అక్కినేని కూతురు సంచలన వ్యాఖ్యలు... సబబేనా?
హైదరాబాద్: తెలుగు సినిమా దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణానంతంర ఇటీవల ఫిల్మ్ చాంబర్లో ఏర్పాటు చేసిన సంతాప సభలో అక్కినేని కూతురు నాగ సుశీల సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన బ్రతికుండాగా సరైన గౌరవం ఇవ్వలేదని.....ఆయన పోయాక పొగుడుతున్నారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు.
అయితే పలువురు సినీ పరిశ్రమ వర్గాలు మాత్రం.....నాగ సుశీల మాట్లాడిన తీరును తప్పుబడుతున్నారు. బ్రతికి ఉన్నపుడు అక్కినేనికి సరైన గౌరవం ఇవ్వలేదనే ఆమె మాటల్లో నిజం లేదని పలువురు ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు. అక్కినేని కుటుంబ సభ్యులు ఇపుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు.

నాగ సుశీల సంతాప సభలో ఏమన్నారు?
"కేవలం తెలుగులోనే కాదు, భారతీయ చలన చిత్ర పరిశ్రమలో 'పద్మ విభూషణ్' అందుకున్న ఏకైక నటుడు అక్కినేని నాగేశ్వరరావు. అయితే ఈ సమయంలో నేను ఇలా మాట్లాడవచ్చో.. లేదో.. తెలియదు కానీ ఇంతమంది ఈ రోజు ఆయనను పొగుడుతున్నారు. కాని ఆ రోజు 'పద్మ విబూషణ్' అవార్డు వరించినప్పుడు ఆయనను పొగిడి ఉంటే చాలా సంతోషించేవారు. అయన లేని రోజు మనం ఇలా చెప్పుకోవడం చాలా బాధాకరంగా ఉంది" అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.
అక్కడే వేదికపై ఉన్న పరుచూరి గోపాలకృష్ట కలగజేసుకొని "పద్మవిభూషణ్ వచ్చినప్పుడు సుబ్బిరామిరెడ్డి సన్మానకార్యక్రమం నిర్వహించారు. అప్పుడు అందరూ మాట్లాడారు" అని సర్దిచెప్పారు. అయితే సుశీల "అప్పుడేం జరిగిందో మాకు తెలుసులెండి" అని ఏడుస్తూనే అక్కడ నుండి వెళ్లిపోయారు.


Click it and Unblock the Notifications











