పూరి జగన్నాథ్ ఎవరి దగ్గర పని చేయలేదు.. బద్రి అవకాశం అలా వచ్చింది: నాగబాబు

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకులు చాలా మంది ఉన్నారు. కానీ అందులో హిట్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా జనాలను ఎక్కువగా ఆకర్షించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. మాస్ డైలాగ్స్ తో ఆయన ఆకట్టుకునే విధానం ఏ విధంగా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈయన రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అని అందరికి తెలిసిందే. కానీ ఇటీవల నాగబాబు మాత్రం పూరి ఎవరి దగ్గర పని చేయకుండా ఎదిగాడని చెప్పిన విధానం హాట్ టాపిక్ గా మారింది.

తన కష్టాలను అనుభవాలను జోడించి..

తన కష్టాలను అనుభవాలను జోడించి..

ఇటీవల కాలంలో నాగబాబు తన యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక రకాల విషయాలను వీక్షకులతో షేర్ చేసుకుంటున్నారు. డబ్బు ఈజీగా ఎలా సంపాదించాలి అనే చిట్కాలతో తన కష్టాలను అనుభవాలను జోడించి పలు ఉదాహరణలు బయటపెడుతున్న నాగబాబు పూరి జగన్నాథ్ బద్రి మొదలైన విధానం గురించి కూడా వివరణ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూరి జగన్నాథ్ ఎవరి దగ్గర వర్క్ చేయలేదు

పూరి జగన్నాథ్ ఎవరి దగ్గర వర్క్ చేయలేదు

నాగబాబు మాట్లాడుతూ.. మొదట పూరి జగన్నాథ్ ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. అతను తనకు తానే ఒక ఏకలవ్య శిష్యుడిగా మారాడు. అప్పట్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలన్నా కూడా చాలా పోటీ ఉండేది. అవకాశం అంతక్ ఈజీగా దొరికేది కాదు. కె.బాలా చందర్, రామ్ గోపాల్ వర్మ లాంటి వారు కూడా సొంతంగా ఎదిగినవారే. వారు కూడా ఎవరి దగ్గర పని చేయలేదు.

ఎక్కడ షూటింగ్స్ జరిగినా వెళ్ళేవాడు

ఎక్కడ షూటింగ్స్ జరిగినా వెళ్ళేవాడు

ఇక పూరి జగన్నాథ్ ఎక్కడ షూటింగ్స్ జరిగినా లొకేషన్స్ కి వెళ్ళేవాడు. దర్శకుడు ఏం చేస్తున్నాడు. నటీనటులను ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ లో ఏం రాసుకున్నాడు. ఏ విధంగా తెరకెక్కిస్తున్నాడు అనే విషయాలను అక్కడే ఉండి అవగాహన చేసుకునే వాడు. సొంతంగా తనకు తానే పని మీద మమకారం పెంచుకొని ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.

Recommended Video

#HBDSSRajamouli : Jr NTR to Ajay Devgn, Wishes Pour in on Twitter | Waiting For RRR
బద్రి అవకాశం ఎలా వచ్చింది అంటే

బద్రి అవకాశం ఎలా వచ్చింది అంటే

బద్రి సినిమా అవకాశం ఎలా వచ్చింది అంటే.. పవన్ కళ్యాణ్ కొత్త వాళ్ళతో చేయాలని అనుకున్న సమయంలో పూరి నా కజిన్ ద్వారా పవన్ కళ్యాణ్ ని కలిసి బద్రి కథను అనుకున్నది అనుకున్నట్లుగా చాలా కరెక్ట్ గా చెప్పాడు. పవన్ కళ్యాణ్ కి కథ నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నాడు. ఆ విధంగా పూరి జగన్నాథ్ మొదటి సక్సెస్ అందుకొని వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ విధంగా మనం నమ్ముకున్న పనిలో నిజాయితీగా కష్టపడితే కోట్లు సంపాదించవచ్చని నాగబాబు వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X