twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కూర్చున్న సీట్ నుంచి చిరంజీవిని లేపేసిన ఆ స్టార్.. నెం.1 హీరో అవ్వాలని అప్పుడే ఫిక్స్!!

    |

    ఆ గొంతు ఏంటి? అది అసలు వాయిసా? అని అమితాబ్ బచ్చన్‌ను కించపరిచారు. కానీ ఇండియన్ సినీ చరిత్ర గతిని మార్చాడు. రజినీకాంత్‌ను ఎంతో మంది అవమానపర్చారు.. కానీ ఇండియన్ సూపర్ స్టార్‌గా ఎదిగాడు. ఇక మెగాస్టార్ చిరంజీవికి కూడా మొదట్లో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఎన్నో కష్టాలనష్టాలను ఓర్చుకుని మెగాస్టార్ రేంజ్‌కు ఎదిగాడు. తాజాగా నాగబాబు చిరంజీవి గురించి మాట్లాడుతూ అనేక విషయాలను తెలిపాడు.

    Recommended Video

    Actor Kaikala Satyanarayana Thanking Megastar Chiranjeevi & Pawan Kalyan | Filmibeat Telugu
    అలా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో..

    అలా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో..

    చెన్నైలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో రజినీకాంత్ గారిది ఫస్ట్ బ్యాచ్.. చిరంజీవి గారిది చివరి బ్యాచ్. ఆ తరువాత అది అడయార్ ఇన్‌స్టిట్యూట్‌గా మారింది. అయితే ఆ సమయంలో మా అన్నయ్యతో పాటు సుధాకర్, హరి ప్రసాద్ కలిసి ఉండేవారు. వారికి ఓ స్నేహితుడు ఉన్నాడు. యాక్టర్ కమ్ డైరెక్టర్ పురాణం సూరి అనే అతను కూడా స్నేహితుడు. అయితే అతను ఫ్యామిలీ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.

    ప్రివ్యూ థియేటర్‌లో..

    ప్రివ్యూ థియేటర్‌లో..

    పురాణం సూరి ఒకసారి ఓ విషయం చెప్పారు. ఈ విషయం అన్నయ్యకు కూడా తెలీదు. ఓ సారి ఓ పెద్ద స్టార్ హీరో సినిమా ప్రివ్యూ జరుగుతోంది. పురాణం సూరి ఫ్యామిలీ తరుపున చిరంజీవి, సుధాకర్, హరి ప్రసాద్ వెళ్లారు. అక్కడ థియేటర్‌లో ముందు వరుసలో వెళ్లి కూర్చున్నారు అని నాగబాబు చెప్పుకొచ్చాడు.

    ఆ అవమానం..

    ఆ అవమానం..

    ముందు వరుసలో కూర్చున్న అన్నయ్యను లేపి.. వెనకాల ఎక్కడో కూర్చోబెట్టారు. ఆ వచ్చిన వాళ్లు హీరోకు కావాల్సిన వాళ్లు కావడంతో వీళ్లను లేపారు. అయితే అక్కడ అన్నయ్య ఏం మాట్లాడలేదట. ఇంటికి వచ్చారట. అయితే టాక్ తెలుసుకోవాలని పురాణం సూరి తమ ఫ్యామిలీ ఇంటికి రమ్మన్నారని నాగబాబు తెలిపాడు.

    చిరు కోపంతో..

    చిరు కోపంతో..

    టాక్ చెప్పడానికి సుధాకర్, హరి ప్రసాద్ వెళ్లారు. కానీ అన్నయ్య ఎంతకీ వెళ్లకపోయే సరికి పురాణం సూరి వెళ్లి పిలిచాడట. వెళ్లు వస్తాను.. అని సూరితో కోపంగా అన్నారట. వచ్చాక ఏం జరిగిందని అడిగితే థియేటర్లో జరిగింది చెప్పారట. అని నాగబాబు నాటి సంగతులను వివరించాడు.

     నెం.1 హీరో అవ్వాలి..

    నెం.1 హీరో అవ్వాలి..

    వాళ్లంతా అంతేలే వదిలేయ్.. అని ఆ ఫ్యామిలీ ఓదార్పు మాటలు చెబుతూ నువ్ తప్పకుండా గొప్పవాడివి అవుతావ్ మాకు తెలుసని అన్నారట. పెద్ద హీరోను అవుతాను అని ఇంతవరకు అనుకున్నాను కానీ అందరి కంటే నెంబర్ వన్ హీరో అవుతా అంటూ ఆ రోజు ఫిక్స్ అయ్యారట. మెగాస్టార్‌గా ఎదిగిన తీరును చూసి పురాణం సూరి ఆ రోజు జరిగిన సంఘటన అంతా నాకు చెప్పార అంటూ నాగబాబు తెలిపాడు.

    English summary
    Nagababu About Chiranjeevi Bad Experience In Early stage. Chiranjeevi faced Bad Experience In Preview Theatre At his Early stage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X