Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పదో తరగతిలోనే లెటర్ రాసింది.. నిహారికపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్
మెగా బ్రదర్ నాగబాబుకు తన కూతురు నిహారిక అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. ఎన్నో సందర్భాల్లో కూతురిపై ప్రేమను వ్యక్త పరిచాడు. ఓ పది నిమిషాలు కూతురు కనపడకపోతే ఎలా అయిపోతాడు.. ఎంతలా బాధపడుతాడో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఓసారి న్యూజిలాండ్ ఘటన గురించి ఓ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు. ఓ పది నిమిషాలు కూతురు కనిపించకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనేంతగా బాధపడినట్టు తెలిపాడు. అలాంటి గారాలా పట్టిపై ఉన్న ప్రేమను తాజాగా మరోసారి బయటపెట్టాడు.
యూట్యూబ్‌లో అలా..
నాగబాబు ప్రస్తుతం యూట్యూబ్‌లో కమ్యూనికేషన్‌కు సంబంధించిన పాఠాలను చెబుతున్నాడు. కమ్యూనికేషన్ అనేది ఎంత ముఖ్యమో అది లేకపోతే ఎలాంటి అనార్థాలు జరుగుతాయో పూసగుచ్చినట్టు వివరించాడు. పిల్లలకు మాట్లాడే స్వేచ్చ, వారి భావాలను పంచుకునే ధైర్యాన్ని, నమ్మకాన్ని తల్లిదండ్రులు ఇవ్వాలని నాగబాబు చెప్పాడు.
ఓవర్ ప్రొటెక్ట్..
ఒకప్పుడు పిల్లలకు తల్లిదండ్రులు ఫ్రీడం ఇచ్చేవారు..కానీ ఇప్పుడున్న తరం వాళ్లు మాత్రం ఓవర్ ప్రొటెక్ట్.. విపరీతమైన ప్రేమ వల్ల ఫ్రీడం ఇవ్వడం లేదు. పిల్లలు ఏదైనా చేస్తామని అడిగినా, ఎక్కడికైనా వెళ్లాలని చెప్పినా పంపించరు. నేను కూడా అలాగే చేసేవాడిని అని తన జీవితంలో జరిగిన ఘటనల గురించి నాగబాబు చెప్పుకొచ్చాడు.
పదో తరగతిలో అలా...
నిహారిక పదో తరగతిలో ఉత్తరాంచల్‌కు విహారయాత్రకు వెళ్లాలి. పది రోజులు ఎక్స్కర్షన్ వెళ్తాను అని నిహారిక నాతో చెప్పింది. కానీ పది రోజులంటే నాకు భయం వేసింది. నేను పంపించను అని చెప్పాను. అలా ఐదారు రోజులు బతిమిలాడుతూనే ఉంది. కానీ నేను మాత్రం ఒప్పుకోలేదని నాగబాబు తెలిపాడు.
వెంట బాడీగార్ట్స్..
చాలా బతిమిలాడుతోంది కదా అని ఓ కండీషన్ పెట్టాను.. నువ్ వెళ్తానంటే వెళ్లు కానీ నీ వెంట ఇద్దరూ బాడీ గార్డ్స్‌ను పంపిస్తాను.. వాళ్లు నిన్ను దూరం నుంచి చూస్తుంటారు.. వేరే చోట ఉంటారు.. నిన్ను డిస్టర్బ్ చేయరు ఓకేనా అని అడిగాను. అలా చేస్తే నా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతారు.. దానికి బదులు వెళ్లకుండా ఉంటేనే బెటర్ అని నిహారిక ఊరుకుందని నాగబాబు పేర్కొన్నాడు.
లెటర్ రాసేసింది..
ఒక రోజు ఉదయాన్నే లేచే సరికి నా పక్కనే ఓ లెటర్ పెట్టేసింది. అందులో నిహారిక ఎంతో చక్కగా రాసి.. ఎంతో బాగా కమ్యూనికేట్ చేసింది. నా ఫ్రెండ్స్ నంబర్లు ఇస్తాను. నా టీచర్ల నంబర్లన్నీ ఇస్తాను.. రోజూ మూడుసార్లు ఫోన్ చేస్తాను.. ఎక్కడికి వెళ్లినా లొకేషన్ చెబుతాను.. సిగ్నల్ లేకపోయినా ఎలాగైనా సరే ఫోన్ చేస్తాను.. ప్లీజ్ వెళ్లనివ్వు నాన్నా.. అంటూ క్యూట్ క్యూట్ ఫోటోలను కూడా జత చేసి పెట్టిందని నాగబాబు అన్నాడు.
Recommended Video
అలా చేసి ఉండకపోతే..
అలా వాటిని చూడటంతో కూల్ అయిపోయాను.. విహారయాత్రకు వెళ్లేందుకు ఒప్పుకున్నాను అని నాగబాబు చెప్పుకొచ్చాడు. ఆ రోజు అలా నిహారిక కమ్యూనికేట్ చేయకపోతే తాను మిస్ అయ్యేది.. నేనూ ఒప్పుకునే వాడిని కాదంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు.