»   » అలా అంటే నోరా, తాటి మట్టా?... మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్‌‌పై నాగబాబు కామెంట్!

అలా అంటే నోరా, తాటి మట్టా?... మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్‌‌పై నాగబాబు కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా ఫ్యామిలీ నుండి దాదాపు అరడజను మంది హీరోలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. ఈ నేపథ్యంలో మీకు మెగా ఫ్యామిలీ నుండి కాకుండా బయటి హీరోలపై మీ అభిప్రాయం ఏమిటి అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు నాగబాబు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

మా ఫ్యామిలీ కాకుండా బాగా నచ్చేది ప్రభాస్. చాలా బ్రిలియంట్, నేచురల్ యాక్టర్. అదే విధంగా మహేష్ బాబు అంటే కూడా చాలా ఇష్టం. మా ఇంట్లో చాలా మంది హీరోలు ఉన్నారు. వీళ్లందరి కష్టాన్ని దగ్గరి నుండి చూశాను. ఎవరినీ తక్కువ చేయలేం... అని నాగబాబు అన్నారు.

యాక్టింగ్ రాదు అంటే...

యాక్టింగ్ రాదు అంటే...

ఇవాళ ఇండస్ట్రీలో జూ ఎన్టీఆర్, మహేష్ బాబు, రవితేజ లాంటి యంగ్‌స్టర్లలో ఇతడు సరిగా చేయడు, వీళ్లకి యాక్టింగ్ రాదు అంటే మాత్రం నా అంత ఎదవ ఇంకెవరూ ఉండరు. ఎదుటి వ్యక్తి మనకు నచ్చినా, నచ్చక పోయినా జనాలకు నచ్చుతున్నాడు.... అని నాగబాబు అన్నారు.

మహేష్ బాబు చిన్నపుడు

మహేష్ బాబు చిన్నపుడు

నా అబ్జర్వేషన్ తో చెబుతున్నాను... మహేష్ బాబు సినిమాల్లోకి రాక ముందు చాలా చబ్బీగా ఉన్నాడు. ఎంత చబ్బీగా ఉన్నాడంటే ఒక చాక్లెట్ బేబీలా ఉండేవాడు. చాలా ముద్దుగా ఉండేవాడు. చిన్నపుడు మద్రాసు నుండి చూస్తున్నాను. కొంచె ఇంట్రావర్డ్ గా ఉంటాడు... అని నాగబాబు అన్నారు.

అవితింటే ఇలా ఉండవాడు కాదు

అవితింటే ఇలా ఉండవాడు కాదు

హైదరాబాద్ వచ్చాక ఇక్కడ పార్కులో వాకింగ్ చేసే వాళ్లం. మా పక్క నుండి అలా పరుగెత్తుకుంటూ వెళ్లేవాడు. అపుడు నాకు ఎవరో చెప్పారు మహేష్ బాబు ఐస్ క్రీములు బాగా తింటాడు అని, చాలా రిచ్ కిడ్ కదా ఆ అబ్బాయి అప్పటి నుండే ఐస్ క్రీములు తినేస్తూ, చాక్లెట్లు తినేస్తూ ఉంటే మహేష్ బాబు ఇలా ఉండేవాడు కాదు... అని నాగబాబు అన్నారు.

పరుగు సూపర్

పరుగు సూపర్

అలా చూడగా చూడగా చబ్బీగా ఉండే మహేష్ బాబు మ్యాన్లీగా, ఒక అథ్లెట్ గా తయారయ్యాడు. మహేష్ బాబు పరుగు సూపర్, ఆయనంత అందంగా ఎవరూ పరుగెత్తరు. ఆ రన్నే ఒక అథ్లెటిక్ రన్ లా ఉంటుంది... అని నాగబాబు అన్నారు.

నోరా తాటి మట్టా

నోరా తాటి మట్టా

మహేష్ బాబు ఇపుడు టాప్ రేంజిలో ఉన్నాడు. మహేష్ బాబును ఒక వేళ నేను ఏమైనా అనాలి అనుకుందాం... ఎలా అనగలుతామండీ, మాటలెలా వస్తాయి, ఒక వేళ అంటే నాది నోరా తాటి మట్టా... మహేష్ కష్టాన్ని వ్యక్తిగతంగా చూశాను. ఎంత కష్టపడతాడు అతడు, ఇప్పటికీ వన్ అవర్ నాన్ స్టాప్ గా పరుగెడతాడు. స్పీడ్ రన్నింగ్, ఇంకోడిదైతే పడిపోద్ది అని.... నాగబాబు అన్నారు.

చాలా కష్టపడతారు

చాలా కష్టపడతారు

ప్రభాస్... సిక్స్ ప్యాక్ చేయడానికి ఎంత కష్టపడ్డాడు. తిండి మానేసి నానా కష్టాలు పడ్డారు. అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ చేసిన ఫస్ట్ హీరో, ఎన్టీఆర్ చాలా లావుగా ఉండేవాడు, అలాంటోడు స్లిమ్ అయిపోయి టెంపర్ కి సిక్స్ పాక్ చేశాడు... అని నాగబాబు అన్నారు.

స్టార్ ఇమేజ్ ఊరికే రాదు

స్టార్ ఇమేజ్ ఊరికే రాదు

ఎంతో కష్టపడితే తప్ప... రక్తం చిందిస్తే తప్ప స్టార్ ఇమేజ్ రాదు. ఎన్ని దెబ్బలు తగులుంటాయి వాళ్లకి, చరణ్ బాబు మగధీరలో అతిపెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. మొహానికి గుడ్డపడే సీన్ ప్లాన్డ్ కాదు, యాక్సిడెంట్. గుర్రం మీద నుండి పక్కకు వచ్చే సీన్లో ఇట్‌వాజ్ యాక్సిడెంట్... సేవ్డ్ వెరీ ఎఫెక్టివ్ లీ, దాన్నేదో మేనేజ్ చేశారు కానీ, ఏమైనా అయ్యింటే లైఫ్ ఏమయ్యేది. అలాంటి రిస్కులు చేసుకుంటున్నారు మన హీరోలు. బన్నీకి షోల్డర్ ఇజురీ 20 సార్లు అయింది. ఆపరేషన్లు చేయించుకున్నాడు. అయినా చేస్తున్నాడు. వాళ్లు ఇంత స్టేజికి వచ్చిన తర్వాత ఎవరు పెద్ద యాక్టర్, ఎవరు చిన్న యాక్టర్ అని అనలేం... అని నాగబాబు అన్నారు.

ఏ హీరోను తక్కువ చేసి మాట్లాడలేను

ఏ హీరోను తక్కువ చేసి మాట్లాడలేను

ప్రొడ్యూసర్లు కోట్లకు కోట్లు ఇవ్వడానికి పిచ్చోళ్లా, వాళ్ల దగ్గర వర్త్ ఉంది, వెనకాల కష్టం ఉంది, సంపాదిస్తున్నారు, పేరు తెచ్చుకుంటున్నారు. ప్లాప్ అయితే అలా డిప్రెస్ అయిపోతారు. మళ్లీ కుదురుకుంటారు. ఎన్నో కష్టాలు ఉంటాయి హీరోలకు, మా ఇంట్లో ఇంత మంది హీరోలు ఉండటం వల్ల ఏ హీరోను తక్కువ చేసి మాట్లడలేను... అని నాగ బాబు అన్నారు.

English summary
Mega Brother Nagababu interesting comments about Mahesh Babu, NTR, Prabhas. "Everyone is working hard, Everyone works with dedication." Naga Babu said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu