twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ తెలియక తప్పు చేశాడు : ఫ్యాన్ గొడవ ఇష్యూపై నాగబాబు!

    మెగా, పవర్ ఫ్యాన్స్ వివాదంపై నాగబాబు స్పందించారు. తమకు అలాంటి విబేధాలు లేవని తెలిపారు.

    By Bojja Kumar
    |

    Recommended Video

    "Allu Arjun Did A Mistake" Mega Brother Nagababu Said |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ మెగా హీరో ఫంక్షన్ జరిగినా.... అక్కడ పవన్ కళ్యాణ్ కనిపించక పోతే రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. అరుపులు, కేకలతో ఫంక్షన్ కు ఇబ్బందులు కలిగించిన సందర్భాలు అనేకం. ఈ క్రమంలో వారిని కంట్రోల్ చేయడానికి మెగా బ్రదర్ నాగబాబు, బన్నీ ప్రయత్నించి, పవర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే.

    కొన్ని సందర్భాల్లో ఇవి రాంగ్ టర్న్ తీసుకోవడంతో బన్నీ టార్గెట్ అయ్యాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు ఈ ఇష్యూపై స్పందించారు. బన్నీ 'చెప్పను బ్రదర్' కాంట్రవర్సీ మీద కూడా మాట్లాడారు.

    మేమంతా ఒకటే అంటున్న నాగబాబు

    మేమంతా ఒకటే అంటున్న నాగబాబు

    కళ్యాణ్ బాబుకు పవర్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లు కూడా మెగా ఫ్యాన్స్ నుండి వెళ్లిన వారే, వాళ్లేమీ సపరేటుగా పుట్టుకురాలేదు. మెగా ఫ్యాన్స్ నుండే కొందరు అటు వైపు వెళ్లారు. ఇంకొందరు ఇండివిడ్యువల్‌గా ఏర్పడ్డారు. నాకేతై మా పవర్ స్టార్ ఫ్యాన్స్ అని గానీ, మెగా ఫ్యాన్స్ అనిగానీ తేడా ఉండదు. అందరూ మా పిల్లలే, మా కుర్రోళ్లే, మా ఫ్యాన్సే అని ఉంటుంది. ఎవరైనా కొందరు ఏదైనా మీటింగులు జరిగినపుడు ఎక్కువ అరిచారు కాబట్టి తప్పు అని చెప్పాను తప్ప మేము, మా ఫ్యాన్స్ అంతా ఒకటే.... అని నాగబాబు వ్యాఖ్యానించారు.

    చీలిక ఉందని చెప్పలేదు

    చీలిక ఉందని చెప్పలేదు

    ఫ్యాన్స్ మధ్య చీలిక అని ఎప్పుడూ అనలేదు. మెగాస్టార్ ఉన్నారు... మెగా ఫ్యాన్స్ ఉన్నారు. మెగా పవర్ స్టార్ చరణ్ బాబుకు చరణ్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు. బన్నీకి ఫ్యాన్స్ ఉన్నారు. వరుణ్‌కు, తేజ్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. చీలిక అని ఎలా అంటాం. చిరంజీవి 150 సినిమా రిలీజ్ అయితే థియేటర్లో లేని పవర్ స్టార్ ఫ్యాన్ లేడు. ప్రతి పవర్ స్టార్ ఫ్యాన్ పది పదిహేను సార్లు చూశారు. అదే విధంగా కళ్యాణ్ బాబు సినిమా రిలీజైతే మెగా ఫ్యాన్స్ ఆరేడు సార్లు చూస్తారు. బాగా తేడాలేం లేవు. బయట కళ్యాణ్ బాబు పెద్ద హీరో ఎప్పుడైతే అయ్యాడో కొంత మంది ఎవరో ఫేసుబుక్కుల్లో ఏదేదో చేస్తున్నారు. కొంత మంది అలాంటోళ్లు ఉంటారు. వాళ్లు చిన్న డివైడ్ అండ్ రూల్ కాన్సెప్టు ఏదో చేస్తుంటారే తప్ప మాకెప్పుడూ అది ప్రాబ్లం కాదు..... అని నాగబాబు అన్నారు.

    కళ్యాణ్ బాబు ఫ్యాన్స్‌లో వారినే

    కళ్యాణ్ బాబు ఫ్యాన్స్‌లో వారినే

    కొన్ని సందర్భాల్లో నేను, బన్నీ.... కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ ను విమర్శించడానికి కారణం వారు గొడవ చేయడమే. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అందరినీ విమర్శంచలేదు. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ లో కొందరు అన్నాను. అందరినీ ఒకే గాడిన కట్టలేం. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్‌లో ఎంతో మంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు. చదవుకున్న వారు, సాఫ్ట్ వేర్ గైస్, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, పొలిటికల్ పీపుల్ ఉన్నారు.... అని నాగబాబు అన్నారు.

    తమ్ముడంటే ప్రేమ ఉంది

    తమ్ముడంటే ప్రేమ ఉంది

    నాకు నా తమ్ముడంటే వ్యక్తిగతంగా చాలా ప్రేమ ఉంది. ఆరోజు నేను చెప్పిన టోన్‌లో సీరియస్‌నెస్ ఉంది తప్ప, వారిపై కక్ష లేదు. మీరు వచ్చినపుడల్లా ఎందుకు ఇలా అరుస్తున్నారు, కరెక్టుగా లేదు అని చెప్పాను. ప్రతి సారి కళ్యాణ్ బాబు రాలేదు రాలేదు అంటే... ఏం చెబుతాం. మా ఫంక్షన్లకు కళ్యాణ్ బాబు ఎప్పుడైనా వస్తాడా? వాడి ప్రపంచం వేరు.... అని నాగబాబు అన్నారు.

    చిన్నప్పటి నుండి అంతే

    చిన్నప్పటి నుండి అంతే

    తమ్ముడు ముందు నుండి సపరేట్ రూటు. చిన్నతనంలో మాతో ఆడుకునే వాడు కాదు. ఒక్కడే రూంలో కూర్చుని వాడి ప్రపంచంలో ఉండేవాడు. వాడి క్యారెక్టర్ అది. అది ఎన్నిసార్లు చెప్పినా వాళ్లకు అర్థం కాదు, ఆ రోజు గొడవ చేస్తున్న కొంత మందిని అన్నాను. అందరూ గొడవ ఎందుకు చేస్తారు..... అని నాగబాబు వ్యాఖ్యానించారు.

    కొందరు ఫ్యాన్స్ నన్నూ అన్నారు, వారికి ఒకటే చెప్పా

    కొందరు ఫ్యాన్స్ నన్నూ అన్నారు, వారికి ఒకటే చెప్పా

    అయినా కూడా కొందరు ఫ్యాన్స్ మా పవర్ స్టార్‌ను అంటావా, ఇలా అంటావా ప్రశ్నించారు. అరేయ్ మీ పవర్ స్టార్ నా తమ్ముడు రా... మా తమ్ముడిని నేను అనలేదు, మిమ్మల్ని కూడా అనలేదు. అలా అల్లరి చేయొద్దు అన్నాను. చెప్పడంలో కాస్త సీరియస్ టోన్ ఉంది అంతే, మా తమ్ముడి ఫ్యాన్స్ నన్ను ఎంత అన్నా, ఎన్ని అన్నా... దే ఆర్ స్టిల్ మా ఫ్యాన్స్, మా అన్నయ్య ఫ్యాన్స్, తమ్ముడి ఫ్యాన్స్, వాళ్ల మీద ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ఈ విషయంలో మరోమాట లేదు.... అని నాగబాబు అన్నారు.

    బన్నీ చేసిన మిస్టేక్ అదే

    బన్నీ చేసిన మిస్టేక్ అదే

    బన్నీ కూడా బ్రదర్ అలా సపరేట్ చేయకండి మేమంతా కలిసున్నాం, మనమంతా ఒకే ఫ్యాన్స్ అన్నాడు తప్ప కళ్యాణ్ బాబు ఫ్యాన్స్‌ను బన్నీ ఎప్పుడూ ఏమీ అనలేదు. ఒక్కసారి మాత్రం ‘చెప్పను బ్రదర్' అన్నాడు. అది ఏదో ఆవేశంలో అనేశాడు. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఆవేశానికి గురవుతాడు. అందుకే చెప్పను బ్రదర్ అన్నాడు. బన్నీ తెలిసో తెలియకో ఆ ఒక్క తప్పే చేశాడు

    అది పెద్ద మిస్టేక్ కాదు. అనుకోకుండా టంగ్ స్లిప్ అయ్యాడు. తర్వాత తనే అన్నాడు కదా మనం జాగ్రత్తగా ఉండాలి, మనందరం ఒకటే, మీరు వేరు మేము వేరు కాదు. కలిసుండాలి అని సరి చేసుకుని చెప్పాడు. మాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు.... అని నాగబాబు అన్నారు.

    అలా అంటే నోరా, తాటి మట్టా?... మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్‌‌పై నాగబాబు కామెంట్!

    అలా అంటే నోరా, తాటి మట్టా?... మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్‌‌పై నాగబాబు కామెంట్!

    ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలా అంటే నోరా, తాటి మట్టా? అంటూ తన మనసులోని మాటను బయట పెట్టారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    ప్రతి కుక్కను కంట్రోల్ చేయలేం, గెలుపే మన రివేంజ్: నాగబాబు

    ప్రతి కుక్కను కంట్రోల్ చేయలేం, గెలుపే మన రివేంజ్: నాగబాబు

    మనకు నచ్చని అంశాలు కనబడకూడదు, వినపడకూడదు అంటే కుదరదు. మనం ఒక ప్రపంచంలో నివసిస్తున్నాం.... అరిచే ప్రతి కుక్కను కంట్రోల్ చేయలేం, గెలుపే మన రివేంజ్ అని నాగబాబు అన్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    "Allu Arjun has no problem with Pawan Kalyan fans. Fans are United." Mega brother Nagababu said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X