తండ్రి,కొడుకు ఒకరితోనే ... ('దిక్కులు చూడకు ..' ప్రివ్యూ)
హైదరాబాద్: ఒకప్పుడు సమాజం, కుటుంబాలు,మానవ మనస్తత్వాలు అందులోని రుగ్మతలును ప్రస్తావిస్తూ బాలచందర్,దాసరి వంటి దర్శకులు భావోద్వేగ భరిత చిత్రాలు రూపొందించారు. రాను రాను కమర్షియల్ సినిమా పేరుతో వాటినన్నటినీ కట్టకట్టి ప్రక్కన పడేసి, కేవలం హీరో, అతని హీరోయిజం ఎలివేట్ చేయటం మీదే అధారపడి సినిమాలు చేస్తున్నారు. అయితే టేస్టు గల నిర్మాతలు మాత్రం అప్పుడుప్పుడూ విలవులు,కుటుంబాలు అంటూ వస్తున్నారు. మొదటి నుంచి విభిన్న చిత్రాలు అందిస్తున్న సాయికొర్రపాటి తాజా చిత్రం 'దిక్కులు చూడకు రామయ్య' అలాంటి చిత్రమే అని తెలుస్తోంది.
తప్పటడుగేసిన తండ్రిని దారిలో పెట్టేందుకు తనయుడేం చేశాడనే కథతో 'దిక్కులు చూడకు రామయ్య' చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో అజయ్, నాగశౌర్య తండ్రి కొడుకులు గా కనిపిస్తారు. అజయ్ వయస్సు 40 సంవత్సరాలు ఉంటుంది. తండ్రి,కొడుకులు ఇద్దరూ ఒకే అమ్మాయితో ప్రేమలో పడతారు. తాను యూత్ కాబట్టి తనకు ప్రేమించే హక్కు ఉంది అని కొడుకు అంటే నలభై సంవత్సరాల వయస్సులో వారు ఎక్కడైనా ప్రేమలో పడకూడదనే రూల్ ఉందా అని తండ్రి అడుగుతాడు. ప్రేమించే వయస్సులో ఉన్నాను. పెళ్లి కాలేదు కాబట్టి తనకే ఆ అమ్మాయి దక్కాలని, తండ్రి ని ప్రేమ నుంచి డ్రాప్ అవ్వమంటాడు. కాదు నువ్వే డ్రాప్ అవ్వాలని కొడుకుని కోరతాడు. ఇంతకీ ఆ అమ్మాయి సనాఖాన్ ఈ తండ్రి కొడుకుల్లో ఎవరికి మనస్సు ఇచ్చింది. ఎవరు డ్రాప్ అయ్యారు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నాగశౌర్య మాట్లాడుతూ ....సినిమా చూసిన తల్లిదండ్రులంతా ఇలాంటి కొడుకు ఉంటే బాగుండనని అనుకునేలా ఈ సినిమా ఉంటుంది. కీరవాణి సంగీతం మరో బలం అన్నారు. ఈగ చిత్రంతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా, అందాల రాక్షసి చిత్రంతో ఉత్తమాభిరుచిగల నిర్మాతగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న సాయి కొర్రపాటి ఈ చిత్రం నిర్మాత కావటంతో ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.
నిర్మాత మాట్లాడుతూ... ''వినోదాత్మక ప్రేమకథ ఇది. త్రికోఠి చెప్పిన కథ కొత్తగా ఉంది. మా సంస్థ నుంచి వచ్చిన హిట్ చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా నిలుస్తుంది'' అన్నారు.
ఈ చిత్రాన్ని రాజమౌళి వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన త్రికోటి దర్శకత్వం వహిస్తూండటంతో మరింత క్రేజ్ క్రియేట్ అయ్యింది. దాంతో ఈ శుక్రవారం విడుదల అవుతున్న సినిమాలలో దిక్కులు చూడకు రామయ్య సినిమాకు ఎక్కువ ప్రేక్షకాదరణ లభించే అవకాసం కనిపిస్తోంది. చిత్ర పరిశ్రమలో ఇప్పుడు అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.
బ్యానర్: వారాహి చలనచిత్రం
నటీనటులు: అజయ్, శౌర్య, ఇంద్రజ, సనాఖాన్, నాగినీడు, అలీ, విశాల్, రమేష్, హరితేజ, వేణు తదితరులు
మాటలు: రమేష్ - గోపి,
కూర్పు: తమ్మిరాజు,
ఛాయాగ్రహణం: బి.వి.అమరనాథ్‌రెడ్డి,
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్,
సంగీతం: కీరవాణి.
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త్రికోటి దర్శకుడు.
నిర్మాత: రజనీకొర్రపాటి
సమర్పణ : సాయి కొర్రపాటి
విడుదల తేది: 10,అక్టోబర్ 2014.


Click it and Unblock the Notifications











