For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రకాశ్ రాజ్‌కు సపోర్ట్ చేయడానికి కారణం చెప్పిన నాగబాబు: అవన్నీ బయటకొస్తే గొడవలు జరుగుతాయంటూ!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రస్తుత పాలక వర్గానికి సంబంధించిన గడువు ముగియడానికి చాలా రోజులు సమయం ఉన్నా.. ఎన్నిక కోసం ప్రముఖులు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే నలుగురు నటీనటులు పోటీ పడుతున్నట్లు ప్రకటన కూడా ఇచ్చేశారు. అందులో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ బాగా హైలైట్ అవుతున్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ఇక, ఈయనకు మెగా బ్రదర్ నాగబాబు మద్దతు ప్రకటించారు. వీళ్లిద్దరూ కలవడానికి కారణం ఏంటనేది తాజాగా బయటకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

  MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu
  బరిలో నిలిచిన నలుగురు ప్రముఖులు

  బరిలో నిలిచిన నలుగురు ప్రముఖులు

  తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత ముఖ్యమైన ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నిక కోసం ఈ సారి ఏకంగా నలుగురు ప్రముఖులు పోటీలో నిలిచారు. ఇందులో ముందుగా ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మంచు విష్ణు బరిలో నిలిచారు. వీళ్లను ఢీ కొట్టేందుకు జీవితా రాజశేఖర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే హేమ కూడా ఈ సారి పోటీకి సై అన్నారు.

  ప్రకాశ్ రాజ్ దూకుడు... ప్యానెల్‌ కూడా

  ప్రకాశ్ రాజ్ దూకుడు... ప్యానెల్‌ కూడా

  ముగ్గురు ప్రముఖులు ఇప్పుడు ఎన్నికల కోసం సిద్ధం అవగా.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌ మాత్రం ‘మా' అధ్యక్ష పదవి కోసం ముందు నుంచే పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు సినీ పెద్దల నుంచి మద్దతును సంపాదించారు. అలాగే, పక్కా ప్లాన్‌ను కూడా రెడీ చేశారు. అంతేకాదు, గురువారమే 27 మంది సభ్యులతో కూడిన తన ప్యానెల్‌ను ప్రకటించారు.

  ప్రకాశ్ రాజ్‌కు మెగా ఫ్యామిలీ మద్దతు

  ప్రకాశ్ రాజ్‌కు మెగా ఫ్యామిలీ మద్దతు

  ప్రకాశ్ రాజ్ కన్నడ పరిశ్రమకు చెందిన వ్యక్తి అని.. ఆయన నాన్ లోకల్ కిందకు వస్తాడని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు చెందిన వారికే మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగా ఫ్యామిలీ సపోర్టు మాత్రం ప్రకాశ్ రాజ్‌కే ఉందన్న టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే నాగబాబు సపోర్ట్ ఇస్తున్నట్లు తెలిపారు.

  నిన్న ప్రెస్‌మీట్‌కు హాజరైన నాగబాబు

  నిన్న ప్రెస్‌మీట్‌కు హాజరైన నాగబాబు

  శుక్రవారం ఉదయం ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. దీనికి మెగా బ్రదర్ నాగబాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. అదే సమయంలో తనపై వస్తున్న విమర్శలకు సైతం సమాధానాలు చెప్పారు. ఇదే ప్రెస్‌మీట్‌లో నాగబాబు సైతం కొంత కాంట్రవర్శీగా మాట్లాడడం కొసమెరుపు.

  ప్రకాశ్ రాజ్‌కు మద్దతివ్వడానికి కారణం

  ప్రకాశ్ రాజ్‌కు మద్దతివ్వడానికి కారణం

  ప్రకాశ్ రాజ్‌కు నాగబాబు ఎందుకు మద్దతిస్తున్నారన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతోంది. దీనికి కారణం గతంలో వీళ్లిద్దరి మధ్య రాజకీయ పరమైన వివాదం ఉండడమే. ఇక, ప్రెస్‌మీట్‌లో మెగా బ్రదర్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయాలు వేరు.. ఇది మా పరిశ్రమకు సంబంధించినది. అందుకే అవన్నీ పక్కన పెట్టేసి మద్దతిస్తున్నా' అని చెప్పుకొచ్చారు.

  ఆ విషయాలన్నీ వివరంగా చెబుతాడు

  ఆ విషయాలన్నీ వివరంగా చెబుతాడు

  ‘ప్రకాశ్ రాజ్ మీకు ఏ విషయాలు చెప్పి మద్దతు ఇవ్వడానికి ఒప్పించారు' అని ఓ రిపోర్టర్ నాగబాబును ప్రశ్నించారు. దీనికి ఆయన ‘చాలా రోజుల క్రితమే ఆయన నన్ను కలిసి ఈ విషయం చెప్పారు. బిజీ ఆర్టిస్టుగా మీరు ‘మా'కు సమయం కేటాయించగలరా అని అడిగాను. దానికి ఆయన తప్పకుండా ఇస్తాను అని చెప్పారు. అందుకే మద్దతివ్వడానికి ఒప్పుకున్నా' అని పేర్కొన్నారు.

  అవి బయటకొస్తే గొడవలు జరుగుతాయి

  అవి బయటకొస్తే గొడవలు జరుగుతాయి

  ‘ప్రకాశ్ రాజ్ ‘మా'కు సొంత భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇస్తున్నారు.. దీనిపై మీరేమంటారు' అని మరొకరు ప్రశ్నించగా.. నాగబాబు ‘గతంలో నేను ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కూడా బిల్డింగ్ కట్టడానికి ట్రై చేశా. అప్పుడు కుదరలేదు. అవన్నీ ఇప్పుడు మాట్లాడితే పెద్ద గొడవలు అయిపోతాయి. అందుకే అలాంటివి ఏమీ మాట్లాడకూడదని మేమంతా డిసైడ్ అయ్యాం' అని వెల్లడించారు.

  English summary
  Tollywood Actor and Producer Bandla Nagababu Recently Participated in a Press Meet. In This Chit Chat.. He Respond on MAA Elections 2021. And Also He Revealed Prakash Raj Character.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X