పవన్, క్రిష్ మూవీపై రూమర్లకు చెక్.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై, ఆ చిత్ర కథపై మీడియాలో అనేక రూమర్లు వస్తున్నాయి. అయితే మెగా బ్రదర్ ఆ సినిమా కథపై, పవన్ పాత్రపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. లాక్‌డౌన్ సమయంలో లైవ్ ఛాటింగ్‌లో నెటిజన్లు పలు ప్రశ్నలకు నాగబాబు సమాధానమిచ్చారు.
పవన్, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న విరూపాక్ష (వర్కింగ్ టైటిల్) చిత్రంలో పవన్ దొంగ పాత్రలో నటిస్తున్నారనే వార్తలను నాగబాబు కొట్టిపడేశారు. తనకున్న సమాచారం ప్రకారం పవన్ ఆ చిత్రంలో యోధుడిగా నటిస్తున్నారనే విషయాన్ని వెల్లడించారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్ర కథ మొగల్ కాలం నాటి ఔరంగజేబ్ పాలన కథాంశంగా సినిమా సాగుతుందని నాగబాబు చెప్పారు.

ఔరంగజేబ్ పాలన నాటి కాలంలో బ్రిటీష్ పాలకులతో జరిగే యుద్ధ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని, కోహినూర్ వజ్రం బ్యాక్‌డ్రాప్‌గా కథ సాగుతుందని నాగబాబు ఆ సినిమా కథను చెప్పకనే చెప్పారు. థోర్, ఐరన్ మ్యాన్ సినిమాల పంథాలో విరూపాక్షను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్నది. చారిత్రాత్మక నేపథ్యంతో రూపొందే ఈ సినిమాకు కీరవాణి సంగీత దర్శకుడు. సైరా, RRR చిత్రానికి మాటలు రాసిన బుర్రా సాయిమాధవ్ రచయితగా పనిచేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సాయిబాబా వ్యవహరించనున్నారు.
వాస్తవానికి విరూపాక్షను 2020లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ కోవిడ్19 కారణంగా ఈ సినిమా షూట్ ఆలస్యంగా ప్రారంభం కానున్నది. అంతా సవ్యంగా సాగితే ఈ చిత్రం 2021లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











