ఫన్ లవ్ స్టోరీ (‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ప్రివ్యూ )

By Srikanya

హైదరాబాద్ : ఊహలు గుసగుసలాడే చిత్రంతో పరిచయమైన నాగ శౌర్య, ఉయ్యాల జంపాల తో పరిచయమైన అవికాగోర్ ...వీరిద్దరూ చిన్న చిత్రాల ద్వారా వచ్చి పెద్ద పేరు సంపాదించుకున్నవాళ్లు. దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రెడీ చేసి అందిస్తే...అనే ఆలోచనతో రచయిత నుంచి దర్శకుడుగా మారిన నంద్యాల రవి రూపొందించిన చిత్రమే ఇది. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో, టీజర్స్ మార్కెట్లో మంచి హిట్ అయ్యి...క్రేజ్ సంపాదించుకున్నాయి.

ఈ చిత్రంలో నాగ శౌర్య...ఇడియట్ లో చంటి తరహా పాత్రలో కనిపిస్తాడు. అతని పేరు సాయి. అతను ప్రేమించే అమ్మాయి లక్ష్మిని తనదాన్ని చేసుకోవటానికి చేసే ప్రయత్నాలే ఈ చిత్రం.ముఖ్యంగా అమ్మాయి తండ్రిని కన్వీన్స్ చేసే పాత్రలో నాగ శౌర్య కనిపించనున్నారు. ఎంగేజ్ మెంట్ అయిన అమ్మాయి తో ప్రేమలో పడి ఆమె తండ్రిని ఎలా కన్వీన్స్ చేసాడనే కథ.

నిర్మాత గిరిధర్ మాట్లాడుతూ- ఓ మంచి కథాంశంతో సినిమా రూపొందించాలన్న తన కోరిక ఈ చిత్రంతో నెరవేరుతుందని, దర్శకుడు రవి మంచి కథ చెప్పడంతో మొదలెట్టామని, అవికాగోర్ హీరోయిన్ గా నటిస్తుండడంతో ఈ చిత్రానికి మరింత అందం వచ్చిందని తెలిపారు. ‘ఇడియట్'లో రవితేజకు వచ్చినంత పేరు కథానాయకుడు శౌర్యకు ఈ చిత్రం ద్వారా వస్తుందని, ఆయన అన్నారు.

కుటుంబమంతా కలిసి చూసే విధంగా ఈ చిత్రాన్ని లవ్ ఎంటర్‌టైనర్‌గా అందిస్తున్నామని, మంచి టీమ్ కుదరడంతో సినిమా కూడా బాగా వచ్చిందన్న నమ్మకం ఉందని దర్శకుడు నంద్యాల రవి తెలిపారు.

ఈ సినిమాలో తన పాత్ర గూర్చి తెలియగానే ఆ పాత్రతోనే తాను ప్రయాణించానని, అంతగా నచ్చిన ఈ పాత్ర సినిమా అందరికీ నచ్చుతుందన్న ఆశాభావం హీరోయిన్ అవికాగోర్ వ్యక్తం చేసింది.

Naga Sourya's Lakshmi Raave Maa Intiki preview

బ్యానర్: గిరిధర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌

నటీనటులు: నాగశౌర్య, అవికాగోర్, షాయాజీషిండే, అలీ, సత్యం రాజేశ్‌, రావు రమేశ్‌, అనితా చౌదరి, ప్రగతి, భగవాన్‌, శశి తదితరులు
ఛాయాగ్రహణం: బాలరెడ్డి,
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కుంపట్ల రాంబాబు,
సమర్పణ: తాడిశెట్టి వెంకట్రావు,
కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: నంద్యాల రవి.
నిర్మాత: గిరిధర్
విడుదల తేదీ: డిసెంబర్ 5, 2014.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X