twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకో.. క్షమాపణ చెప్పు.. నాగబాబు ఫైర్.. వివాదం కొత్త మలుపు

    |

    టాలీవుడ్‌లో బాలకృష్ణ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. గురువారం ఉదయం బసవతారకం హాస్పిటల్‌లో బాలకృష్ణ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ భూములు పంచుకొంటున్నారా అంటూ వివాదాన్ని తట్టి లేపారు. దాంతో పలు సినీ ప్రముఖులు దానిపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు చేసిన వ్యాఖ్యలతో వివాదం కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపించింది. ఈ వివాదంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే..

    నేను సమర్థించను.. కానీ

    నేను సమర్థించను.. కానీ

    భూములు పంచుకొంటున్నారన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు ఘాటుగా స్పందించారు. సీఎం, మంత్రులతో జరిగిన సమావేశానికి బాలకృష్ణను పిలువకపోవడాన్ని నేను సమర్థించను. కానీ ఆయన అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అయితే ఆయన బూతులు మాట్లాడకుండా ఉండాల్సింది అని నాగబాబు అన్నారు.

    నోటికి ఎంతోస్తే అంత మాట్లాడటం సరికాదు

    నోటికి ఎంతోస్తే అంత మాట్లాడటం సరికాదు

    బాలకృష్ణ నోటికి ఎంతోస్తే అంత మాట్లాడటం సరికాదు. అర్జంటుగా మీ మాటలు వెనకకు తీసుకోవాలి. మీరు అలా మాట్లాడుతానంటే పదిరెట్లు మాట్లాడేందుకు చాలా మంది ఉన్నారు. నోరు అదుపులో పెట్టుకో. భూములు పంచుకొంటున్నారంటూ చాలా పెద్ద తప్పు మాట్లాడారు. మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరుస్తూ మరో పెద్ద తప్పు మాట మాట్లాడారు. మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి అని నాగబాబు అన్నారు.

    ప్రైవేట్ మీటింగులు ఎందుకు

    ప్రైవేట్ మీటింగులు ఎందుకు

    టాలీవుడ్‌లో షూటింగులకు, సినిమా థియేటర్ల ఓపెన్ చేయడానికి జరుగుతున్న చర్చలు సరైన దిశలో సాగడం లేదు. ఫిలిం ఛాంబర్‌ను వదిలేసి సొంత నివాసాల్లో ప్రైవేట్ కార్యక్రమంగా జరుపుతున్నారు. చిరంజీవి నివాసంలో, అన్నపూర్ణ స్టూడియోలో సమావేశాలు పెట్టడం ఫిలిం ఛాంబర్‌ ప్రతిష్టను కించపరచడమే అని నిర్మాత ప్రసన్నకుమార్ ఆరోపించారు.

    Recommended Video

    Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
    బాలకృష్ణ వ్యాఖ్యలపై సీ కల్యాణ్ వివరణ

    బాలకృష్ణ వ్యాఖ్యలపై సీ కల్యాణ్ వివరణ

    బాలకృష్ణ వ్యాఖ్యలపై నిర్మాత కల్యాణ్ స్పందిస్తూ.. తాను ఇప్పటికే బాలయ్యతో మధ్యాహ్నం మాట్లాడాను. అన్ని విషయాలకు క్లారిటీ ఇచ్చాను. ఆయన సంతృప్తి చెందారు. ఆయన మా హీరో. ఆయన తరఫును నేను సమావేశాల్లో పాల్గొంటున్నాను అని కల్యాణ్ పేర్కొన్నారు. ఇంతటితో ఈ సమస్య ముగిసిందని పేర్కొన్నారు.

    English summary
    NTR 92nd birthday celebrations are going on high note by Fans. On NTR birthday celebrations, Balakrishna made Emotional speech. He said NTR is the real hero in the society.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X