‘ఆరెంజ్’ మూవీ నష్టాలపై తొలిసారి నాగబాబు కామెంట్స్: ఆ అప్పులు ఆయనే తీర్చాడు.. చరణ్‌ విషయంలో అలా!

యాక్టర్‌గా కెరీర్‌ను ఆరంభించి దాదాపు మూడు దశాబ్ధాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు మెగా బ్రదర్ నాగబాబు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆయన.. సినీ రంగానికి పలు రకాలుగా సేవలు అందించారు. ఇందులో భాగంగానే నిర్మాతగానూ మారి పలు చిత్రాలను తీశారు. అందులో రామ్ చరణ్ నటించిన 'ఆరెంజ్' మూవీ ఒకటి. దీని వల్ల నాగబాబుకు ఎంతో నష్టం వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ సినిమా నష్టాలపై తొలిసారి నాగబాబు కామెంట్స్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

చిరు సినిమా నుంచి మొదలైన ప్రస్థానం

చిరు సినిమా నుంచి మొదలైన ప్రస్థానం

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'రాక్షసుడు' సినిమాలో నటుడిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు నాగబాబు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. ఈ క్రమంలోనే 'కౌరవుడు' అనే సినిమాతో హీరోగా మారారు. అలా పలు చిత్రాల్లో నటించారు. అయినప్పటికీ సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే వచ్చారు. కొన్నేళ్ల క్రితం బుల్లితెరపైకి సైతం అడుగు పెట్టి సత్తా చాటారు మెగా బ్రదర్.

అలా నిర్మాతగానూ మారిన మెగా బ్రదర్

అలా నిర్మాతగానూ మారిన మెగా బ్రదర్

చాలా కాలంగా సినీ పరిశ్రమలో తన మార్క్ చూపిస్తోన్న నాగబాబు.. ఆ తర్వాత అంజనా ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌ను స్థాపించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'రుద్రవీణ'తో నిర్మాతగా మారారు. అప్పటి నుంచి 'త్రినేత్రుడు', 'ముగ్గురు మొనగాళ్లు', 'కౌరవుడు', 'బావగారూ బాగున్నారా', 'గుడుంబా శంకర్', 'స్టాలిన్', 'ఆరెంజ్', 'నా పేరు సూర్య' వంటి చిత్రాలను నిర్మించారు.

అలా సూపర్ సక్సెస్.. ఇలా ఫెయిల్యూర్

అలా సూపర్ సక్సెస్.. ఇలా ఫెయిల్యూర్

నటుడిగా ఎంతో సక్సెస్ అయ్యారు నాగబాబు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో అత్యుత్తమ నటనతో ఆకట్టుకున్నారు. అయితే, నిర్మాతగా మాత్రం ఆయన ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఆయన బ్యానర్‌లో దాదాపు తొమ్మిది చిత్రాలను నిర్మించగా.. అందులో ఒకటి రెండు మినహా మిగిలినవి అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అయితే, 'రుద్రవీణ'కు మాత్రం జాతీయ అవార్డును అందుకున్నారు.

భారీ నష్టాలను మిగిల్చిన ‘ఆరెంజ్' మూవీ

భారీ నష్టాలను మిగిల్చిన ‘ఆరెంజ్' మూవీ

'మగధీర' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం 'ఆరెంజ్'. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాను నాగబాబు నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. మంచి పాయింట్‌తోనే వచ్చినా అప్పట్లో ఇది ప్రేక్షకులకు ఎక్కలేదు. దీంతో ఈ సినిమా వల్ల నాగబాబుకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి. దీంతో అప్పుల పాలయ్యారు.

 ‘ఆరెంజ్' నష్టాలపై నాగబాబు కామెంట్స్

‘ఆరెంజ్' నష్టాలపై నాగబాబు కామెంట్స్


'ఆరెంజ్' మూవీకి నాగబాబు పెట్టిన పెట్టుబడి చాలా ఎక్కువ. భారీగా తీసిన ఈ సినిమా వల్ల ఆయనకు అప్పులు అవడంతో చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండిపోయారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనమే అయింది. ఇలాంటి పరిస్థితుల్లో 'ఆరెంజ్' మూవీ వల్ల వచ్చిన నష్టాలపై నాగబాబు తొలిసారి కామెంట్స్ చేశారు. ఒక్క స్టేట్‌మెంట్‌తో అన్ని రకాలుగా క్లారిటీ ఇచ్చేశారాయన.

మూవీ అప్పులు ఆయనే తీర్చాడంటూ

మూవీ అప్పులు ఆయనే తీర్చాడంటూ

సోషల్ మీడియాలో నాగబాబు ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ 'సార్ సీరియస్‌గా ఒక విషయం తెలుసుకోవాలి. ఆరెంజ్ తర్వాత రామ్ చరణ్..' అని పోస్ట్ చేశాడు. దీనికి 'లేదు.. మా అన్నయ్య నా అప్పులో సగం తీర్చాడు' అని బదులిచ్చాడు నాగబాబు.

చరణ్‌ విషయంలో అలా జరిగిపోయిందట

చరణ్‌ విషయంలో అలా జరిగిపోయిందట

దీనిని కొనసాగిస్తూ.. ఈ సినిమాకు గానూ రామ్ చరణ్‌కు రెమ్యూనరేష్ ఇచ్చారా.. లేదా.. అన్న విషయంపైనా స్పందించారు. 'ఆరెంజ్ సినిమాకు చరణ్‌కు రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. కానీ, భవిష్యత్‌లో ఎప్పటికైనా అతడికి చెల్లిస్తా' అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి చాలా కాలంగా చాలా మంది ఎదురు చూస్తున్న 'ఆరెంజ్' ప్రశ్నలకు ఇప్పుడు ఇలా సమాధానం చెప్పారు నాగబాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X