ఇంగిత జ్ఞానం కూడా లేని దర్శకుడంటూ నాగబాబు ఫైరింగ్
"నిర్మాత అనేవాడు లేకపోతే చిత్ర పరిశ్రమ సర్వ నాశనమైపోతుంది. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఉండేదట అని చరిత్రలో మనం చదువుకోవాల్సిన దుస్థితి వస్తుంది. నిర్మాత డబ్బు పెడుతుంటే...ఎన్నిరోజుల్లో సినిమా తియ్యాలి? అనే ఇంగిత జ్ఞానం కూడా లేని దర్శకులున్నారు అంటూ మండిపడుతున్నారు నాగబాబు. ఆయన తాజా చిత్రం ఆరెంజ్ విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అందులోనూ బడ్జెట్ అనుకున్న దానికన్నా ఐదారు రెట్లు పెరిగిపోవటం ఆయన కోపానికి కారణమైంది. దాంతో ఆయన రీసెంట్ గా రవితేజ తాజా చిత్రం 'మిరపకాయ్' ఆడియో పంక్షన్ కి హాజరై ఇలా తన మనస్సులోని ఆవేదనను బయిటపెట్టారు. అలాగే దర్శకులు శరీరంలోకి చేరే వైరస్ లా తయారయ్యారు. కొన్నాళ్లకు శరీరాన్ని తినేస్తుంది. దయచేసి నిర్మాతను బతకనియ్యండి. ఎంతో మంది నిర్మాతలు పరిశ్రమ నుంచి వెళ్లిపోతున్నారు. మన తెలుగు ఖ్యాతిని పెంచిన రామ్ గోపాల్ వర్మను ఆదర్శంగా తీసుకొని పనిచెయ్యండని 'మిరపకాయ్' వేడుకలో ఆవేశంగా మాట్లాడారు నాగబాబు. ఈ కార్యక్రమంలో డి.రామానాయుడు, సి.కల్యాణ్, సునీల్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











