twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నయ్య రమ్మంటే వచ్చా... ఫెయిల్ అయ్యాను: నాగబాబు

    అన్నయ్య పిలిస్తే సినిమాల్లోకి వచ్చానని నాగబాబు అన్నారు. అన్నయ్య సూచన మేరకే నిర్మాతగా మారానని తెలిపారు.

    By Bojja Kumar
    |

    మెగా బ్రదర్ నాగబాబు.... అన్నయ్య అండతో సినిమా రంగంలోకి అడుగు పెట్టిన ఆరడుగుల ఆజానుబాహుడు. ఆయన నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా, తర్వాత నటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.

    అన్నయ్య సపోర్టు ఉన్నా, తమ్ముడు పవన్ కళ్యాణ్ లాంటి వారు ఎప్పుడంటే అప్పుడు డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా....... ఎందుకో ఆయన నిర్మాతగా నిలదొక్కుకోలేక పోయారు. నటుడిగా ఆయన చేసిన ప్రయత్నాలు చాలా తక్కువే. అయితే నిర్మాతగా తాను ఎందుకు ఫెయిల్ అయ్యానో ఇటీవల ఇంటర్వ్యూలో నాగబాబు తెలిపారు.

    అన్నయ్య రమ్మంటేనే ఇటు వైపు వచ్చా

    అన్నయ్య రమ్మంటేనే ఇటు వైపు వచ్చా

    తనకు మొదట్లో సినిమా రంగం వైపు రావాలనే ఆలోచన ఉండేది కాదని, అన్నయ్య రమ్మంటేనే ఈ రంగం వైపు వచ్చానని మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఓఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. లా అయిపోయిన తర్వాత చెన్నై బార్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను. ఆ తర్వాత యూఎస్ఏలో ఎంబీఏ చేద్దామనుకుని జీమ్యాట్ ఎగ్జామ్ కు ట్రై చేశాను. అన్నయ్యకు నేనంటే చాలా ఇష్టం. వీడెక్కడో ఉండి ఉద్యోగం చేసే బదులు నాతో ఉంటే బావుటుంది అనుకున్నారు.... అని నాగబాబు తెలిపారు.

    Recommended Video

    "Allu Arjun Did A Mistake" Mega Brother Nagababu Said |
    నాకేమీ తెలియదు అని అన్నయ్యకు చెప్పాను

    నాకేమీ తెలియదు అని అన్నయ్యకు చెప్పాను

    అన్నయ్య సూచన మేరకు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటరవ్వడమే నిర్మాతగా చేద్దామనే ఆలోచనతో ఎంటరయ్యాను, ఆర్టిస్టుగా చేద్దామనే ఉద్దేశ్యం లేదు. ఓసారి అన్నయ్య వచ్చి అంత దూరం ఎందుకు, ఇండస్ట్రీలోకి రావచ్చుకదా అన్నారు. నాకేం తెలియదు కదా ఏం చేద్దామని అడిగితే.. ప్రొడక్షన్ వైపు రమ్మన్నారు. ఆ విధంగా నేను నిర్మాతగా ఎంటరయ్యాను... అని నాగబాబు తెలిపారు.

    అతడి వల్లే నటనలోకి...

    అతడి వల్లే నటనలోకి...

    అప్పట్లో యండమూరి నవలలు బాగా చదివే వాన్ని. ఆయన నవలతో కెఎస్ రామారావుగారు ‘రాక్షసుడు' సినిమా చేస్తున్నాడు. నాకు యాక్టింగ్ రాదు అని తెలిసి కూడా ఇందులో మంచి క్యారెక్టర్ ఉంది

    చేసేవు రా... మేము ఉన్నాం కదా అని యాక్టింగ్ వైపు తీసుకొచ్చారు. నటుడిగా నా ఎంట్రీ అనుకోకుండా అలా జరిగిపోయింది.... అని నాగబాబు తెలిపారు.

    నాకు సూట్ కాదని ఆలస్యంగా అర్థమైంది

    నాకు సూట్ కాదని ఆలస్యంగా అర్థమైంది

    నటన అడపా దడపా సినిమాల్లో మాత్రమే. ముందు నుండీ నిర్మాతగానే ట్రావెల్ చేశాను. రీసెంట్ టైమ్ లో ఎక్కువగా ఫోకస్ యాక్టింగ్ వైపు పెట్టాను. నిర్మాతగా కూడా ఏదో చేద్దామని వచ్చాను. అప్పట్లో ఈజీగా చేయొచ్చులే అనుకున్నాను. తర్వాత ఎక్కడో నాకు అనిపించింది.... ఈ ప్రొఫెషన్ నాకు సూట్ కాదని. ఈ విషయం పదిహేను పదహారేళ్లకు కానీ అర్థం కాలేదు.... అని నాగబాబు తెలిపారు.

    నేను ఫెయిల్ అయ్యాను, యంగ్‌స్టర్స్‌కి చెప్పేది ఒకటే

    నేను ఫెయిల్ అయ్యాను, యంగ్‌స్టర్స్‌కి చెప్పేది ఒకటే

    యంగ్‌స్టర్స్‌కి నేను చెప్పేది ఒకటే. మన కెరీర్ ఎంచుకునేపుడు బాగా క్లియర్ కట్ విజన్ లేకుంటే మనకు నచ్చనిదో, మనకు చేతకానిదో.. మనకు తెలియదాంట్లోకి వెళ్లి ఏదో బ్రతికేస్తాం. మీ గోల్ ఏదైనా, డిసిషన్ తీసుకుని వెళితే మంచి పొజిషన్ కు వెళతాం. క్లీయర్ కట్ డిసిషన్ లేదు కాబట్టే నేను ఫెయిల్ అయ్యాను.... అని నాగబాబు అన్నారు.

    సరైన కృషి చేయలేదు

    సరైన కృషి చేయలేదు

    నిర్మాతగా నేను ఎంటరయ్యానే తప్ప నా వైపు నుండి సరైన కృషి లేదేమో. అన్నయ్య నాకు ఎన్నో సినిమాలు ఇచ్చారు. కళ్యాణ్ బాబు ఓ సినిమా చేశారు. చరణ్ బాబు చేశాడు. ఎంత మంది చేసినా సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకోలేక పోయాను. నాకు అడపా దడపా అరవింద్ గారి నుండి కూడా సపోర్టు ఉంది. ఇన్ని చేసినా సక్సెస్ ఫెల్ ప్రొడ్యూసర్ కాలేక పోయాను.... నాగబాబు అన్నారు.

    రియలైజ్ అయ్యాను

    రియలైజ్ అయ్యాను

    నేను రియలైజ్ అయింది ఏమిటంటే... నాలో నిజమైన ప్రొడ్యూసర్ లేడని, ఇండస్ట్రీలో చాలా మందికి తెలియనిది ఏమిటంటే...ప్రొడ్యూసర్ అంటే ఏదో డబ్బు పెట్టి కూర్చోవడం కాదు. ప్రొడ్యూసర్ అనేది ఒక క్రాఫ్ట్. ఆ విద్య చాలా మందికి తెలియదు. ఆ విద్య తెలిసిన వాళ్లు ఐదారు మంది ఉన్నారు. అరవింద్ గారు, దిల్ రాజు, సురేష్ బాబు మరికొందరు ఉన్నారు. వాళ్లు నిర్మాతలు, వాళ్లకు తెలుసు టెక్నికల్ ఎలా వాడాలి అనేది. ప్రాఫిట్ వస్తే... మాగ్జిమమ్ ప్రాఫిట్ ఎంత సంపాదించొచ్చు. లాస్ వస్తే నిమిమమ్ ఎంత తగ్గించాలి. వాళ్లు చాలా ప్రొఫెషనల్ గా ఆలోచిస్తారు..... అని నాగబాబు అన్నారు.

    దానికి ఓ స్కూలు ఉండాలి

    దానికి ఓ స్కూలు ఉండాలి

    ఫిల్మ్ స్కూల్స్, యాక్టింగ్ స్కూల్స్, డైరెక్షన్ ఇలా చాలా ఉంటాయి. ప్రొడ్యూసర్లకు కూడా ఓ స్కూలు పెట్టాలి, అది తెలిస్తేనే సక్సెస్ అవుతాం. ఆ క్రాఫ్ట్ నా దగ్గర లేదు. ప్రొడ్యూసర్‌గా రుద్రవీణకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. వచ్చింది కాబట్టి నేను పర్లేదు అనుకోలేదు. నాకు తెలుసు నేను ఎన్ని తప్పులు చేశానో.... అని నాగబాబు అన్నారు.

    ఆరెంజ్ విషయంలో డిపెండెంట్ అయిపోయాను

    ఆరెంజ్ విషయంలో డిపెండెంట్ అయిపోయాను

    ‘ఆరెంజ్' విషయంలో ఎక్కువ డిపెండెంట్ అయిపోయాను. ప్రొడ్యూసర్ గా డిపెండెంట్ కూడా కరెక్ట్ కాదు. ప్రొడ్యూసర్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కావాలి. ఆరెంజ్ విషయంలో నమ్మకాలతో కొన్ని కొన్ని వెళ్లిపోయాయి. నమ్మకం ఒమ్ము అయింది. అప్పటికీ ఏం చేయలేని పరిస్థితి, డూ ఆర్ డై పరిస్థితి. అన్నయ్య, కళ్యాణ్ బాబు ఫుల్ సపోర్టు ఇచ్చారు. ఆరెంజ్ సినిమా తర్వాత ఆర్థికంగా విపరీతంగా ఆటు పోట్లకు గురైన తర్వాత ప్రొడక్షన్ చేయకూడదను అని డిసైడ్ చేసుకున్నాను... అని నాగబాబు తెలిపారు.

    టీవీ రంగంలో సక్సెస్ అయ్యాను

    టీవీ రంగంలో సక్సెస్ అయ్యాను

    పిల్లలను, పెంచి పెద్దచేయడం నాదే రెస్పాన్సిబిలిటీ. పిల్లలు అప్పటికి ఎదుగుదల స్టేజీలో ఉన్నారు. అన్ని వదిలేసి నాకు ఉన్న కొద్దిపాటి ఫేస్ వ్యాల్యూను టీవీ రంగంలో ఇవ్వాల్వ్ చేశాను.

    టీవీ రంగంలో కొద్దో గొప్పో ఆఫర్లు వస్తే దాన్ని వినియోగించుకుంటూ సర్వైవ్ అయ్యాను. ఇప్పటి వరకు సర్వైవ్ అవుతున్నాను. సినిమా ఇండస్ట్రీకి నేను సరిగా చేసుండక పోవచ్చు. ప్రొడక్షన్లో సరిగా చేసుండక పోవచ్చు. కానీ టీవీ రంగంలో నిర్మాతగా సక్సెస్ అయ్యాను. యాక్టర్ గా సక్సెస్ అయ్యాను... అని నాగబాబు అన్నారు.

    English summary
    "I'm not that succeeded by that producer in the film industry. I decided not to make films after Orange failure." Nagababu said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X