Don't Miss!
- Sports SRH vs RCB: మలుపు తిప్పిన స్వప్నిల్ సింగ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆర్సీబీ ఘన విజయం!
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పక్కా మాస్: నాగశౌర్య ‘జాదూగాడు’ టీజర్ (వీడియో)
హైదరాబాద్: నాగశౌర్య హీరోగా సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వి.వి.యన్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘జాదూగాడు' అనే టైటిల్ ఖరారు చేశారు. ‘చింతకాయల రవి' ఫేమ్ యోగేశ్ ఈ చిత్రానికి దర్శకుడు. జాతీయ టెలివిజన్ సీరియల్ ‘హర హర మహాదేవ'లో పార్వతి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న సోనారిక ఈ చిత్రం ద్వారా నాయికగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రం టీజర్ ని విడుదల చేసారు. పక్కా మాస్ లుక్ తో సాగే ఈ టీజర్ ని మీరు చూడండి.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
దర్శకుడు యోగేశ్ మాట్లాడుతూ ‘‘నాగశౌర్య పోషిస్తున్న పాత్ర అతని గత పాత్రలకు భిన్నంగా ఉంటుంది. అలాగే నాగశౌర్య ఇప్పటివరకు ప్రేమ కధా చిత్రాల హీరోగా నటించారు. కానీ ఈ చిత్రం లో అతని పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. మాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం లో హీరో పాత్రను తీర్చి దిద్దటం జరిగిందని తెలిపారు. వినోదంతో కూడిన మాస్ కధా చిత్రం ఈ 'జాదూగాడు' అన్నారు.'' అని చెప్పారు.
నిర్మాత వి.వి.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ..‘‘పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్నఈ ‘జాదూగాడు' షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.''అని నిర్మాత వి.వి.ఎన్.ప్రసాద్ తెలిపారు.
ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు,అజయ్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వి, సప్తగిరి, తాగుబోతు రమేష్, జాకీర్ హుస్సేన్, ఆశిష్ విద్యార్ధి, రవి కాలే, ‘ప్రబాస్' శ్రీను, ‘రాకెట్' రాఘవ,‘అదుర్స్' రఘు, స్వామిరారా సత్య, ఫిష్ వెంకట్ లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: మధుసూదన్, పాటలు: వరికుప్పల యాదగిరి, శ్రీమణి, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్.