అలాంటి వారికి ఉదాహరణగా నిలిచారు.. సునీత పెళ్లిపై నాగబాబు కామెంట్స్
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. సమాజంలో జరిగే మంచి చెడులపై తనదైన అభిప్రాయాన్ని చెబుతుంటాడు. ఎదుటి వాళ్లు ఏమనుకుంటారనేది పక్కన పెడితే నాగబాబు మాత్రం తన నిర్ణయాలను నిక్కచ్చిగా చెబుతుంటాడు. ప్రస్తుతం సోషల్ మీడయాలో సునీత పెళ్లి ఎంతగా హాట్ టాపిక్ అవుతోందో అందరికీ తెలిసిందే. సునీత రెండో పెళ్లిని స్వాగతించే వారెంత మంది ఉన్నారో ట్రోల్ చేసే వారు అంతే మంది ఉన్నారు.

సునీత రెండో పెళ్లి..
సునీత రెండో పెళ్లిపై ఎన్ని రకాల రూమర్లు వచ్చాయో అందరికీ తెలిసిందే. అయితే వాటన్నంటికి అడ్డుకట్టగా సోషల్ మీడియాలో సునీత చెక్ పెట్టేసింది. తనకు నిశ్చితార్థం జరిగినట్టుగా, ఇరు కుటుంబాలు, తన పిల్లల కోరిక మేరకు తాను పెళ్లి చేసుకుంటన్నట్టు సునీత తెలిపింది. అంతే కాకుండా దీన్ని పెళ్లి కాకుండా ఇరు కుటుంబాల కలయికగా చూడండని కోరింది.

ఘనంగా పెళ్లి..
ఇక జనవరి 9న హిందు సంప్రదాయం ప్రకారం శంషాబాద్ లోని సీతారాముల గుడిలో రామ్ ను వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు సునీత సన్నిహితులు మాత్రమే హాజరయ్యాడు. ఇండస్ట్రీ నుంచి అతి కొద్ది మంది మాత్రమే పాల్గొన్నారు. నితిన్, సుమ, రేణూ దేశాయ్, దిల్ రాజు వంటివారు హాజరయ్యారు.

ట్రోలింగ్ కూడా..
సునీత రెండో పెళ్లి చేసుకోవడంపై పాజిటివ్ కామెంట్లు ఎన్ని వచ్చాయో నెగెటివ్ కామెంట్లు అన్నే వచ్చాయి. ముద్దుల గోలేంటి.. ఆ ఫోటోలేంటి? అంటూ సునీత పెళ్లి ఫోటోలు, ఆనంద క్షణలను కూడా నెటిజన్లు ట్రోల్ చేశారు. అయితే తాజాగా నాగబాబు అందరికీ అదిరిపోయేలా సమాధానం ఇచ్చాడు.

మీరే ఉదాహరణ..
సంతోషం అనేది పుట్టుకతో ఉండదు. రాదు.. దాన్ని మనం వెతుక్కోవాలి.. రామ్, సునీతలు ఇద్దరూ కూడా తమ సంతోషాలను కనుక్కున్నందుకు కంగ్రాట్స్. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేసే వారికి, కొన్నింటిని ఎంచుకునేందుకు సిగ్గుపడేవారికి ఉదహరణగా మీ జంట నిలిచింది .. ప్రేమ, సంతోషం అనేది ఎప్పటికీ మీ పర్మనెంట్ అడ్రెస్‌గా మారాలని కోరుకుంటున్నాను అని నాగబాబు చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











