'ఛలో' గొడవను ఇంకా మర్చిపోని హీరో, దర్శకుడు.. మధ్యలో రష్మీక ఏం చేసిందని..

ఒక సినిమా సెట్స్ పైకి తేవడం ఎంత కష్టమో దాన్ని పూర్తి చేయడం కోసం కూడా అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అయితే మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా గొడవలు ఎన్ని జరిగినా కూడా సినిమా సక్సెస్ అయితే వాటిని మర్చిపోతుంటారు చిత్ర యూనిట్ సభ్యులు. కానీ ఛలో సినిమా యూనిట్ సభ్యుల తీరు ఏమిటో గాని దాదాపు అందరికి విబేధాలు ఉన్నట్లు అప్పట్లో టాక్ వచ్చింది. ఇక ఇటీవల మూడేళ్ళయిన సందర్భంగా ఛలో యూనిట్ సభ్యులు ఎవరికి వారు గుర్తు చేసుకున్నట్లు అర్ధమయ్యింది.

బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలు

బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలు

ఛలో సినిమా 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ శౌర్య హీరోగా నటించిన ఆ సినిమా ద్వారా రష్మీక మందన్న తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యింది. సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు కేవలం 3కోట్లతో తెరకెక్కించిన ఆ సినిమా దాదాపు 20కోట్లకు పైగా లాభాలను అందించింది. నాగ శౌర్య తల్లి ఉషా ఈ సినిమాను నిర్మించారు.

కెమెరా వెనుక ఏం జరిగిందో..

కెమెరా వెనుక ఏం జరిగిందో..

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సినిమా ద్వారా మణిశర్మ తనయుడు స్వర సాగర్ మహాథి కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు. అందరికి ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే అసలు కెమెరా వెనుక ఏం జరిగిందో తెలియదు గాని నాగ శౌర్య అప్పట్లో దర్శకుడిపై చేసిన విమర్శలు అందరిని షాక్ కు గురి చేశాయి.

కారును బహుమతిగా ఇస్తే..

కారును బహుమతిగా ఇస్తే..

నిజానికి ఛలో కథను తానే రాశాను అంటూ నాగ శౌర్య స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక దర్శకుడు వెంకీ కుడుములు హీరో చేసిన కామెంట్స్ ను కాంట్రవర్సీకి దారి తియ్యకుండా క్లోజ్ చేసేశాడు. వెంకీకి తన తల్లి ఒక కారు బహుమతిగా ఇస్తే దాన్ని వాడలేదని పలు రకాల కామెంట్స్ తో నాగశౌర్య అప్పట్లో చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రష్మీక ఏం చేసిందని..

రష్మీక ఏం చేసిందని..

అయితే సినిమా విడుదలై 3 ఏళ్ళు అయిన సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. నాగశౌర్య తన తల్లి నిర్మాతగా వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేస్తూ పోస్టర్ వదిలాడు. అంతే గాని అందులో దర్శకుడి పేరు కూడా ఉంచలేదు. రష్మీక మందన్నను కూడా ట్యాగ్ చేయలేదు. ఆమె ఏం చేసి ఉంటుందని ఓ వర్గం వారిలో కలుగుతున్న సందేహాలు.

Recommended Video

Tollywood back to form again.. 2021 will be biggest year ever for telugu Cinema
దర్శకుడు కూడా..

దర్శకుడు కూడా..

దర్శకుడు వెంకీ కుడుములు కూడా హీరో లేని పోస్టర్ ను పోస్ట్ చేసి హీరోయిన్ రష్మీక మందన్నపై కూడా పాజిటివ్ కామెంట్ చేశాడు. ఆమె గొప్ప హీరోయిన్ అవుతుందని అప్పట్లో పోస్ట్ అయినా ఒక ఆర్టికల్ ను కూడా పోస్ట్ చేశాడు. కానీ నాగశౌర్య పై అతను ఒక చిన్న మాట కూడా చెప్పలేదు. దీంతో వీరి మధ్య ఉన్న విబేదాలు మూడేళ్లయినా కూడా తొలగలేదు అంటే మ్యాటర్ ఏ రేంజ్ వరకు వెళ్లి ఉంటుందో అర్థం క్చేసుకోవచ్చు.. అంటున్నారు ఓ వర్గం నెటిజన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X