చిరంజీవి ఆ రెండు చిత్రాలు వరుణ్ తేజ్‌తో రీమేక్.. నాగబాబు
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమవుతున్న సినీ ప్రముఖులు లైవ్ ఛాటింగ్‌తో అదరగొడుతున్నారు. గ్రూప్ ఛాటింగ్‌లోకి వచ్చి ఆసక్తికరమైన విషయాలను పంచుకొంటున్నారు. తాజాగా యాంకర్ రవి, నాగబాబు మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ ఇలా సాగింది. చిరంజీవి సినిమాల గురించి నాగబాబు, యాంకర్ రవి మాట్లాడుకుంటూ..

నాకు చిరంజీవి స్పూర్తి
నా జీవితానికి చిరంజీవి, పవన్ కల్యాణ్ స్పూర్తి. చిరంజీవి నటించి గ్యాంగ్ లీడర్ సినిమా చూసిన తర్వాత నా జీవితం ఇక సినిమానే అని అనుకొన్నాను. బీటెక్ పూర్తయిన తర్వాత నేను ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు చేశాను. కానీ టీవీ రంగంలో స్థిరపడ్డాను. అయితే నా దృష్టంతా సినిమా రంగం వైపే అని యాంకర్ రవి చెప్పారు.

చిరంజీవి మూవీస్ రీమేక్ చేయాల్సి వస్తే
నాగబాబుతో లైవ్ ఛాట్ సందర్బంగా ఎదైనా చిరంజీవి సినిమాను వరుణ్ తేజ్‌తో రీమేక్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు? అని ఓ ప్రశ్న అడిగిన ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ.. అన్నయ్య నటించిన ఛాలెంజ్ సినిమా నాకు ఇష్టం. ఆ సినిమాను వరుణ్ తేజ్‌తో చేస్తే బాగుంటుందని అనుకొంటాను. ఆ సినిమా దేవీ శ్రీ ప్రసాద్ తండ్రి సత్యానంద్ చక్కటి స్క్రీన్ ప్లే రాశారు. ఆ సినిమా వరుణ్ బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది అని నాగబాబు చెప్పారు.

చిరంజీవి మూవీ హాలీవుడ్ స్థాయిలో
అంతేకాకుండా చిరంజీవి నటించిన కొదమ సింహం కూడా నాకు నచ్చుతుంది. ఆ సినిమా కూడా వరుణ్ తేజ్‌కు సరిపోతుంది. ఆ సినిమా హాలీవుడ్ సినిమా నుంచి స్పూర్తి పొంది తీసిన చిత్రమది. ఈ రెండు చిత్రాలు వరుణ్ తేజ్‌తో రీమేక్ చేయవచ్చు. కానీ అన్నయ్య నటించిన సినిమాలు రీమేక్ చేయడం కత్తి మీద సామే అవుతుంది. చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అని నాగబాబు పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ నుంచి నేర్చుకోవాల్సింది..
పవన్ కల్యాణ్ గురించి యాంకర్ రవి ప్రస్తావిస్తూ.. మీ నుంచి పవన్ స్ఫూర్తి తీసుకొన్నారని పలు సందర్భాల్లో చెప్పారు. అయితే మీరు పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి స్పూర్తిని పొందారనే ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ.. పుస్తకాలు చదవడంలో పవన్ కల్యాణ్ ముందు నుంచి ఆసక్తి చూపుతారు. తమ్ముడి నుంచి నేను నేర్చుకొన్నది. స్పూర్తి పొందిన విషయం పుస్తకాలు చదవడం ద్వారా నాలెడ్జ్‌ను సంపాదించడం అని నాగబాబు అన్నారు.
Recommended Video

వరుణ్ బాక్సింగ్‌పై దృష్టి
ప్రస్తుతం వరుణ్ తేజ్ తన రాబోయే సినిమా విషయంపై దృష్టి పెట్టారు. ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంగా సాగుతుంది. ఆ సినిమా కోసం బాక్సింగ్ నేర్చుకొంటున్నారు. ఫిట్‌నెస్‌పై పూర్తి స్థాయిలో శ్రద్ద పెట్టారు. లాక్ డౌన్‌కు ముందు తన ఆఫీస్‌కు వెళ్లి కోచ్‌తో అక్కడే ఉండిపోయారు. కేవలం ఫోన్‌లోనే మాట్లాడుకొంటున్నాం అని నాగబాబు తెలిపారు.


Click it and Unblock the Notifications











