'హనుమాన్ కోసమే గుంటూరు కారం మూవీని తొక్కారు'
సినీ పరిశ్రమలో కూడా పోటీతత్వం అనేది సాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది. అయితే హీరోలు పరంగా అభిమానులు సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటారు కానీ ఒక టైం కి వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ నడుమ కూడా రసవత్తరమైన యుద్ధాలే జరుగుతాయి. కాగా నిర్మాతల నడుమ యుద్దాలు ఎప్పుడు ఉంటాయి అంటే సినిమా రిలీజ్ సమయాల్లో అలాగే మంచి పండుగ వాతావరణంలో కనిపిస్తాయి. అలా ఈ ఏడాది సంక్రాంతి బరి ఊహించని రీతిలోనే మొదలైంది.
కాగా ఈ ఏడాది సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకీ మామ అలాగే నాగార్జున సహా యువ హీరో తేజ సజ్జలు తమ సినిమాలతో వచ్చారు. కాగా ఈ సినిమాల్లో యునానిమాస్ హిట్ గా మాత్రం తేజ సజ్జ నటించిన భారీ సినిమా "హను మాన్" నిలిచింది. అక్కడ ఉన్న అన్ని సినిమాల్లో చిన్న హీరో తేజనే అయినప్పటికీ ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి తెలుగు సినిమా సంక్రాంతి బరిలో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

అయితే ఈ సినిమాతో వెంకీ మామ, నాగార్జున సినిమా లకి ఎలాంటి ఇబ్బంది కనిపించలేదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి అలాగే నిర్మాత లకి హను మాన్ టీం కి నడుమ పెద్ద యుద్ధమే నడిచింది. సినిమాలు రెండూ ఒకే తేదీల్లో రావడం దీనితో గుంటూరు కారం సినిమాకి సరిగ్గా థియేటర్స్ దొరకకపోవడం ఇలా చాలానే రచ్చ హను మాన్ టీం పై నడిచింది.
దీనికి తోడు ఈ సమయంలోనే పెద్ద సినిమా గుంటూరు కారం చిన్న సినిమా యూనిట్ హను మాన్ తొక్కేస్తున్నారు అంటూ వాళ్ళ వెర్షన్ వాళ్ళకీ ఉంది. అయితే ఈ కాంట్రవర్సీ పై లేటెస్టుగా గుంటూరు కారం నిర్మాత వారసుడు టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన తాజా కామెంట్స్ వైరల్ గా మారాయి.
తమ సినిమా విషయంలో మరో సినిమా వాళ్ళు సింపతి డ్రామా ఆడారు అన్నట్టుగా షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. మేమేదో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా అప్పుడు అంతా అనుకున్నారు అని అయినా కూడా తమ సినిమాకి పోయింది ఏమి లేదు గుంటూరు కారం ఫలితం విషయంలో మేము బాగానే ఉన్నాము అంటూ నాగవంశీ కామెంట్స్ చేశాడు.

దీనితో ఎంత సినిమా పేరు చెప్పకపోయునప్పటికీ తను కామెంట్స్ హను మాన్ కోసమే అని అర్ధం అయ్యిపోయింది. దీనితో మరో సారి ఈ రెండు సినిమాల కోసం చర్చ మొదలైంది. ఇక ఇవి పక్కన పెడితే మహేష్ బాబు ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళితో చేస్తుండగా మరోపక్క తేజ సజ్జ కూడా హను మాన్ తర్వాత పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ మిరాయ్ తో వస్తుండడం విశేషం.
ఈ సినిమాని ఈగల్ ఫేమ్ యువ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాని విడుదలకి తీసుకొస్తున్నారు. అలాగే ఈ సినిమాతో పాటుగా తేజ సజ్జ ప్రశాంత్ వర్మతో భారీ సినిమా హను మాన్ సీక్వెల్ "జై హనుమాన్" తో కూడా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











