మాస్ ని మెప్పిస్తాడు? (‘జాదూగాడు’ ప్రివ్యూ)
హైదరాబాద్: పక్కింటి అబ్బాయిలా కనిపించే నాగశౌర్య తొలి నుంచి ప్రేమకథల్లో ఇమిడిపోయాడు. 'వూహలు గుసగుసలాడే' , 'దిక్కులు చూడకు రామయ్యా', 'చందమామ కథలు', 'లక్ష్మీ రావే మా ఇంటికి' చిత్రాల్లోనూ శౌర్య ప్రతిభ ఆకట్టుకొంది. ఇప్పుడు 'జాదూగాడు' అంటూ మాస్ హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం హిట్టైతే మాస్ హీరోగా నిలదొక్కుంటాడు లేక ప్రేమ కథలు కంటిన్యూ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
లోన్ రికవరీ బిజినెస్ చేసే యువకుడిగా నాగశౌర్య కనిపిస్తారు. హీరోయిన్ తో ప్రేమలోపడ్డాక లోకల్ గ్యాంగ్‌లీడర్‌తో వివాదం ఇటు హీరో జీవితాన్ని, అటు కథనూ ఎలాంటి మలుపు తిప్పిందనేది ఇందులోని ఆసక్తికర కథాంశం
నాగశౌర్య మాట్లాడుతూ... వరుసగా ప్రేమకథలు చేసుకొంటూ వెళ్తే బోర్ కొట్టేస్తుంది. అలాగని 'జాదూగాడు' పూర్తిస్థాయి మాస్ సినిమా కాదు. ప్రేమ, వినోదం, భావోద్వేగాలు, ఉత్కంఠ అన్నీ ఉంటాయి. ఇందులో లోన్ రికవరీ ఏజెంట్‌గా నటించా. చివరి 45 నిమిషాలూ ఈ కథకు ప్రాణమండి. దర్శకుడు యోగి కథ చెబుతున్నప్పుడు నేను ఫ్లాట్ అయిపోయింది అక్కడే. అయితే ప్రేమకథల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోను. నాకు అవే బాగా నప్పుతాయి కూడా అని చెప్పారు.
దర్శకుడు యోగేశ్ మాట్లాడుతూ ‘‘నాగశౌర్య పోషిస్తున్న పాత్ర అతని గత పాత్రలకు భిన్నంగా ఉంటుంది. అలాగే నాగశౌర్య ఇప్పటివరకు ప్రేమ కధా చిత్రాల హీరోగా నటించారు. కానీ ఈ చిత్రం లో అతని పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. మాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం లో హీరో పాత్రను తీర్చి దిద్దటం జరిగిందని తెలిపారు. వినోదంతో కూడిన మాస్ కధా చిత్రం ఈ 'జాదూగాడు' '' అని చెప్పారు.
నిర్మాత వి.వి.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ..‘‘పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్నఈ ‘జాదూగాడు' ఖచ్చితంగా మంచివిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.''అని నిర్మాత వి.వి.ఎన్.ప్రసాద్ తెలిపారు.

బ్యానర్ : సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు :నాగశౌర్య, సోనారిక, కోట శ్రీనివాసరావు,అజయ్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వి, సప్తగిరి, తాగుబోతు రమేష్, జాకీర్ హుస్సేన్, ఆశిష్ విద్యార్ధి, రవి కాలే, ‘ప్రబాస్' శ్రీను, ‘రాకెట్' రాఘవ,‘అదుర్స్' రఘు, స్వామిరారా సత్య, ఫిష్ వెంకట్ తదితరులు.
కథ, మాటలు: మధుసూదన్,
పాటలు: వరికుప్పల యాదగిరి, శ్రీమణి,
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్.
కూర్పు: ఎం.ఆర్. వర్మ.
సంగీతం: సాగర్ మహతి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ‘చింతకాయల రవి' ఫేమ్ యోగేశ్
నిర్మాత: వి.వి.ఎన్. ప్రసాద్
విడుదల తేది: 26, జూన్ 2015.


Click it and Unblock the Notifications











