Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకో.. క్షమాపణ చెప్పు.. నాగబాబు ఫైర్.. వివాదం కొత్త మలుపు
టాలీవుడ్లో బాలకృష్ణ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. గురువారం ఉదయం బసవతారకం హాస్పిటల్లో బాలకృష్ణ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ భూములు పంచుకొంటున్నారా అంటూ వివాదాన్ని తట్టి లేపారు. దాంతో పలు సినీ ప్రముఖులు దానిపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు చేసిన వ్యాఖ్యలతో వివాదం కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపించింది. ఈ వివాదంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే..
నేను సమర్థించను.. కానీ
భూములు పంచుకొంటున్నారన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు ఘాటుగా స్పందించారు. సీఎం, మంత్రులతో జరిగిన సమావేశానికి బాలకృష్ణను పిలువకపోవడాన్ని నేను సమర్థించను. కానీ ఆయన అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అయితే ఆయన బూతులు మాట్లాడకుండా ఉండాల్సింది అని నాగబాబు అన్నారు.
నోటికి ఎంతోస్తే అంత మాట్లాడటం సరికాదు
బాలకృష్ణ నోటికి ఎంతోస్తే అంత మాట్లాడటం సరికాదు. అర్జంటుగా మీ మాటలు వెనకకు తీసుకోవాలి. మీరు అలా మాట్లాడుతానంటే పదిరెట్లు మాట్లాడేందుకు చాలా మంది ఉన్నారు. నోరు అదుపులో పెట్టుకో. భూములు పంచుకొంటున్నారంటూ చాలా పెద్ద తప్పు మాట్లాడారు. మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరుస్తూ మరో పెద్ద తప్పు మాట మాట్లాడారు. మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి అని నాగబాబు అన్నారు.
ప్రైవేట్ మీటింగులు ఎందుకు
టాలీవుడ్లో షూటింగులకు, సినిమా థియేటర్ల ఓపెన్ చేయడానికి జరుగుతున్న చర్చలు సరైన దిశలో సాగడం లేదు. ఫిలిం ఛాంబర్‌ను వదిలేసి సొంత నివాసాల్లో ప్రైవేట్ కార్యక్రమంగా జరుపుతున్నారు. చిరంజీవి నివాసంలో, అన్నపూర్ణ స్టూడియోలో సమావేశాలు పెట్టడం ఫిలిం ఛాంబర్ ప్రతిష్టను కించపరచడమే అని నిర్మాత ప్రసన్నకుమార్ ఆరోపించారు.
Recommended Video
బాలకృష్ణ వ్యాఖ్యలపై సీ కల్యాణ్ వివరణ
బాలకృష్ణ వ్యాఖ్యలపై నిర్మాత కల్యాణ్ స్పందిస్తూ.. తాను ఇప్పటికే బాలయ్యతో మధ్యాహ్నం మాట్లాడాను. అన్ని విషయాలకు క్లారిటీ ఇచ్చాను. ఆయన సంతృప్తి చెందారు. ఆయన మా హీరో. ఆయన తరఫును నేను సమావేశాల్లో పాల్గొంటున్నాను అని కల్యాణ్ పేర్కొన్నారు. ఇంతటితో ఈ సమస్య ముగిసిందని పేర్కొన్నారు.