పవన్ కల్యాణ్ సీక్రెట్ రివీల్ చేసిన నాగబాబు.. వీడియో రిలీజ్

Recommended Video

Thanks to Janasaniks for Voluntary Donations - Naga Babu Birthday Wishes To Power Star Pawan Kalyan

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌కు ఉన్న అభిమానులు మరే హీరోకూ లేరని అంటుంటారు. నిజమే పవన్ కల్యాణ్ అంటే ఏదో తెలియని శక్తి అభిమానుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక, తాజాగా ఆయన పుట్టినరోజు జరిగింది. కానీ, ఆ వేడుకలకు పవన్ దూరంగా ఉన్నాడు. దీనికి కారణం ఏంటో నాగబాబు వెల్లడించాడు.

పవన్ నామస్మరణతో దద్దరిల్లిపోయింది

పవన్ నామస్మరణతో దద్దరిల్లిపోయింది

సోమవారం పవన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం ఆయన పేరుతో మారుమ్రోగిపోయింది. ఫ్యాన్స్‌తో పాటు ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు పవర్ స్టార్‌కు విషెస్ చెప్పారు. ముఖ్యంగా పవన్‌తో అనుబంధం ఉన్న చాలా మంది ప్రముఖులు తమ ప్రేమను చాటుకున్నారు. దీంతో పవన్ నామస్మరణతో సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది

ట్రెండ్ అయిన పవన్

ట్రెండ్ అయిన పవన్

ఒకవైపు ఫ్యాన్స్, మరోవైపు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుండడంతో ఆయన మరోసారి ట్రెండ్ అయ్యారు. ఆయన పేరుతో రూపొందించిన #HappyBirthdayPawanaKalyan ట్యాగ్ ఇండియాలో మొదటి స్థానంలో ట్రెండ్ అయింది. ఆ తర్వాత #happybirthdaypowerstar మూడో స్థానంలో, #HappyBirthdayJanasenani నాలుగో స్థానంలో కొనసాగాయి.

బర్త్‌డే వేడుకలకు దూరం

ఒక పక్క ఫ్యాన్స్.. మరోపక్క ప్రముఖులు పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. చాలా మంది అభిమానులు చిరంజీవి బర్త్‌డే చేసినట్లు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు కూడా చేశారట. వాటికి పవన్ ఒప్పుకోలేదని తెలిసింది. దీంతో వాళ్లే స్వయంగా సంబరాలు చేసుకున్నారు. జనసేన కార్యాలయంలోనైనా కేక్ కట్ చేపిద్దామనుకున్నారట కొందరు నాయకులు. అయితే, పవర్ స్టార్ మాత్రం ఈ వేడుకలకు దూరంగానే ఉండిపోయారు.

క్లారిటీ ఇచ్చిన నాగబాబు

క్లారిటీ ఇచ్చిన నాగబాబు

పవన్ కల్యాణ్ తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండడంపై ఆయన సోదరుడు నాగబాబు స్పందించారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ‘కల్యాణ్ బాబుకు మొదటి నుంచి పుట్టినరోజులు జరుపుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఎప్పుడు బర్త్‌డే జరుపుకోలేదు. ఇప్పుడు కూడా అలాగే చేశాడు. పవన్ వీటికి దూరమని తెలిసినప్పటికీ విషెస్ మాత్రం చెబుతున్నాను' అని పేర్కొన్నారు నాగబాబు.

 జనసేనకు వంద కోట్ల రూపాయలు

జనసేనకు వంద కోట్ల రూపాయలు

వాస్తవానికి ఈ వీడియోను పెట్టడం వెనుక ఉద్దేశ్యాన్ని నాగబాబు వెల్లడించారు. ‘జనసేన పార్టీకి రూ.100 కోట్ల విరాళాలు అందించాలని జనసైనికులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే రికార్డు స్థాయిలో జనసేన ఖాతాలోకి డబ్బులను జమచేశారు. ఇలాంటి కార్యకర్తలు ఉండడం నన్ను భావోద్వేగానికి గురిచేసింది. వారిలో ఓడిపోయామన్న నిరాశ ఎక్కడా కనిపించలేదు' అని నాగబాబు ఉద్వేగంగా మాట్లాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X