాగశౌర్యకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ 'వరుడు కావలెను' మూవీపై అంచనాలు ఉండడంతో హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 కోట్ల వ్యాపారం జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కలుపుకుంటే మరో రూ. 60 లక్షలు వ్యాపారం జరిగింది. దీంతో మొత్తంగా ఈ సినిమా రూ. 8.60 కోట్లు బిజినెస్ జరుపుకుందట.

గ్రాండ్‌గా రిలీజ్... నాగశౌర్య కెరీర్‌లోనే

గ్రాండ్‌గా రిలీజ్... నాగశౌర్య కెరీర్‌లోనే

నాగశౌర్యకు చాలా హిట్లు ఉన్నప్పటికీ అతడు పెద్ద ఓ పరిమితిలోనే ఉండిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో బడా నిర్మాణ సంస్థ తెరకెక్కించిన 'వరుడు కావలెను' మూవీ అతడి కెరీర్‌లోనే గ్రాండ్‌గా విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 630 థియేటర్లలో విడుదల అవుతుంది. ఇప్పటికే యూఎస్ సహా పలు ప్రాంతాల్లో ఈ సినిమా షోలు కూడా పడిపోయాయి.

 ‘వరుడు కావలెను' ఊహించని టాక్

‘వరుడు కావలెను' ఊహించని టాక్

నాగశౌర్య - రితూ వర్మ నటించిన 'వరుడు కావలెను' మూవీ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొంత మంది ఈ చిత్రం చాలా బాగుందని కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఏవరేజ్ అంటున్నారు. బాలేదని మాత్రం ఎవరూ చెప్పకపోవడం గమనార్హం.

మూవీలో ప్లస్ మైనస్ పాయింట్స్ ఇవే

మూవీలో ప్లస్ మైనస్ పాయింట్స్ ఇవే

'వరుడు కావలెను' మూవీని వీక్షించిన వారి అభిప్రాయం ప్రకారం.. ఈ సినిమాలో నాగశౌర్య, రితూ వర్మ యాక్టింగ్.. డీసెంట్ కామెడీ.. మ్యూజిక్.. కొన్ని ఎమోషనల్ సీన్స్.. విజువల్స్.. నిర్మాణ విలువలు ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు. అయితే, సెకెండాఫ్ అనుకున్న రీతిలో లేకపోవడం.. కన్విన్స్ చేయలేని కొన్ని సీన్స్.. ఎడిటింగ్ ఈ చిత్రానికి మైనస్ అని చెబుతున్నారు.

Recommended Video

Varudu Kavalenu Movie Team Interview
ఫస్టాఫ్ ఇలా సెకెండాఫ్ అలా.. మొత్తంగా

ఫస్టాఫ్ ఇలా సెకెండాఫ్ అలా.. మొత్తంగా

'వరుడు కావలెను' ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం డీసెంట్ కామెడీతో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్‌తో చక్కగా సాగిపోతుందట. అయితే, సెకెండాఫ్ మాత్రం కొంత డ్రాగ్ చేసినట్లు అనిపిస్తుందని అంటున్నారు. మొత్తంగా ఏమాత్రం అంచనాలు లేకుండా వెళ్లే వాళ్లను మాత్రం ఇది ఎంతగానో ఆకట్టుకుంటుందని సినిమాను చూసిన వాళ్లంతా అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X