రామ్ చరణ్ హీరోయిన్ ను తన బ్యానర్ లో బ్యాన్ చేసిన మెగా నిర్మాత...
'ఆరెంజ్" చిత్రం బాక్సాఫీజు వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ సమయంలో జెనీలియా వాళ్ల అమ్మకు, నాగబాబుకు మధ్య చిన్నపాటి వివాదం చెలరేగినట్లు సమాచారం. ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుగుతున్న తరుణంలో దర్శకుడు డేట్స్ పొడిగించాడు. ఆడేట్స్ కు 10 లక్షల పారితోషికాన్ని ఇవ్వమని జెనీలియా తల్లి గొడవచేసిందట. ఇవ్వకపోతే ముంబై వెళ్ళిపోతానని బెదిరించిందని తెలిసింది. రామ్ చరణ్ జెనీలియా అమ్మను సముదాయించినట్లు సమాచారం. ఈ సంఘటనతో ఇకపై తమ బేనర్ లో జెనీలియాను పెట్టేది లేదని నాగబాబు తేల్చి చెప్పాడట. ఇటీవలే వారి బేనర్ లో ఓ చిత్రం చర్చల్లో హీరోయిన్ గా జెనిలియా పేరు దర్శకుడు ప్రస్తావిస్తే...వేరే పేరు సూచించమని చెప్పాడాని సమాచారం.
జెనీలియా రామ్ చరణ్ తేజ్ నాగబాబు ఆరెంజ్ బొమ్మరిల్లు భాస్కర్ genelia ram charan teja nagababu orange bommarillu bhaskar


Click it and Unblock the Notifications