twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉప్పెన చూడమని చెప్పను.. వైష్ణవ్ తేజ్ ఫెర్ఫార్మర్ ఎక్స్రార్డనరీ.. నాగబాబు హాట్ కామెంట్స్

    |

    భారీ అంచనాల మధ్య విడుదలైన ఉప్పెన సినిమా మిక్స్‌డ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. సినీ నటులు, ప్రముఖులు ఈ సినిమా గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ రోజున ఈ చిత్రాన్ని ఏఎంబీ మాల్‌లో చూసిన నాగబాబు తన స్పందనను వినిపించారు. ఉప్పెన గురించి ఆయన మాట్లాడుతూ..

    వైష్ణవ్ తేజ్ ప్రుతిభలో 10 శాతం కూడా

    వైష్ణవ్ తేజ్ ప్రుతిభలో 10 శాతం కూడా

    ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్‌కు సంబంధించి ఫైట్స్, డ్యాన్స్ ఎక్కువగా చూపించలేదు. వైష్ణవ్‌కు ఉన్న ప్రతిభలో 10 శాతం కూడా చూపించలేదు. వైష్ణవ్ గాడి ఫెర్ఫార్మెన్స్ మాటల్లో చెప్పలేం. రియల్, నేచురల్ యాక్టర్‌గా కనిపించాడు అని నాగబాబు పేర్కొన్నారు.

    మావోడి నటన అద్భుతం

    మావోడి నటన అద్భుతం

    ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ హావభావాలు, కళ్లతో నటనను చూపించడం అంత సులభం కాదు. ఎన్నో సినిమాలు చేశాను.. చూశాను. ఎంతో మంది నటులను దగ్గరగా చూసిన వాడిని. మావోడి నటన ఎక్సార్డినరీ. డైలాగ్స్ డెలివరీ అద్భుతంగా ఉంది అని నాగబాబు ప్రశంసలు గుప్పించాడు.

    క్యాథరీన్ త్రెసా బ్యూటీఫుల్ గ్యాలరీ.. లేటేస్ట్ ఫోటోలు వైరల్

    డైరెక్టర్ టేకింగ్ ఎంత బాగుందంటే

    డైరెక్టర్ టేకింగ్ ఎంత బాగుందంటే

    ఇక డైరెక్టర్ బుచ్చిబాబు టేకింగ్ విషయానికి వస్తే.. సముద్రం మధ్యలో వైష్ణవ్ తేజ్, కృతి సింగ్‌పై తీసిన సాంగ్ చాలా బాగుంది. వారిద్దరి మధ్య రొమాన్స్ ఎలాంటి అశ్లీలత లేకుండా చూపించాడు. అలాంటి పాటను నా చిన్నతనంలో రాజేష్ ఖన్నా, షర్మిలా టాగోర్ మీద తీసిన రూప్ తేరా మస్తానా పాట గుర్తొచ్చింది. ఉప్పాడ బ్యాక్ డ్రాప్, జాలర్ల కమ్యూనిటీ గురించి అద్భుతంగా చూపించాడు. ఉప్పాడకు చాలా చరిత్ర ఉంది. అక్కడి వాతావరణాన్ని చాలా రియలిస్టిక్‌గా చేశాడు అని నాగబాబు తెలిపారు.

    మంచు బిందువు పడిన పుష్పంలా

    మంచు బిందువు పడిన పుష్పంలా

    హీరోయిన్ చాలా అందంగా ఉంది. మంచు బిందువు పడిన పుష్పం మాదిరిగా కనిపించింది. కృతి శెట్టి సెకండాఫ్‌లో చేసిన ఫెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తండ్రి కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాల్లో అద్బుతంగా చేసింది. జీవితానికి సంబంధించిన ఓ చక్కటి ఫిలాసఫీని చెప్పారు అని నాగబాబు తన ఫీలింగ్స్‌ను బయటపెట్టారు.

    ఉప్పెన చూసిన తర్వాత నా అనుభూతి

    ఉప్పెన చూసిన తర్వాత నా అనుభూతి

    ఉప్పెన సినిమా చూడమని నేను చెప్పను. నేను చూసిన తర్వాత నా అనుభూతిని పంచుకొంటున్నాను. నేను ఏడాదిన్నర తర్వాత థియేటర్లో చూసిన మంచి సినిమా ఉప్పెన. అద్భుతమైన నేటివిటి ఉన్న చిత్రం అంటూ నాగబాబు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

    English summary
    Uppena movie hits Theatres on February 12th. Vaishnav Tej and Krithi Shetty, Vijay Sethupathi are in the lead roles in the uppena. Buchchi Babu is debuting director. This movie got huge craze before its release. In this occassion, Mega brother Nagendra Babu gives exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X