For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆస్తుల గురించి నాగబాబు షాకింగ్ కామెంట్స్: అంబానీ కంటే అంతే తక్కువ.. నీకే సగం ఇచ్చేవాడినంటూ పోస్ట్

  |

  దాదాపు మూడు దశాబ్ధాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్కును చూపిస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు. హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా సినీ రంగానికి ఎన్నో సేవలు అందించిన ఆయన.. బుల్లితెరపైనా సత్తా చాటారు. ఎన్నో సీరియళ్లలో హీరోగా నటించడంతో పాటు పలు షోలకు జడ్జ్‌గానూ వ్యవహరించారు. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆయన.. ఏదో ఒక పని చేసి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి సమయంలోనే తాజాగా నాగబాబు తన ఆస్తుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  అలా మొదలైన ప్రయాణం.. ఎన్టీఆర్ సినిమా

  అలా మొదలైన ప్రయాణం.. ఎన్టీఆర్ సినిమా

  చిరంజీవి హీరోగా నటించిన ‘రాక్షసుడు' అనే సినిమాతో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు. అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను చేశారు. అలాగే, హీరోగానూ కనిపించారు. ఈ క్రమంలోనే నిర్మాతగా మారారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత' వరకు ఆయన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే వస్తున్నారు.

  సీరియల్ హీరోగా ఎంటర్... ఆ షోల్లో అడుగు

  సీరియల్ హీరోగా ఎంటర్... ఆ షోల్లో అడుగు


  సుదీర్ఘ కాలం పాటు సినీ రంగంలో తనదైన మార్కుతో దూసుకుపోయిన నాగబాబు.. ‘అపరంజీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి కూడా హీరోగా ఎంటర్ అయ్యారు. దాని తర్వాత ‘శిఖరం', ‘సీతామహాలక్ష్మీ' సహా కొన్ని సీరియళ్లలో నటించారు. ఈ క్రమంలోనే ‘వీర' అనే షో ద్వారా జడ్జ్‌గా మారి ‘అదుర్స్' రెండు సీజన్లను పూర్తి చేశారు. దీని తర్వాత ‘జబర్ధస్త్' షోను మొదలు పెట్టారు.

  జబర్ధస్త్‌కు గుడ్‌బై.. అది ఆగింది.. ఇప్పుడిది

  జబర్ధస్త్‌కు గుడ్‌బై.. అది ఆగింది.. ఇప్పుడిది


  చాలా కాలం పాటు జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరించారు నాగబాబు. అప్పటి నుంచి దీన్ని నెంబర్ వన్ స్థానంలో నడిపించారు. ఇలాంటి సమయంలో దానికి అర్థాంతరంగా గుడ్‌బై చెప్పేశారు. అదే సమయంలో మరో ఛానెల్‌లో ‘అదిరింది', ‘బొమ్మ అదిరింది' అనే షోలు చేశారు. ఇవి కూడా ఉన్నట్లుండి ఆపేశారు. ఇక, స్వయంగా ‘ఖుషి ఖుషీగా' అనే షోను మొదలెట్టి.. ఇటీవలే పూర్తి చేశారు.

  ఎప్పుడూ అందులోనే బిజీగా.. సెషన్లు చేస్తూ

  ఎప్పుడూ అందులోనే బిజీగా.. సెషన్లు చేస్తూ

  సోషల్ మీడియాలో మెగా బ్రదర్ నాగబాబు ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఇందులో భాగంగానే తన ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను కూడా ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. అదే సమయంలో సమాజంలో ఎన్నో విషయాలపై స్పందిస్తుంటారు. ఇక, ఈ మధ్య కాలంలో తరచూ ఫ్యాన్స్‌తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లు నిర్వహిస్తున్నారు.

  ఆస్తుల గురించి నాగబాబు షాకింగ్ కామెంట్స్

  ఆస్తుల గురించి నాగబాబు షాకింగ్ కామెంట్స్

  తాజాగా నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెప్పారు. ఇందులో భాగంగానే ఓ ఔత్సాహికుడైన నెటిజన్.. ‘ఎంత ఆస్తి ఉంది నీకు' అంటూ ప్రశ్నించాడు. ఇది చూసిన మెగా బ్రదర్ నాగబాబు మండిపోయినట్లుంది. వెంటనే అతడిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

  గౌరవంగా అడిగుంటే చెప్పేవాడిని అని పోస్టు

  గౌరవంగా అడిగుంటే చెప్పేవాడిని అని పోస్టు


  ఆస్తి గురించి అడిగిన నెటిజన్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు నాగబాబు. ‘నన్ను నువ్వు అని సంభోదించావు. అంటే నీకు రెస్పెక్ట్ తగ్గిపోయింది. సో నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పను. మీకు ఎంత ఉంది అని అడిగి ఉంటే.. ఎంత ఆస్తి ఉందో చెప్పడంతో పాటు అందులో నుంచి సగం నీకు ఇచ్చేవాడిని. బ్యాడ్ లక్' అంటూ చురకలు అందిస్తూనే సరైన సమాధానం చెప్పారాయన.

  Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
  అంబానీ కంటే అంతే తక్కువ అంటూ క్లారిటీ

  అంబానీ కంటే అంతే తక్కువ అంటూ క్లారిటీ

  ఇదే సెషన్‌లో మరో నెటిజన్.. ‘సార్ మీరు ఉండే ఇల్లు ఖరీదు రూ. 50 కోట్లు ఉంటుందా' అని ప్రశ్నించాడు. దీనికి నాగబాబు ‘ముకేష్ అంబానీ ఇంటి కంటే పది రూపాయలు తక్కువ అంతే. మిగిలినదంతా సేమ్ టూ సేమ్ ఉంటుంది' అని వ్యంగ్యంగా జవాబు ఇచ్చారు. ఈ సెషన్‌లో నాగబాబు చెప్పిన ఆన్సర్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  English summary
  Nikarika Konidela' latest post on Instagram has become the hot topic of discussion on the social media. Her marriage has been in discussion for quite some time. Recently she took to her twitter to share a pic with the text “Ms/Mrs Niharika” on a coffee cup.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X