వాళ్లు బాలయ్య సినిమా చూడకుండా నాగబాబు కుట్ర: విరుచుకుపడ్డ శ్రీరెడ్డి!

Recommended Video

Sri Reddy Says Nagababu Is Making A Conspiracy Against NTR Kathanayakudu

బాలకృష్ణను టార్గెట్ చేస్తూ నాగబాబు విడుదల చేస్తున్న వరుస వీడియోలపై శ్రీరెడ్డి స్పందించారు. బాలయ్య బాబు నటించిన 'ఎన్టీఆర్ కథానాయుడు' విడుదలవుతున్న నేపథ్యంలో ఆ సినిమా మెగా అభిమానులు చూకుండా ఎంతో కొంత ప్రభావం చూపాలనే ఉద్దేశ్యంతో కుట్రపూరితంగా మెగాబ్రదర్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఎన్నో దందాలు చేస్తోందని...మీరు చేసే దందాల్లో బాలయ్య బాబు ఏమైనా వేలు పెట్టాడా? ఎందుకు ఆయన్ను టార్గెట్ చేస్తున్నారంటూ శ్రీరెడ్డి విరుచుకుపడ్డారు. బాలయ్య బాబు పూర్తి గౌరవంగా మీరు ఎవరో తెలియదు అని సింగిల్ మాటతో వదిలేశారు. మరొకరు అయితే చెప్పులతో దండేసి గుండు కొట్టించి గాడిదమీద ఊరేగించేవారు.. అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరి మీ ఫ్యామిలీ దైవాంశ సంభూతులా?

మరి మీ ఫ్యామిలీ దైవాంశ సంభూతులా?

బాలయ్య బాబు... అమితాబ్ బచ్చన్‌ను ఏం పీకారులే అన్నారంట. బాలయ్య ప్రవర్తన కొన్ని సందర్భాల్లో అటూ ఇటుగా ఉండొచ్చు. ఆయన మా ఫ్యామిలీ, మా తండ్రి, మా బ్లడ్ అంటే.. మీరేమైనా దైవాంశ సంభూతులా? అని నాగబాబుగారు అంటున్నరు, మరి మీ ఫ్యామిలీ ఏమైనా దైవాంశ సంభూతులా? మీ ఫ్యామిలీ వారే హీరోలుగా ఎందుకు ఉన్నారు?... అని శ్రీరెడ్డి ప్రశ్నించారు.

అలాంటి బ్లడ్ గురించి చెప్పుకుంటే తప్పేంటి?

అలాంటి బ్లడ్ గురించి చెప్పుకుంటే తప్పేంటి?

ఎన్టీఆర్ గారు రాజకీయంగా ఎన్నో గొప్ప పనులు చేశారు. ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో వందల, వేల ఆర్టిస్టులను, టెక్నీషియన్లను పైకి తీసుకొచ్చారు. ఎన్నో గొప్ప పాత్రలు వేశారు. వారు వేసిన పాత్రల ముందు మీ అన్నయ్య వేసిన పాత్రలు ఏమైనా ఎక్కువగా? ప్రేక్షకుడికి నయనానందం ఇవ్వడానికి ఎన్టీఆర్ గారు తన జీవితం త్యాగం చేశారు. అలాంటి బ్లడ్ గురించి మాట్లాడటం కానీ, మా నాన్నగారు గొప్ప అనడం తప్పేలేదు... అని శ్రీరెడ్డి తెలిపారు.

మీ మెగా ఫ్యామిలీ ఎంత మందికి లైఫ్ ఇచ్చింది?

మీ మెగా ఫ్యామిలీ ఎంత మందికి లైఫ్ ఇచ్చింది?

వాళ్లు ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు.. మరి మీ మెగా ఫ్యామిలీ ద్వారా ఎంత మందికి లైఫ్ వచ్చింది? డిబేట్ పెడితే తెలిసిపోతుంది. మెగా ఫ్యామిలీకి అడ్డుగా ఉన్న వారిని తొక్కేశారు. ఎంతో మందిని ఆత్మహత్యకు ప్రేరేపించారు. మిమ్మల్ని కూడా గొప్పోళ్లు అంటాం... మీ అన్నయ్య ఏం చేశారో కాస్త చెప్పండి. మీరు ప్రజారాజ్యం పెట్టి ఏం చేశారు. తిరుపతిలో మిమ్మల్ని నమ్మి ఓటేసిన జనాలకు ఏం చేశారు... అని శ్రీరెడ్డి ప్రశ్నించారు.

ఫిల్మ్ చాంబర్ మీ అబ్బ సొత్తా?

ఫిల్మ్ చాంబర్ మీ అబ్బ సొత్తా?

అల్లు అరవింద్ గారు థియేటర్లు గుప్పిట్లో పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. మీరు నా మీద కోపం పెట్టుకుని మెంబర్ షిప్ రాకుండా అడ్డుకున్నారు అన్నది నిజం కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తుంటే పవన్ కళ్యాణ్‌గారు శ్రీరెడ్డిని అడ్డం పెట్టుకుని మీడియా ఫోకస్ తన వైపు వచ్చేలా ఫిల్మ్ చాంబర్లో హడావుడి చేయలేదా? ఫిల్మ్ చాంబర్ మీ అబ్బ సొత్తా? చిరంజీవి సొత్తా? అది ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసే ప్రతి ఒక్కరి సొత్తు అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు.

మిమ్మల్ని చూసి మర్యాద నేర్చుకోవాలా?

మిమ్మల్ని చూసి మర్యాద నేర్చుకోవాలా?

బాలయ్య బాబు ఏదో అన్నారు అని మీరు విమర్శిస్తున్నారు... మీ పవన్ కేసీఆర్ గారిని తాటతీస్తా అనలేదా? కాంగ్రెస్ సీనియర్ నాయకులను బట్టలూడదూసి పరుగెత్తిస్తా అనలేదా? ఇది మర్యాదా? మర్యాదలు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలా? చాలా హాస్యాస్పదంగా ఉంది నాగబాబుగారు.. మీరు జబర్దస్త్ లో వెకలి నవ్వులు నవ్వి నవ్వి... బూతు జోకులకు నవ్వి నవ్వి.. మీకు ప్రతి ఒక్కరూ మాట్లాడేది బూతులాగే ఉంది తప్ప మీకు ఎవరు మాట్లాడేది ఒక మంచితనంగా కనిపించడం లేదని... శ్రీరెడ్డి మండి పడ్డారు.

బాలయ్య బాబును అనే స్థాయి నాగబాబుకు ఉందా?

బాలయ్య బాబును అనే స్థాయి నాగబాబుకు ఉందా?

బాలయ్యబాబును అనే స్థాయి నాగబాబుకు ఉందా? మెగా ఫ్యామిలీ బాధితుల్లో నువ్వు ఫస్ట్ బాధితుడివి కాదా? ఆరెంజ్ సినిమా సమయంలో చచ్చిపోయే పరిస్థితి రాలేదా? మీ పెద్దన్నయ్య నువ్వు ఎందుకు మాట్లాడుకోలేదు? అల్లు అరవింద్‌గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు పడదు? బయటకు చెప్పాలి... అంటూ శ్రీరెడ్డి విమర్శలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X