రాంచరణ్‌కు ఉన్న అవకాశం వరుణ్ తేజ్‌కు లేదు.. వాడితో పోల్చుకుంటే నేను ఎలుక!

మెగా బ్రదర్ నాగబాబు తాజాగా చేసిన ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో నాగబాబు పలు సంచలన వ్యాఖ్యలతో పాటు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా దూసుకుపోతున్నాడు. వరుణ్ తేజ్ చిత్రాల గురించి, సంపాదన గురించి నాగబాబు ప్రస్తావించారు. నిహారిక కూడా హీరోయిన్ గా సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. తాను ఇలా టీవీ రంగంపై దృష్టిపెట్టానని నాగబాబు తెలిపారు. వరుణ్ తేజ్ తొలి సినిమా అవకాశం, ఆ తరువాత హీరోగా నిలదొక్కుకోవడం గురించి నాగబాబు చెప్పిన విశేషాలు ఇలా ఉన్నాయి.

రాంచరణ్‌లాగా కుదరదు

రాంచరణ్‌లాగా కుదరదు

రాంచరణ్ తరహాలో తొలి చిత్రానికి వరుణ్ తేజ్ కు అవకాశం రావాలంటే కష్టం. చరణ్ అన్నయ్య కొడుకు కాబట్టి సినిమా చేయడానికి చాలా మంది ముందుకు వస్తారు. కానీ వరుణ్ తేజ్ చిరంజీవి తమ్ముడి కొడుకు మాత్రమే. వరుణ్ తేజ్ తొలి చిత్రం కోసం చాలా చర్చలు జరిగాయి కానీ ఏదీ కుదరలేదని నాగబాబు అన్నారు. మొదట్లో పెద్ద బ్యానర్స్ లోనే వరుణ్ ని లాంచ్ చేయడానికి ప్రయత్నించాం అని నాగబాబు తెలిపారు.

అశ్వినీ దత్ అనుకున్నాం

అశ్వినీ దత్ అనుకున్నాం

వరుణ్ తేజ్ ని లాంచ్ చేస్తానని అశ్విని దత్ ని అనుకున్నాము. కానీ అది కుదర్లేదు. తొలి చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించాల్సింది అది కూడా కుదర్లేదు. దీనితో వరుణ్ తేజ్ తొలి చిత్రం ఆలస్యమవుతూనే వచ్చింది. ఆ సమయంలో శ్రీకాంత్ అడ్డాల ముందుకు వచ్చాడని నాగబాబు అన్నారు. అలా ముకుంద చిత్రంతో వరుణ్ తేజ్ ని హీరోగా పరిచయం చేశాం అని తెలిపారు. వరుణ్ తేజ్ ని లాంచ్ చేసినందుకు నిర్మాతలు ఠాగూర్ మధు, నల్లమలపు బుజ్జికి కృతజ్ఞతలు తెలపాలి అని నాగబాబు అన్నారు.

ఇన్వాల్వ్ కానివ్వడు

ఇన్వాల్వ్ కానివ్వడు

వరుణ్ సినిమాల్లో మీరు ఎంత వరకు ఇన్వాల్వ్ అవుతున్నారనే ప్రశ్నకు నాగబాబు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. వాడి చిత్రాల విషయంలో నేను అస్సలు ఇన్వాల్వ్ కాను. ఇంకా చెప్పాలంటే ఇన్వాల్వ్ కానివ్వడు. కథల ఎంపికలో జడ్జిమెంట్ వాడిదే. కానీ కథ విషయంలో నా అభిప్రాయం మాత్రం అడుగుతాడు. ఓ పదిమందిలో నేను ఒకడిగా నా సలహా ఇస్తా అని నాగబాబు తెలిపారు. ఇప్పటికి ట్రెండుకు తగ్గట్లుగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నా కన్నా వాడికే బాగా తెలుస్తుంది అని అన్నారు.

వాడిది ఏనుగులాంటి సంపాదన

వాడిది ఏనుగులాంటి సంపాదన

వరుణ్ తేజ్ ఇప్పుడు బాగానే కోట్లల్లో సంపాదిస్తున్నాడు. నాది ఎలుక పిల్ల లాంటి సంపాదన.. వాడిది ఏనుగులాంటి సంపాదన అంటూ నాగబాబు సరదాగా వ్యాఖ్యానించారు. వాడు ఎంత సంపాదించిన ఇంటి ఖర్చులు మొత్తం నేనే చూసుకుంటాను. ఇప్పటికీ వాడు పాకెట్ మనీ నా చేతుల మీదుగానే తీసుకుంటాడు అని నాగబాబు తెలిపారు. చిన్న పిల్లాడు.. వాడితో అంత డబ్బు ఖర్చు పెట్టిస్తారు ఏంటి అని నా భార్య అడుగుతూ ఉంటుంది అని నాగబాబు అన్నారు.

 నిహారిక కంటే

నిహారిక కంటే

నిహారిక గురించి మాట్లాడుతూ ప్రస్తుతానికి నిహారిక కన్నా నా సంపాదనే ఎక్కువని నాగబాబు చమత్కరించారు. నిహారిక హీరోయిన్ గా రాణించేందుకు ప్రయత్నిస్తోంది. నిహారిక యాంకర్ గా రాణించింది. ఆ తరువాత వెబ్ సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకుంది అని నాగబాబు అన్నారు. ప్రస్తుతం కొన్ని చిత్రాలలో నటిస్తోందని నాగబాబు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X