twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే అసూయ.. చిరంజీవిపై గరికపాటి అసహనం.. నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్

    |

    మెగాస్టార్ చిరంజీవి ఇటీవల జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందే ఆయన గాడ్ ఫాదర్ కు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నప్పటికీ ఆ వేడుకకు హాజరయ్యారు. వేడుకలో చాలామంది రాజకీయ ప్రాముఖ్యలు కూడా పాల్గొన్నారు. ఇక ఊహించని విధంగా ఆ ఈవెంట్ లో గరికపాటి నరసింహ రావు, మెగాస్టార్ చిరంజీవిపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే ఆయనపై తీవ్ర స్థాయిలో ఫ్యాన్స్ అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. అయితే నాగబాబు కూడా ఇప్పుడు ఊహించని విధంగా సోషల్ మీడియాలో చేసిన ఒక కామెంట్ వైరల్ గా మారుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    వారిని ఇబ్బంది పెట్టకుండా

    వారిని ఇబ్బంది పెట్టకుండా

    మెగాస్టార్ చిరంజీవి ఎక్కడికి వెళ్ళినా కూడా అభిమానులు చాలా వరకు ఆయనతో కలుసుకునేందుకు ఎగబడుతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు కూడా మెగాస్టార్ తో ఫోటోలు దిగేందుకు ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక ఇటీవల నాంపల్లిలో ఆయన దసరా సందర్భంగా బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో కూడా మెగాస్టార్ తో ఫోటోలు దిగేందుకు చాలా మంది మహిళలు పోటీపడ్డారు. ఇక మెగాస్టార్ కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా సున్నితంగా అందరికీ ఒకేసారి ఫోటో ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు.

    గరికపాటి అసహనం

    గరికపాటి అసహనం

    అయితే మెగాస్టార్ చిరంజీవి మహిళలకు ఫోటోలు ఇస్తున్న సమయంలో స్టేజ్ పైనే ఉన్న ప్రవచనకర్త గరికపాటి తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. అయితే మెగాస్టార్ మహిళలకు అలా ఫోటో సెషన్ నిర్వహిస్తూ ఉండడంతో అందరి ఫోకస్ కూడా అటువైపే వెళ్ళింది. దీంతో గరికపాటి నరసింహారావు గారు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు వెంటనే ఆ ఫోటో సెషన్ ఆపాలి అని కూడా అన్నారు.

    మెగాస్టార్ గొప్పతనం

    మెగాస్టార్ గొప్పతనం

    చిరంజీవి గారు ఆ ఫోటో సెషన్ ఆపేసి నా పక్కన వచ్చి కూర్చోవాలి అని గరికపాటి కొంత అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ ఫోటో సెషన్ ఆపకపోతే నేను ఇక్కడ ప్రసంగాన్ని ఆపివేసి వెళ్ళిపోతాను అని కూడా అన్నారు. దీంతో అక్కడ నిర్వాహకులు కూడా ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మెగాస్టార్ మాత్రం గరికపాటి గురించి గొప్పగానే చెప్పారు. ఆయనను ఎంతగానో అభిమానిస్తాను అని పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అలాగే గరికపాటి లాంటివారు ఆశీర్వాదం కూడా తనకు కావాలి అని మెగాస్టార్ చాలా వినయంగా తెలియజేశారు.

    చిరునవ్వుతో..

    చిరునవ్వుతో..

    ఇక గరికపాటి ఆ విధంగా మాట్లాడడం పై సోషల్ మీడియాలో అయితే చాలా రకాల భిన్నభిప్రాయాలు వెలువడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మహిళలందరితో ఒకేసారి రావడంతో వారిని ఇబ్బంది పెట్టకుండా అక్కడ ఫోటోలు ఇవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా మెగాస్టార్ ఆ తర్వాత వెంటనే వచ్చే గరికపాటితో చాలా చిరునవ్వుతో మాట్లాడారు.

    నాగబాబు రియాక్షన్

    నాగబాబు రియాక్షన్

    ఇక మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో గరికపాటి చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా కామెంట్ చేశారు. 'ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే..' అని నాగబాబు కామెంట్ చేసిన విధానం గరికపాటి గారికి కౌంటర్ గా ఇచ్చినట్లుగా ఉందని నెటిజన్లు కూడా స్పందించారు. గతంలో కూడా నాగబాబు ఇదే తరహాలో కొంతమంది సెలబ్రిటీలకు కూడా నాగబాబు కౌంటర్ అయితే ఇచ్చారు. మరి ఈ విషయంపై గరికపాటి మళ్ళీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

    English summary
    Nagababu counter tweet to Garikipati Narasimha Rao comments on chiranjeevi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X