RRR: నీ** మొగుడు పెట్టాడా? నిర్మాతపై నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు.. ఆధారాలు చూపాలని దర్శకేంద్రుడు ట్వీట్
'బాహుబలి'తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. దీని తర్వాత ఆయన గత ఏడాది RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో వచ్చారు. టాలీవుడ్‌లోని ఇద్దరు స్టార్లు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు ఆస్కార్ రేసులో నిలిచి సత్తా చాటింది. ఇలాంటి చిత్రంపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవలే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు నాగబాబు, రాఘవేంద్రరావు కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలు మీకోసం!

ఆస్కార్ బరిలో నిలిచిన RRR
ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా.. వరల్డ్ వైడ్‌గా అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అలాగే వరల్డ్ వైడ్‌గా ప్రభావాన్ని చూపించి ఇప్పటికే ఎన్నో కేటగిరీల్లో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ చాయిస్ సహా ప్రతిష్టాత్మక అవార్డులనూ దక్కించుకుంది. అంతేకాదు, ఆస్కార్‌కు సైతం నామినేట్ అయింది.

తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
RRR మూవీ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు గర్వపడుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ దీనిపై స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చిత్ర బృందం ఫ్లైట్ టికెట్ల కోసం పెట్టిన ఖర్చుతో ఏకంగా 8 సినిమాలు తీయొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.

10 సినిమాలు తీయొచ్చంటూ
ఈ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. 'ఆర్ఆర్ఆర్ సినిమా కోసం చిత్ర యూనిట్ మొత్తంగా రూ. 600 కోట్ల బడ్జెట్ పెట్టింది. మళ్లీ ఆస్కార్ అవార్డుల ప్రచారం కోసం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారు. అదే 80 కోట్లతో మామూలుగా 8 నుంచి 10 సినిమాలు చేయొచ్చు. వాళ్లు ఊరికే ఫ్లైట్ టికెట్లకే 80 కోట్ల దాకా ఖర్చులు పెడుతున్నారు' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

తమ్మారెడ్డిపై తీవ్ర విమర్శలు
RRR మూవీపై తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్లు తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. దీంతో ఆయన వ్యాఖ్యలను చాలా మంది సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఖండిస్తున్నారు. అలాగే, సినీ ప్రియులు సైతం ఈ సీనియర్ ఫిల్మ్ మేకర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో తమ్మారెడ్డి భరద్వాజ అంశం ఇప్పుడు సినీ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.
వైసీపీ భాష అంటూ నాగబాబు
సీనియర్ ఫిల్మ్ మేకర్ తమ్మారెడ్డి భరద్వాజ RRR మూవీపై చేసిన వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఆయన ట్విట్టర్‌లో 'ఇది ఎవరైతే అన్నారో వాళ్లకు మాత్రమే.. RRRకు ఆస్కార్ కోసం నీయమ్మా మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు? (RRR మీద కామెంటుకు వైసీపీ వారి భాషలో సమాధానం)' అంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు.

రాఘవేంద్రరావు కూడా ట్వీట్
తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యాలు దూమారాన్ని రేపడంతో ఇదే అంశంపై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు కూడా స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'మిత్రుడు భరద్వాజకు.. తెలుగు సినిమాకూ, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరును చూసి గర్వపడాలి' అని సూచించారు.
ఆధారాలు ఉన్నాయా అంటూ
అదే ట్వీట్‌లో రాఘవేంద్రరావు 'RRR మూవీ ప్రచారానికి రూ. 80 కోట్లు ఖర్చు చేశారంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? జేమ్స్ కామెరాన్, స్పిల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పదనాన్ని పొగుడుతున్నారని మీ ఉద్దేశమా' అంటూ తమ్మారెడ్డిని సూటిగా ప్రశ్నించారు. దీంతో ఈ అంశం మరింత పెద్ద వివాదంగా మారిపోతోంది.


Click it and Unblock the Notifications











