ఇన్ని కోట్లు ఎవరు పెట్టరు, మాది ఖుషీ సినిమాలో లాంటి బంధం: నాగ శౌర్య

By Bojja Kumar

Recommended Video

Nartanasala Movie Teaser Launch Event

'ఛలో' లాంటి హిట్‌ తరువాత నాగశౌర్య తన సొంత బ్యానర్‌లో చేస్తోన్న సినిమా 'నర్తనశాల'. ఈ మూవీకి మహతి స్వర సాగర్‌ అందించగా.. కష్మీర పరదేశి, యామిని భాస్కర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌పై శంకర్‌ మూల్పూరి, ఉషా మూల్పూరి నిర్మించగా.. శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. అలనాటి 'నార్తనశాల' పేరు ఏమాత్రం చెడగొట్టకుండా తమ సినిమా ఉంటుందని చిత్రం బృందం చెబుతోంది. మూవీ టీజర్ లాంచ్ ఈవెంటులో నాగ శౌర్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అన్ని కోట్లంటే ఎవరూ పెట్టరు

అన్ని కోట్లంటే ఎవరూ పెట్టరు

పిల్లలు చిన్నతనంలో బొమ్మలు కొనివ్వమని అడుగుతారు, పెద్దయ్యాక కార్లు కొనివ్వమని అడుగుతుంటారు. అమ్మా... నా కోసం 15 కోట్లు పెట్టు అంటే ఎవరూ పెట్టరు. కానీ మా అమ్మ నాకు పెడుతోంది. మా పేరెంట్స్ సపోర్ట్ వల్లే నేను ఇపుడు ఈ స్థాయిలో ఉన్నాను అని నాగ శౌర్య తెలిపారు.

మా పేరెంట్స్ ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు

మా పేరెంట్స్ ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు

మనం హీరో అయిపోయాం కదా... చాలా సార్లు అమ్మానాన్నకు ఏదో ఒకటి చేయాలనుకుంటాను. కానీ ఆ చాన్స్ మా పేరెంట్స్ నాకు ఇవ్వలేదు. మళ్లీ తిరిగి నాకే పెడుతున్నారు. ఇలాంటి పేరెంట్స్ ఎంత మందికి ఉంటారో తెలియదు. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను.

వంశీ పైడిపల్లి సపోర్ట్ మరిచిపోలేను

వంశీ పైడిపల్లి సపోర్ట్ మరిచిపోలేను

డైరెక్టర్ శ్రీనివాస్‌ చక్రవర్తి సినిమాను చాలా క్వాలిటీగా తీశారు. వంశీ పైడిపల్లి స్వయంగా సెట్స్‌కు వచ్చి ఆయన శిష్యుడు శ్రీనివాస్ బాగా తీస్తున్నాడా? లేదా? అని పర్యవేక్షించేవారు. సినిమా మొదలైనప్పటి నుండి వంశీ సపోర్ట్ మరిచిపోలేను.

ఎవరినీ బ్యాడ్‌గా చూపించలేదు

ఎవరినీ బ్యాడ్‌గా చూపించలేదు

మా సినిమాలో ఎవరినీ బ్యాడ్ గా చూపించ లేదు. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతి ఇచ్చే సినిమా ఇది. ఈ సినిమాలో శివాజీ రాజా నా తండ్రి పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆయనకొచ్చిన పేరు మరో పదేళ్ల వరకు ఏ సినిమాకు రాదు అని గర్వంగా చెప్పగలరు. అది నా సినిమాలో నా ప్రొడక్షన్లో జరుగడం ఆనందంగా ఉంది.

ఖుషి మూవీలో బంధం లాంటిది

ఖుషి మూవీలో బంధం లాంటిది

ఈ సినిమాకు పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ గురించి చెప్పాలంటే... మాది ఖుషి సినిమాలో లాంటి బంధం అనినిపస్తుంది. చిన్నపుడు చేతులు కలుసుకుని మళ్లీ పెద్దయిన తర్వాత కలుసుకున్నట్లు... అతడు నా కోసం పుట్టినట్లు, నా ప్రొడక్షన్ కోసం పెట్టినట్లు అనిపిస్తుంది. నర్తనశాలకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు అని నాగ శౌర్య తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X