twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ నిర్ణయం చారిత్రాత్మక తప్పిదమే.. ప్రభుత్వాలపై నాగబాబు ఫైర్

    |

    మెగా బ్రదర్ నాగబాబు చేసే కామెంట్స్, పెట్టే పోస్టులు ఎంతటి వివాదానికి దారి తీస్తాయో అందరికీ తెలిసిందే. సినీ, రాజకీయ అంశాలపై నాగబాబు చేసే కామెంట్స్ సెన్సేషనల్ అవుతుంటాయి. కరోనా విజృంభణ సమయంలో, లాక్ డౌన్‌లో నాగబాబు వార్తల్లో నిలిచినంతగా మరే సెలెబ్రిటీ కూడా నిలవలేదు. కరోనా, బాలయ్య బాబు, గాడ్సే, కరెన్సీ నోట్లు, దేవుడు ఇలా ప్రతీ ఒక్క విషయంపై సెన్సేషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. తాజాగా మరోసారి నాగబాబు తన నోటికి పని చెప్పాడు.

    మళ్లీ లాక్‌డౌన్..

    మళ్లీ లాక్‌డౌన్..

    ప్రస్తుతం హైద్రాబాద్‌లో మరోసారి లాక్ డౌన్ విధించబోతోన్నట్టు వస్తున్న వార్తలపై నాగబాబు స్పందించాడు. ఈ మేరకు ఆయన ఏమన్నాడంటే.. ‘రీసెంట్‌గా నేను వింటున్న వార్తలను బట్టి నాకు అర్ధమైంది ఏంటంటే ప్రభుత్వానికి మళ్ళీ లాక్‌డౌన్ పెట్టాలనే ఆలోచన ఉంది అని. కొన్ని చోట్ల లాక్‌డౌన్ పెట్టి.. మరికొన్ని చోట్ల సడలింపులు ఉంటాయనే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. లాక్‌డౌన్ విధించమని కొంతమంది అడుగుతున్నారని బయటికొస్తుంది.

    ఉద్దేశ్యం ఏంటి..

    ఉద్దేశ్యం ఏంటి..

    ఇక్కడ నేను అడిగే ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే... అసలు లాక్‌డౌన్ పర్పస్ ఏంటి? కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయడం, రెండోది ఈ గ్యాప్‌లో 60 నుంచి 90 రోజులు చేసిన లాక్‌డౌన్‌లో మెడికల్ రీ-సోర్సెస్‌ని అన్ని రకాలుగా సమకూర్చుకుని, ప్రజలలో ఎవరికైనా కరోనా వస్తే వారికి సరైన వైద్యం చేయించడానికి సరిపోయేటువంటి శక్తులన్నీ సమీకరించుకోవడానికి లాక్‌డౌన్ విధించినట్లుగా నేను అనుకున్నాను.

    లాక్‌డౌన్‌లో ఎన్నో కష్టాలు..

    లాక్‌డౌన్‌లో ఎన్నో కష్టాలు..

    ప్రభుత్వాలు ఇంచు మించు 60 నుంచి 90 రోజులు పాటు లాక్‌డౌన్ విధించాయి. వెరీ గుడ్. ఈలోపుగా అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ మీరు రీ-సోర్స్‌ని కూడదీసుకుని ఉండాల్సింది. ప్రజలందరూ 90 రోజులు పాటు వారి జీవితాల్ని వదిలేశారు. అందరూ ఎంత నష్టపోయారో మనకు తెలుసు. వలస కార్మికుల కష్టాలైతే మనం చెప్పలేమసలు. ఇక మన మీద డిపెండ్ అయినటువంటి నోరు లేని జీవులు కూడా చాలా దారుణంగా సఫర్ అయ్యాయి.

    Recommended Video

    Sri Reddy On Balakrishna-Nagababu Issue || ఆయన కింగే మీరే బొంగు... నగ్న సత్యం చెప్పిన శ్రీ రెడ్డి
    చారిత్రాత్మక తప్పిదమే..

    చారిత్రాత్మక తప్పిదమే..

    ఇవన్నీ పక్కన పెడదాం. ఇంత గ్యాప్‌లో అన్నీ సమకూర్చుకుని ప్రభుత్వాలు ఈ మహమ్మారిపై యుద్ధం చేయాల్సింది. అలా కాకుండా మళ్లీ లాక్‌డౌన్ పెట్టి, జనజీవనాన్ని స్థంబింపజేయడం అనే ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. లాక్‌డౌన్ విధించారంటే మాత్రం ఏ గవర్నమెంట్ అయినా (స్టేట్ ఆర్ సెంట్రల్) చారిత్రాత్మక తప్పిదం అవుతుంది. చాలా దేశాలు లాక్‌డౌన్ లేకుండా కూడా మహమ్మారిని ఎదుర్కొంటూ దేశాన్ని సక్సెస్‌పుల్‌గా నడిపిస్తున్నాయి. మన దేశం చాలా పెద్ద దేశం. జనాభా కూడా ఎక్కువ. అందుకే ఇన్ని రోజులు లాక్‌డౌన్ విధించారు. కానీ ఇప్పుడు లాక్‌డౌన్ అంటే మాత్రం స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ చారిత్రాత్మక తప్పిదం చేసినట్లే'నని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

    English summary
    Nagababu About Again Lockdown In Hyderabad Area. He says that He said the state and central governments had imposed lockdown from 60 to 90 days to prevent spread of Coronavirus. Now, the governments have to concentrate on providing the best medicare to the patients who contract Coronavirus during the lockdown period.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X