చెర్రీ తరుపున క్షమాపణ, దాసరిని పట్టించుకోం : నాగబాబు
హైదరాబాద్ : మొన్న 'నాయక్' సినిమా ఆడియో ఫంక్షన్ దగ్గర నుండి....నిన్న 'బాషాతో నేను' పుస్తకావిష్కరణ వరకు మెగాస్టార్ చిరంజీవి అండ్ ఫ్యామిలీ గురించి మీడియాలో రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. 'నాయక్' ఆడియో వేడుకలో రామ్ చరణ్ మాట్లాడుతూ...ఓ న్యూస్ పేపర్, దాని న్యూస్ ఛానల్ పై దుమ్మెత్తి పోసారు. సదరు ఛానల్, పత్రిక నా వెంట్రుకతో సమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సదరు ఛానల్ నాకు, బాబాయ్ పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగినట్లు దుష్పచారం, మా కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు ట్రై చేస్తోందని నిప్పులు కక్కారు. ఒక రకంగా మా ఫ్యామిలీని ఎవరు టార్గెట్ చేసినా....ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాడు.
ఇక 'బాషాతో నేను' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దర్శక రత్న దాసరి నారాయణరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దాసరి వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించినవే అంటూ కొన్నీ టీవీ న్యూస్ ఛానల్స్ హోరెత్తించాయి. కొన్ని ఛానల్స్ లో దాసరి వ్యాఖ్యలపై చర్చాకార్యక్రమాలు కూడా నిర్వహించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో చిరంజీవి సోదరుడు నాగబాబు స్పందించారు. 'రామ్ చరణ్ చిన్న పిల్లాడు, అతని మాటలను కాకుండా ఆవేదనను అర్థం చేసుకోండి, రామ్ చరణ్ తరుపున మీడియాకు నేను క్షమాపణ చెబుతున్నాను' వివరణ ఇచ్చారు. అదే విధంగా దాసరి వ్యాఖ్యలపై మీడియాలో రేగుతున్న దుమారంపై కూడా పెదవి విప్పారు. దాసరి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు.


Click it and Unblock the Notifications











