రాంచరణ్‌లో అల్లు అరవింద్ లక్షణాలు.. సైరా మీ ఊహకు కూడా అందదు.. నాగబాబు!

మెగా బ్రదర్ నాగబాబు ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి సైరా నరసింహా రెడ్డి ఇలా అన్ని విషయాల గురించి నాగబాబు ఆసక్తికర అంశాలు తెలియజేశారు. సైరా నరసింహా రెడ్డి కథ ఎలా మొదలైందో వివరించారు. సురేందర్ రెడ్డి సైరా చిత్రం గురించి తనకు తెలియజేసిన విశేషాలని నాగబాబు ప్రేక్షకులకు తెలిపారు. సైరా చిత్రం మెగా పవర్ స్టార్ రాంచరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ చారిత్రాత్మక చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

బటుడి క్యారెక్టర్ వచ్చినా

బటుడి క్యారెక్టర్ వచ్చినా

అన్నయ్య నటిస్తున్న సైరా చిత్రంలో కనీసం బటుడి వేషం అయినా అడుగుతా అని నాగబాబు సరదాగా వ్యాఖ్యానించారు. సైరా నరసింహారెడ్డిలో అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోలు కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఊహకు కూడా అందదు

ఊహకు కూడా అందదు

సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. సురేందర్ రెడ్డి నాతో చెప్పిన అంశాల ప్రకారం ఈ చిత్రం మీ ఊహకు కూడా అందని విధంగా ఉండబోతోందని నాగబాబు అన్నారు. ఇప్పటికే ఖైదీ నెం 150 తో అయ్యన్నకు ఉండే ఆదరణ చెక్కు చెదరలేదని తేలింది. టాలీవుడ్ లో సైరా చిత్రం ఓ సంచలనం అవుతుందని నాగబాబు అన్నారు.

ఝాన్సీ రాణి చరిత్రలో సైరా

ఝాన్సీ రాణి చరిత్రలో సైరా

వీర నారి ఝాన్సీ లక్ష్మి భాయి చరిత్ర పుటల్లో సైరా నరసింహా రెడ్డి పేరు ఉందని నాగబాబు తెలిపారు. సిపాయిల తిరుగుబాటు కంటే ముందుగానే సైరా నరసింహారెడ్డి బ్రిటిష్ వారితో పోరాటం చేశారు. ఈ కథకు మరికొన్ని అద్భుతమైన అంశాలు జోడించి సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని నాగబాబు తెలిపారు. సైరా నరసింహా రెడ్డి గురించి తొలిసారి తెలుగు ప్రజలంతా ఈ చిత్రం ద్వారా తెలుసుకోబోతున్నారని తెలిపారు.

రాంచరణ్‌లో అల్లు అరవింద్ లక్షణాలు

రాంచరణ్‌లో అల్లు అరవింద్ లక్షణాలు

రాంచరణ్ పై హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. రాంచరణ్ నిర్మాతగా రాణించడంపై నాగబాబు స్పందించారు. చరణ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ అని తెలిపారు. రాంచరణ్ లో అన్నయ జీన్స్ తో పాటు మేనమామ అల్లు అరవింద్ వ్యాపార పరమైన తెలివితేటలు కూడా ఉన్నాయని నాగబాబు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X