twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆరో తరగతిలోనే చనిపోయేవాడిని.. అన్నయ్య అలా కాపాడాడు.. నాగబాబు ఎమోషనల్ కామెంట్స్

    |

    మెగా బ్రదర్ నాగబాబుకి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ఇష్టమో ఆయన మాటలు వింటే అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి చిరంజీవి ఆరాధించేవాడినని ఎన్నోసార్లు చెప్పుకొచ్చిన సందర్భాలున్నాయి. చిన్నతనంలోనూ తన అన్నయ్య చుట్టు నిత్యం ఓ పది మంది ఉండేవారని, అందర్నీ ఆకర్షించేవాడని, ఆయనలో ఏదో ఓ శక్తి ఉందని నాగబాబు చెబుతూ ఉంటాడు. నిన్న (ఆగస్ట్ 22) చిరంజీవి బర్త్ డే సందర్భంగా నాగబాబు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.

    ఎంతో బాధ్యతతో..

    ఎంతో బాధ్యతతో..

    మా అన్నయ్య చిన్నప్పటి నుంచి ఎంతో బాధ్యత, ఎంతో డెడికేషన్‌గా ఉండేవాడు. ఆరేడేళ్లు వయసులోనే అమ్మ సరుకులు చీటి మీద రాసిస్తే ఎంతో జాగ్రత్తగా తెచ్చేవాడు. అమ్మ చెప్పిన ప్రతీమాటను పాటించేవాడు. ఇంట్లో నేను తప్పా ప్రతీ ఒక్కరూ బాధ్యతతో మెలిగేవారు. నేను చిన్నప్పటి నుంచి బాధ్యతారాహితంగా, రెబల్‌గా పెరిగాను అని నాగబాబు చెప్పుకొచ్చాడు.

    చుట్టూ పది మంది..

    చుట్టూ పది మంది..

    మా అన్నయ్య చుట్టూ ఎప్పుడూ ఓ పదిమంది ఉండేవారు. అన్నయ్య చుట్టూ ఏదో ఒక ఆరా ఉండేది. ఎందుకు అన్నయ్య చుట్టే ఉంటారు.. నాతో ఎందుకు ఉండరు అలా అని అనుకునేవాడిని. స్కూల్, కాలేజ్ ఎక్కడికి వెళ్లినా సరే అన్నయ్య అందర్నీ ఆకర్షించేవాడు. ఎంతో మంది అమ్మాయిలు కూడా అన్నయ్య వైపు అలా చూస్తూనే ఉండేవారు. ఎందుకిలా చూస్తున్నారో నాకు ఆ వయసులో అర్థమయ్యేది కాదు. అందుకు నాకు చిన్నప్పటి నుంచి మా అన్నయ్య ఓ హీరో అనే ఫీలింగ్ ఉండేదని నాగబాబు పేర్కొన్నాడు.

    నన్ను అలా అనేవారు..

    నన్ను అలా అనేవారు..

    మా అన్నయ్యకు నాకు ఓ నాలుగైదు సంవత్సరాలు తేడా. చిన్నప్పుడు మా అన్నయ్య స్నేహితులతో బయటకు వెళ్తుంటే నేను కూడా వస్తా అని మారాం చేసేవాడిని. నువ్ చిన్నవాడికి ఎక్కడికి వస్తావ్ లోపలికి పో అనే అనేవాడు. అయితే ఓ సారి మాత్రం బాగా అల్లరి చేశాను అని నాగబాబు తెలిపాడు.

    జాగ్రత్తగా చూసుకో..

    జాగ్రత్తగా చూసుకో..

    అది ఆరోతరగతిలో ఉన్నప్పుడు అనకుంటా.. చిన్నగా వర్షం కూడా పడుతోంది. మా అన్నయ్య, ఆయన స్నేహితులు కాలువలో ఈత కొట్టేందుకు వెళ్తున్నారు. నేను కూడా వస్తాను అని మారాం చేయడంతో అమ్మ చెప్పిందని నన్ను తీసుకెళ్లాడు. తమ్ముడు జాగ్రత్త అంటూ అమ్మ అన్నయ్యకు చెప్పింది అని నాగబాబు పేర్కొన్నాడు.

    Recommended Video

    Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
    కాలువలో మునిగి..

    కాలువలో మునిగి..

    అయితే ఆ కాలువలో మా అన్నయ్య తన స్నేహితులతో ఓ వైపు ఆడుకుంటూ ఉన్నాడు.. నేను మరోవైపు ఆడుకుంటూ ఉండగానే మునిగిపోయాను. రెండుసార్లు మునిగి పైకి తేలుతున్నాను. నీళ్లు నోటి లోపలికి వెళ్తున్నాయి. అయితే మూడోసారి మునిగే లోపే అన్నయ్య వచ్చి కాపాడాడు. ఆరోజు అన్నయ్య కూడా చాలా భయపడి కంగారుపడ్డాడు అని నాగబాబు నాటి సంగతులను వివరించాడు.

    English summary
    Nagababu Childhood memory with Chiranjeevi. HBD Megastar Chiranjeevi Nagababu Emotional Tweet. If God is a man who walked Earth in Blood & Flesh that would be you.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X