ఆమె స్థాయిని కావాలనే తగ్గించాడా?.. రోజా పరువుతీసేసిన నాగబాబు!
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. పంచ్‌లు వేసే విధానం, సెటైర్లతో ప్రత్యర్థులకు నిద్ర పట్టకుండా చేస్తుంటారు. నాగబాబు చేసే పోస్ట్‌లు, వేసే కౌంటర్లు అన్నీ కూడా వివాదానికి దారి తీస్తుంటాయి. అలా నాగబాబు సోషల్ మీడియాలో వేసే పోస్టులపై అందరూ ఓ కన్ను వేసి ఉంచుతారు. అలాంటి నాగబాబు తాజాగా తన ఫాలోవర్లతో ముచ్చట్లుపెట్టేశాడు. ఈ క్రమంలో నెటిజన్ల రకరకాల ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.

ఆ మధ్య అలా..
నాగబాబు గత ఏడాది కాలం నుంచి సోషల్ మీడియాలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ వస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ వివాదం, కరెన్సీ నోట్లు, గాడ్సే, హిందూ దేవుళ్లు ఇలా ప్రతీ ఒక్క అంశంతో నాగబాబు వివాదాన్ని రేపాడు. ఇక జబర్దస్త్, బొమ్మ అదిరింది షోలతో నాగబాబు చేసిన రచ్చ అంతా ఇంత కాదు.

బుల్లితెరపైనా వివాదాలు..
ఇక నాగబాబు జబర్దస్త్ షోను వదిలి వచ్చిన సమయంలో అన్ని విషయాలను బయటపెట్టేశాడు. జబర్దస్త్ యాజమాన్యాన్ని ఏకిపారేశాడు. ఇక బొమ్మ అదిరింది షోతో ఏకంగా వైఎస్ జగన్‌పైనే సెటైర్లు వేస్తూ స్కిట్లు చేశారు. దీంతో షోకు మొదటికే మోసం వచ్చింది. ప్రస్తుతం అడ్రస్ లేకుండా షో గల్లంతైంది.

సోషల్ మీడియాలో అలా..
అయితే ప్రస్తుతం నాగబాబు మాత్రం సోషల్ మీడియా మీదే ఆధారపడి ఉంటున్నాడు. యూట్యూబ్‌లో కొత్త షోలను ప్రారంభించాడు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నాడు. స్టాండప్ కామెడీ అంటూ నాగబాబు చేస్తోన్న ఈ షో బాగానే క్లిక్ అవుతోంది.

తాజాగా ఇలా..
నాగబాబు తాజాగా తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టాడు. వారు అడిగిన ప్రశ్నలకు వెరైటీగా సమాధానం ఇచ్చాడు. అందులో ఓ భాగంగా ఓ నెటిజన్ జబర్దస్త్‌కు సంబంధించిన ప్రశ్న అడిగాడు. జబర్దస్త్‌లో మీకు ఇష్టమైన కమెడియన్ ఎవరు అని అడిగితే.. రోజా అంటూ నాగబాబు పంచ్ వేశాడు.

స్థాయిని తగ్గించేశాడా?
అయితే జబర్దస్త్‌లో రోజా జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. కానీ ఆమెను కమెడియన్ చేసేశాడు నాగబాబు. ఇలా కావాలనే ఆమె స్థాయిని తగ్గించాడో లేదా.. ఆర్టిస్ట్‌లకంటే ఎక్కువగా పంచ్‌లు వేస్తోందనే ఉద్దేశ్యంతో అలా చెప్పాడా? అన్నది నాగబాబుకే తెలియాలి. కానీ ప్రస్తుతం నాగబాబు సమాధానం మాత్రం అందరినీ ఆలోచనలో పడేసింది.


Click it and Unblock the Notifications











