twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగశౌర్య...ఓ ఫేస్ బుక్ ప్రేమ కథ

    By Srikanya
    |

    హైదరాబాద్ : సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల చుట్టూ కథలు అల్లుతూ సినిమాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి. టాలీవుడ్ కూ ఈ ట్రెండ్ పాకింది. తాజాగా అలాంటి ఓ కథతో నాగశౌర్య తాజా చిత్రం 'అబ్బాయితో అమ్మాయి' రెడీ అవుతోంది. ఫేస్ బుక్ లో జరిగే ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమా సిద్దమవుతోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    దర్శకుడు రమేష్ వర్మ మాట్లాడుతూ.... ప్రపంచం మొత్తం ఫేస్‌బుక్‌లోకీ, ట్విట్టర్‌లోకీ వచ్చేసింది. ఈ వేదికలపై అందమైన భావాల్ని స్వచ్ఛంగా ఆవిష్కరించుకొంటోంది యువతరం. బయటి ప్రపంచంలో కంటే ఫేస్‌బుక్‌లోనే ఎక్కువమంది స్నేహితుల్ని సంపాదించుకొంటున్నారు. ఈ సాంకేతిక ప్రపంచంలో ఒకలా బయట మరోలా ప్రవర్తించేవాళ్లూ ఉన్నారు. అలాంటి ఓ అబ్బాయి, ఓ అమ్మాయి కథే మా సినిమా అంటున్నారు

    ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'అబ్బాయితో అమ్మాయి'. నాగశౌర్య, పల్లక్‌ లల్వాని జంటగా నటించారు. వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్‌ సమ్మెట నిర్మాతలు. షూటింగ్ పూర్తయింది. త్వరలో పాటల్ని విడుదల చేస్తారు.

    Naga Soury'a upcoming film Abbayitho Ammayi Story line

    నేటి యువతకు రెండు ప్రపంచాలు ఉంటున్నాయి. ఒకటి రియల్ వరల్డ్... మరొకటి వర్చువల్ వరల్డ్. వర్చువల్ వరల్డ్... అంటే... సోషల్ మీడియాలో మాత్రం తమ మనసుని, అభిప్రాయాలను, భావాలను సంపూర్ణంగా, స్వేచ్ఛగా ఆవిష్కరించుకుంటున్నారు. అదే రియల్ వరల్డ్ కు వచ్చేసరికి ఈ ఓపెన్ నెస్ ఉండటంలేదు. ఈ రెండు ప్రపంచాల మధ్య కన్ ఫ్యూజన్ తో సాగే యువతరం జీవితాన్ని, ప్రస్తుత ట్రెండ్ ని ఆవిష్కరిస్తూ మోహనరూపా ఫిలింస్ తో కలిసి జేజి సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్ సంస్థలు నిర్మించిన చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి'.

    నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రస్తుతం వస్తున్న ప్రేమకథా చిత్రాలతో పోలిస్తే.. 'అబ్బాయితో అమ్మాయి' విభిన్నంగా సాగుతుంది. ఇళయరాజా అందించిన స్వరాలు తప్పకుండా ఆకట్టుకుంటాయి. యువతరం సినిమా అయినా, కుటుంబ ప్రేక్షకులకూ నచ్చుతుంది. డిసెంబరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నాం''అన్నారు నిర్మాతలు.

    బ్రహ్మానందం, రావు రమేశ్, మోహన్, ప్రగతి, తులసి, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శ్యాం కె నాయుడు, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, పాటలు: రహ్మాన్, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి.

    English summary
    Naga Soury'a upcoming film Abbayitho Ammayi movie story based on Social net working sites. Directed by Ramesh Varma. Music by Ilaiyaraja. Produced by Kireeti Potini.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X