వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్: ఆ అమ్మాయినే చేసుకుంటా అంటే నేనేం చేయలేను అంటూ!

మెగా బ్రదర్ నాగేంద్రబాబు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. హీరోగా ప్రత్యేకతను చాటుకుంటూ ఎనలేని పేరును సంపాదించుకున్నాడు టాలెంటెడ్ హీరో వరుణ్ తేజ్. 'ముకుంద' అనే సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన మెగా ప్రిన్స్.. తన రెండో సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకున్నాడు. అప్పటి నుంచి సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపిస్తూ దూసుకుపోతున్నాడు. తద్వారా ఎన్నో విజయాలు అందుకున్నాడు. ఇలాంటి సమయంలో వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఆ సంగతులు మీకోసం!

అదే సక్సెస్ మంత్ర.. వరుసగా విజయాలు

అదే సక్సెస్ మంత్ర.. వరుసగా విజయాలు

మొదటి సినిమా 'ముకుంద'తో ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన 'కంచె'తో జాతీయ అవార్డును అందుకున్నాడు వరుణ్ తేజ్. అప్పటి నుంచి కథ ఎంపికలో ప్రత్యేకతను చూపిస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటున్నాడు. అందుకే సుదీర్ఘమైన కెరీర్‌లో 'ఫిదా', 'తొలిప్రేమ', 'అంతరిక్షం', 'F2', 'గద్దలకొండ గణేష్' వంటి వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

బాక్సర్‌గా ఒకటి.. ప్రస్టేటెడ్ భర్తగా మరొకటి

బాక్సర్‌గా ఒకటి.. ప్రస్టేటెడ్ భర్తగా మరొకటి

కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్న తర్వాత వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' అనే మూవీ చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యం ఉన్న ఈ సినిమాలో అతడు ఫైటర్‌లా కనిపించనున్నాడు. దీనితో పాటు 'F3'ని కూడా చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'F2'కి ఇది సీక్వెల్. ఇందులో వరుణ్‌తో పాటు వెంకటేష్ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే.

వరుణ్ తేజ్‌కు ఆ అమ్మాయితో పెళ్లి అంటూ

వరుణ్ తేజ్‌కు ఆ అమ్మాయితో పెళ్లి అంటూ

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతున్నాడు వరుణ్ తేజ్. ఇలాంటి సమయంలోనే అతడి పర్సనల్ లైఫ్ గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే అతడికి వివాహం జరగబోతుందని ఆ మధ్య ఓ వార్త బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త కుమార్తెతో వరుణ్ పెళ్లి జరుగుతుందని ప్రచారం జరిగింది.

అప్పుడు నాగబాబు అలాగ చెప్పడం వల్లే

అప్పుడు నాగబాబు అలాగ చెప్పడం వల్లే

ఆ మధ్య ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ వివాహంపై ఆయన తొలిసారి స్పందించారు. 'మేము వరుణ్ బాబుకు సంబంధాలు చూస్తున్నాం. వాడు మాత్రం ఇప్పుడే వద్దంటున్నాడు. ఒకవేళ చేసుకున్నా బయటి విషయాలపై స్పందిస్తూ, ప్రొఫెషనల్‌గా ఉండే అమ్మాయి కావాలి అంటున్నాడు' అని ఆయన చెప్పుకొచ్చారు.

మెగా ప్రిన్స్ పెళ్లి గురించి నాగబాబుకు ప్రశ్న

మెగా ప్రిన్స్ పెళ్లి గురించి నాగబాబుకు ప్రశ్న


కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు నాగబాబు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫాలోవర్లతో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్లు ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు. వీటన్నింటికీ సామాన్యుడిలానే జవాబులు ఇస్తూ ఆకట్టుకున్నారు మెగా బ్రదర్. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఆయనను ప్రశ్నించాడు.

ఎప్పుడు చేస్తారు బాస్.. మీరే చూడండంటూ

ఎప్పుడు చేస్తారు బాస్.. మీరే చూడండంటూ

నాగబాబు ఇన్‌స్టాగ్రామ్ చాట్ నిర్వహించిన సమయంలో ఓ నెటిజన్ 'వరుణ్ అన్న మ్యారేజ్ ఎప్పుడు చేస్తారు బాస్' అని ప్రశ్నించాడు. పెళ్లి చూపులు అని రాసున్న ఓ ఫొటోను వదిలిన ఆయన.. 'మంచి సంబంధాలు ఉంటే మీరే చూడండి' అంటూ కామెంట్ చేశారు. దీంతో మెగా ప్రిన్స్ కోసం అమ్మాయిని వెదికే పనిలో ఉన్నామని పరోక్షంగా వెల్లడించారాయన. దీనిపై ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

ఆమెనే చేసుకున్నా నేనేం చేయలేను అంటూ

ఆమెనే చేసుకున్నా నేనేం చేయలేను అంటూ

ఇదే చాట్‌లో మరో నెటిజన్ స్పందిస్తూ.. 'వరుణ్ ఓ మిడిల్ క్లాస్ అమ్మాయితోనే లైఫ్ అనుకుని.. మరో ఆలోచనే లేదు అంటే మీరు ఏం చేస్తారు' అని ఓ ప్రశ్న అడిగాడు. దీనికి నాగబాబు 'మీకూ మీకూ ఓకే అయితే నేనేమంటా' అంటూ తేల్చేశారు. తద్వారా తన కుమారుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నా అభ్యంతరం లేదన్నట్లుగా చెప్పారు. దీంతో ఈ స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X