Varun Tej Marriage: వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు క్లారిటీ.. ఆ అమ్మాయితోనే.. అందుకే వేరేగా ఉంటున్నాడట!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. 'ముకుంద'తో తన ప్రయాణాన్ని మొదలెట్టిన అతడు.. తన రెండో సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపును అందుకున్నాడు. ఆ తర్వాత పలు పరాజయాలు ఎదురవడంతో కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపిస్తూ దూసుకుపోతున్నాడు. తద్వారా ఎన్నో విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజులుగా వరుణ్ తేజ్ పెళ్లిపై ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై నాగబాబు క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

వరుస సినిమాలు.. ఎన్నో హిట్లు
'ముకుంద'తో గ్రాండ్ ఎంట్రీని అందుకోని వరుణ్ తేజ్ 'కంచె'తో జాతీయ అవార్డును దక్కించుకున్నాడు. అప్పటి నుంచి కథ ఎంపికలో ప్రత్యేకతను చూపిస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటున్నాడు. అందుకే సుదీర్ఘమైన కెరీర్‌లో 'ఫిదా', 'తొలిప్రేమ', 'అంతరిక్షం', 'F2', 'గద్దలకొండ గణేష్' వంటి వరుస విజయాలను సొంతం చేసుకుని సత్తా చాటుతోన్నాడు.

వరుస ఫ్లాపులు.. ఇప్పుడు అవే
గత ఏడాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఏకంగా 'గని', 'F3' అనే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ రెండూ అతడికి నిరాశనే మిగిల్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మెగా హీరో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాండీవధారి అర్జున' అనే సినిమాను చేస్తోన్నాడు. అలాగే, ఎయిర్‌ఫోర్స్ బ్యాగ్‌డ్రాప్‌తోనూ మరో చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ షూట్లతో బిజీగా ఉన్నాడు.

వరుణ్ తేజ్ పెళ్లిపై ప్రచారం
వరుణ్ తేజ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి సమయంలోనే అతడి పర్సనల్ లైఫ్ గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే అతడికి వివాహం జరగబోతుందని ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అతడు ఓ హీరోయిన్‌ను పెళ్లాడబోతున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది. దీంతో వరుణ్ పేరు తరచూ హైలైట్ అవుతోంది.

తండ్రి కామెంట్.. మళ్లీ మళ్లీ
వరుణ్ తేజ్ పెళ్లి అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారీ నాగబాబు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది ఆయన 'మేము వరుణ్ బాబుకు సంబంధాలు చూస్తున్నాం. వాడు మాత్రం ఇప్పుడే వద్దంటున్నాడు. ఒకవేళ చేసుకున్నా బయటి విషయాలపై స్పందిస్తూ, ప్రొఫెషనల్‌గా ఉండే అమ్మాయి కావాలి అంటున్నాడు' అని చెప్పారు. అయినప్పటికీ ఈ వార్తలు ఆగడం లేదు.

పెళ్లిపై నాగబాబు తాజా రిప్లై
ఇక, తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయన తన పర్సనల్, ప్రొఫెషనల్ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించారు. అలాగే, తన పిల్లలు గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు క్లారిటీ ఇచ్చారు. ఇది త్వరలోనే ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

వాడే మీడియాకు చెబుతాడు
ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు 'త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేస్తాం. అప్పుడే దీని గురించి నేనేమీ కామెంట్ చేయకూడదు. తన పెళ్లి గురించి అన్ని విషయాలు వరుణ్ బాబు స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెబుతాడు' అంటూ క్లారిటీ ఇచ్చారు. అలాగే, ఫ్యామిలీ ఓకే చేసిన అమ్మాయినే చేసుకుంటాడని కూడా పరోక్షంగా తెలిపారు.

వాడు వేరేగానే ఉంటోన్నాడు
ఆ తర్వాత నాగబాబు కంటిన్యూ చేస్తూ.. 'నిహారిన వేరేగా ఉంటుంది. వరుణ్ బాబు కూడా వేరే ఇంట్లోనే ఉంటున్నాడు. నేను వాళ్లను కంట్రోల్ చేయాలని ఎప్పుడూ అనుకోను. అందరికీ ప్రైవసీ కావాలనే కోరుకుంటాను. అందుకే మేము ఎక్కడ ఉన్నా.. మానసికంగా మాత్రం కలిసే ఉంటున్నామని లెక్క' అని వెల్లడించారు. దీంతో ఆయన తాజా ఇంటర్వ్యూ హైలైట్ అవుతోంది.


Click it and Unblock the Notifications











