అల్లు అర్మీ ట్రోల్స్‌కు తలవంచిన నాగబాబు.. ట్వీట్ డిలీట్ చేసి.. ట్విట్టర్‌లోకి..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై పరోక్షంగా నాగబాబు కొణిదెల చేసిన ట్వీట్ అత్యంత వివాదాస్పదంగా మారింది. ఆయనపై అల్లు ఆర్మీ విపరీతంగా, దారుణంగా ట్వీట్ చేయడంతో ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆయన డీ యాక్టివేట్ అయ్యారు. అయితే అందుకు కారణం అల్లు, మెగా కుటుంబంలో జరిగిన చర్చలు, వాగ్వాదం, అభిప్రాయాలే కారణమనే టాక్ వినిపించింది. అయితే నాగబాబు ఎక్స్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకోవడం చర్చే జరిగింది.
నంద్యాలకు వెళ్లి వైసీపీ నేత శిల్పా రవిరెడ్డిని అల్లు అర్జున్ కలిసి మద్దతు తెలియజేయడంపై నాగబాబు భగ్గుమన్నాడు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని నాగబాబు పంచ్ వేశాడు.

సొంత మేనమామ జనసేన పార్టీ పెట్టి తమ నేతల కోసం, అలాగే పిఠాపురంలో కష్టపడుతుంటే .. పవన్ ప్రత్యర్ధి పార్టీకి చెందిన వ్యక్తి కోసం అల్లు అర్జున్ వెళ్లడాన్ని నాగబాబు జీర్ణించుకోలేకపోయారు. అయితే అప్పటికప్పుడు తొందరపడితే అది ఫ్యాన్స్ మధ్య చీలిక తెచ్చి.. ఎన్నికలపై ప్రభావం పడుతుందనే కొంత తగ్గారని , అందుకే పోలింగ్ ముగిసిన ట్వీట్ వేశారు అని నేతలు తెలిపారు.
నాగబాబు ట్వీట్ సృష్టించిన టీ కప్పులో తుఫాన్‌ను చల్లార్చేందుకు ఇరు కుటుంబాలు ప్రయత్నించారు. అనంతరం నాగబాబుకు, అల్లు అర్జున్‌కు నచ్చజెప్పి.. కుటంబంలో ఇలాంటి విభేదాలు రాకుండా చూసుకోవాలని చిరంజీవి, ఇతరులు హితబోధ ఇద్దరికి చేశారనే విషయం ప్రచారం జరుగుతున్నది.
దాంతో ట్వీట్‌ను డిలీట్ చేసి నాగబాబు తాజాగా తన X అకౌంట్‌ను పునరుద్దరించారు. అయితే గతంలో చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశానని ఓ మెసేజ్ పెట్టారు. దాంతో రెండు కుటుంబాల మధ్య ఏదో సయోధ్య జరిగిందనే టాక్ ప్రచారంలో ఉంది. అయితే పవన్ కల్యాణ్‌ను శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దూషించడాన్ని తట్టుకోలేక ట్వీట్ చేశాననే అభిప్రాయాన్ని కుటుంబ సభ్యులతో వ్యక్తం చేసినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











