నాగశౌర్య 'అబ్బాయితో అమ్మాయి' కొత్త టీజర్‌ (వీడియో)

By Srikanya

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: నాగశౌర్య, పల్లక్‌ లాల్వానీలు జంటగా రూపుదిద్దుకున్న చిత్రం 'అబ్బాయితో అమ్మాయి'. ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రమేశ్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కిరీటి పోతిని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దర్శకుడు రమేష్ వర్మ మాట్లాడుతూ.... ప్రపంచం మొత్తం ఫేస్‌బుక్‌లోకీ, ట్విట్టర్‌లోకీ వచ్చేసింది. ఈ వేదికలపై అందమైన భావాల్ని స్వచ్ఛంగా ఆవిష్కరించుకొంటోంది యువతరం. బయటి ప్రపంచంలో కంటే ఫేస్‌బుక్‌లోనే ఎక్కువమంది స్నేహితుల్ని సంపాదించుకొంటున్నారు. ఈ సాంకేతిక ప్రపంచంలో ఒకలా బయట మరోలా ప్రవర్తించేవాళ్లూ ఉన్నారు. అలాంటి ఓ అబ్బాయి, ఓ అమ్మాయి కథే మా సినిమా అంటున్నారు

ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'అబ్బాయితో అమ్మాయి'. నాగశౌర్య, పల్లక్‌ లల్వాని జంటగా నటించారు. వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్‌ సమ్మెట నిర్మాతలు. షూటింగ్ పూర్తయింది. త్వరలో పాటల్ని విడుదల చేస్తారు.

నేటి యువతకు రెండు ప్రపంచాలు ఉంటున్నాయి. ఒకటి రియల్ వరల్డ్... మరొకటి వర్చువల్ వరల్డ్. వర్చువల్ వరల్డ్... అంటే... సోషల్ మీడియాలో మాత్రం తమ మనసుని, అభిప్రాయాలను, భావాలను సంపూర్ణంగా, స్వేచ్ఛగా ఆవిష్కరించుకుంటున్నారు. అదే రియల్ వరల్డ్ కు వచ్చేసరికి ఈ ఓపెన్ నెస్ ఉండటంలేదు. ఈ రెండు ప్రపంచాల మధ్య కన్ ఫ్యూజన్ తో సాగే యువతరం జీవితాన్ని, ప్రస్తుత ట్రెండ్ ని ఆవిష్కరిస్తూ మోహనరూపా ఫిలింస్ తో కలిసి జేజి సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్ సంస్థలు నిర్మించిన చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి'.

Naga Soury'a upcoming film Abbayitho Ammayi teaser

నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రస్తుతం వస్తున్న ప్రేమకథా చిత్రాలతో పోలిస్తే.. 'అబ్బాయితో అమ్మాయి' విభిన్నంగా సాగుతుంది. ఇళయరాజా అందించిన స్వరాలు తప్పకుండా ఆకట్టుకుంటాయి. యువతరం సినిమా అయినా, కుటుంబ ప్రేక్షకులకూ నచ్చుతుంది. డిసెంబరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నాం''అన్నారు నిర్మాతలు.

బ్రహ్మానందం, రావు రమేశ్, మోహన్, ప్రగతి, తులసి, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శ్యాం కె నాయుడు, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, పాటలు: రహ్మాన్, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X