Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హైపర్ ఆదిపై దారుణమైన కామెంట్స్.. అలా అంటూ పరువుదీసిన నాగబాబు
హైపర్ ఆది గురించి పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటూ అలా జబర్దస్త్ స్టేజ్ మీదకు వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వెండితెరపైనా నవ్వులు పూయించాడు. అయితే ఎక్కువగా బుల్లితెర మీదే ఫేమస్ అయ్యాడు. అలాంటి హైపర్ ఆది కెరీర్ స్టార్టింగ్‌లోనూ కష్టాలు పడ్డాడు. ఇప్పుడు మొత్తానికి బుల్లితెరపై స్టార్‌గా ఉన్నాడు. అలాంటి హైపర్ ఆదిపై నాగబాబు ఓ కామెంట్ చేశాడు.
ఒకప్పుడు అలా..
ఒకప్పుడు జబర్దస్త్ షోలో నాగబాబు ఉన్న సమయంలో హైపర్ ఆది ఎంతో విధేయుడిగా ఉండేవాడు. హైపర్ ఆది తన స్కిట్లలో నాగబాబుపై భక్తి భావం, భజన అన్నీ కనిపించేవి. కానీ ఒక్కసారి నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లడంతో పంచ్‌లు వేయడంప్రారంభించాడు. అదిరింది, బొమ్మ అదిరింది షోల మీద ఆది బాగానే పంచ్‌లు వేశాడు.
వ్యవహారం చెడిందా?
అదిరింది షోకు నాగబాబు వెళ్లినప్పుడు తనతో పాటు హైపర్ ఆది, సుధీర్ వంటి వారిని తనతో పాటు తీసుకెళ్లాలని చూశాడు. వస్తారని నాగబాబు కూడా ఆశించినట్టున్నాడు. కానీ బాండ్, అగ్రిమెంట్స్ వటివాళ్ల వారంతా రాలేకపోయారు. అలా నాగబాబు వారి మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్టుందని అంతా అనుకున్నారు.
తాజాగా అలా..
నాగాబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో తెగ ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఈ క్రమంలో జబర్దస్త్ ఆర్టిస్ట్‌ల గురించి ఎదురయ్యే ప్రశ్నలకు వెరైటీగా సమాధానాలు ఇస్తుంటాడు. మొన్నామధ్య సుధీర్ గురించి అడిగితే.. ఏ సుధీర్ అని అడిగేశాడు. తనకెప్పుడూ కూడా గెటప్ శ్రీనుయే ఫేవరేట్ అని నాగబాబు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.
హైపర్ ఆదిపై ఇలా..
తాజాగా నాగబాబు హైపర్ ఆది గురించి స్పందించాడు. హైపర్ ఆది గురించి ఏదైనా చెప్పండి అని ఓ నెటిజన్ అడిగాడు. అతను ఓకే కానీ అతను తన కామెడీలో అప్డేట్ అవ్వాలి.. అని చెప్పేశాడు. అంటే హైపర్ ఆది ఎప్పుడూ అదే రొట్ట కామెడీ చేస్తున్నాడనే ఉద్దేశ్యంలో ఇలాంటి కామెంట్ చేశాడని నెటిజన్లు అంటున్నారు.